Jobs: గుడ్‌న్యూస్ త్వరలో 3.39 కోట్ల ఉద్యోగాలు.. ఏ రంగంలో ఉంటాయంటే.
ABN , Publish Date - Nov 13 , 2024 | 03:48 PM
భారతదేశంలో ఉద్యోగ సంక్షోభం త్వరలో ముగుస్తుందని ఓ సర్వే తెలిపింది. దీంతో కోట్లాది మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని వెల్లడించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
దేశంలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. గత కొన్ని నెలలుగా లేఆఫ్స్ సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న ఉద్యోగులకు ఉపశమనం లభించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో 2023 నుంచి 2028 మధ్య భారతదేశంలో శ్రామిక శక్తి 423.73 మిలియన్ల నుంచి 457.62 మిలియన్లకు పెరుగుతుందని ఓ నివేదిక తెలిపింది. ఈ క్రమంలో వచ్చే ఐదేళ్లలో కార్మికుల సంఖ్య 33.89 మిలియన్లకు అంటే దాదాపు 3.39 కోట్లకు పెరుగనుంది. ఈ నేపథ్యంలో వచ్చే రోజుల్లో అనేక మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
2028 నాటికి
AI ప్లాట్‌ఫాం ఫర్ బిజినెస్ ట్రాన్స్‌ఫర్మేషన్ సర్వీస్‌నౌ నిర్వహించిన కొత్త రిసేర్చ్ ప్రకారం కొత్త టెక్నాలజీ భారతదేశంలోని కీలక వృద్ధి రంగాలలో నైపుణ్యాలకు కొత్త గుర్తింపును ఇస్తుంది. ఇది 2028 నాటికి 2.73 మిలియన్ల కొత్త టెక్నాలజీ సంబంధిత ఉద్యోగాలను సృష్టిస్తుంది. ప్రముఖ కంపెనీ పియర్సన్ నిర్వహించిన పరిశోధన ప్రకారం రిటైల్ రంగం ఉపాధి వృద్ధికి దారితీసేందుకు సిద్ధంగా ఉందని తేలింది. ఈ రంగం విస్తరణకు 6.96 మిలియన్ల అదనపు కార్మికులు అవసరం. రిటైల్ రంగం తర్వాత, తయారీ రంగంలో 1.50 మిలియన్లు, విద్యలో 0.84 మిలియన్లు, ఆరోగ్య సేవల్లో 0.80 మిలియన్ల ఉద్యోగాలు సృష్టించబడతాయి.
పెరగనున్న టెక్నాలజీ సంబంధిత ఉద్యోగాలు
భారతదేశ అభివృద్ధిలో ముఖ్యంగా అధునాతన సాంకేతిక నైపుణ్యాల పరంగా AI ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని సర్వీస్‌నౌ ఇండియా టెక్నాలజీ అండ్ బిజినెస్ సెంటర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ సుమీత్ మాథుర్ అన్నారు. నిపుణుల కోసం AI అధిక నాణ్యతగల అవకాశాలను సృష్టిస్తుందన్నారు. ఇది కాకుండా డిజిటల్ కెరీర్‌లను నిర్మించడంలో AI వారికి సహాయం చేస్తుందని వెల్లడించారు.
కొత్తగా ఎన్ని పోస్టులంటే..
దీంతోపాటు సిస్టమ్స్ సాఫ్ట్‌వేర్ డెవలపర్లు (48,800 కొత్త ఉద్యోగాలు), డేటా ఇంజనీర్లు (48,500 కొత్త ఉద్యోగాలు) ఉన్నాయని చెప్పారు. వెబ్ డెవలపర్‌లు, డేటా అనలిస్ట్‌లు, సాఫ్ట్‌వేర్ టెస్టర్‌ల కోసం కూడా కొత్త అవకాశాలు సృష్టించబడతాయని తెలిపారు. (వరుసగా 48,500, 47,800, 45,300 పోస్ట్‌లుగా అంచనా వేయబడింది). ఇది కాకుండా ఈ నివేదిక ప్రకారం, డేటా ఇంటిగ్రేషన్ స్పెషలిస్ట్, డేటాబేస్ ఆర్కిటెక్ట్, డేటా సైంటిస్ట్, కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మేనేజర్ వంటి పోస్టుల సంఖ్య 42,700 నుంచి 43,300కి పెరుగుతుందని అంచనా.
ఇవి కూడా చదవండి:
Life Certificate 2024: మీ పెన్షన్ ఆగకుడదంటే ఇలా చేయండి.. కొన్ని రోజులే గడువు..
Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Read More International News and Latest Telugu News