Share News

Today Gold and Silver Rates: మహిళలకు గుడ్ న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధరలు

ABN , Publish Date - Dec 22 , 2024 | 08:18 AM

రూ. 80 వేల మార్క్‌ను చేరిన బంగారం ధర ఇటీవల తగ్గుముఖం పట్టింది. అయితే ఈ ధరలు మళ్లీ తగ్గాయి.

Today Gold and Silver Rates: మహిళలకు గుడ్ న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధరలు

ఇటీవల వరకు బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర 80 వేల మార్క్ ను సైతం దాటింది. కానీ గత కొద్ది రోజులుగా వాటి ధరలు కొద్ది కొద్దిగా తగ్గుతూ దిగి వస్తున్నాయి. ఆదివారం 22 క్యారెట్ల బంగారం 100 గ్రాముల ధర 7,10,000 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం 100 గ్రాముల ధర 7,74,500 గా ఉంది. గత వారం కిలో వెండి ధర సైతం రూ. లక్ష మార్కుకు చేరుకొంది. ఇక వెండి ధరను పరిశీలిస్తే.. వాటి ధర సైతం తగ్గుతూ వస్తోంది. ఈ వారం ప్రారంభంలో కిలో వెండి ధర రూ. 99,900 ఉండగా.. నేడు.. అంటే ఆదివారం కిలో వెండి ధర రూ. 99,000గా ఉంది.


ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.7,74,500, 22 క్యారెట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.7,10,000గా ఉంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో మాత్రం దేశంలోని వివిధ ప్రాంతాల కంటే.. పసిడి ధర గరిష్టంగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.7,76,000గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 7,11,500గా ఉంది.


ఇక నేడు ప్రధాన నగరాల్లో బంగారం ధర (100 గ్రాములు) ఎంత ఉందంటే..

హైదరాబాద్ లో రూ. 7,10,000 (22 క్యారెట్లు), రూ. 7,74,500 (24 క్యారెట్లు)

విజయవాడ: రూ. 7,10,000 (22 క్యారెట్లు), రూ.7,74,500 (24 క్యారెట్లు)

విశాఖపట్నం: రూ. 7,10,000 (22 క్యారెట్లు), రూ. 7,74,500 ( 24 క్యారెట్లు)


ఇక నేడు ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర.. ఏ విధంగా ఉందంటే..

హైదరాబాద్: రూ. 99,000

విజయవాడ: రూ. 99,000

విశాఖపట్నం: రూ. 99,000


ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

దేశ వాణిజ్య రాజధాని ముంబయి: రూ. 7,10,000 (22 క్యారెట్లు), రూ. 7,74,500 (24 క్యారెట్లు)

దేశ రాజధాని ఢిల్లీ: రూ.7,11, 500 (22 క్యారెట్లు), రూ.7,76, 000(24 క్యారెట్లు)

కోల్‌కతా: రూ.7,10,000 (22 క్యారెట్లు), రూ. 7,74,500 (24 క్యారెట్లు)

చెన్నై: రూ. 7,10,000 (22 క్యారెట్లు), రూ. 7,74,500 (24 క్యారెట్లు)

For Business News And Telugu News

Updated Date - Dec 22 , 2024 | 08:23 AM