Share News

Today Gold Rates: గుడ్ న్యూస్.. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Dec 25 , 2024 | 07:14 AM

ఈ ఏడాది నవంబర్ నెలలో తులం రూ.84 వేలుగా ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పిన పసిడి ధరలు కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. 25 డిసెంబర్ 2024న 22 క్యారెట్ల పసిడి ధర రూ.70,890 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,340 గా ఉంది.

 Today Gold Rates: గుడ్ న్యూస్.. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
Today Gold Rates

బిజినెస్ న్యూస్: ఈ ఏడాది నవంబర్ నెలలో తులం రూ.84 వేలుగా ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పిన పసిడి ధరలు కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. 25 డిసెంబర్ 2024న 22 క్యారెట్ల పసిడి ధర రూ.70,890 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,340 గా ఉంది. అయితే ధరలు తగ్గేందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ ధర పుంజుకుంది. ప్రస్తుతం డాలర్ రూ.85 వద్ద ట్రేడ్ అవుతోంది. దీంతో అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్ల వ్యాల్యూ పెరిగింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు బాండ్ మార్కెట్ వైపు మెుగ్గుచూపడంతో బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. మరోవైపు అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా గోల్డ్ మార్కెట్ పడిపోతూ వస్తోంది. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రక్షణాత్మకమైన నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా బంగారం ధరలు పడిపోయేందుకు తోడైంది.


దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఇవే..

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో నేడు 22 క్యారెట్ల తులం బంగారం ధర గ్రాముకు రూ.10 తగ్గి రూ.70,890 ఉండగా, 24 క్యారెట్ల ధర గ్రాముకు రూ.10 తగ్గి రూ. 77,340 గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 71,040 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.77,490 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.70,890 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.77,340 గా ఉంది. కోల్‌కతాలో 10 గ్రాముల పసిడి ధర రూ. 70,890 ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,340 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,890 ఉండగా, 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 77,340 గా ఉంది.


కాగా, దేశవ్యాప్తంగా వెండి ధరలు సైతం కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి ధరతో పోలిస్తే కిలోకు రూ.100 తగ్గి రూ.98,800 వద్ద వెండి ట్రేడ్ అవుతోంది. ఢిల్లీలో కిలో వెండి రూ.98,800 ఉండగా, చెన్నైలో రూ.98,800, కోల్‌కతాలో రూ.91,300 గా ఉంది. అలాగే ఆర్థిక రాజధాని ముంబైలో రూ.91,300 వద్ద కొనసాగుతోంది.

Updated Date - Dec 25 , 2024 | 07:35 AM