Share News

Bank Accounts: ఒకరికి ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉండాలి.. ఎక్కువ ఉంటే ఇబ్బందులేంటి?

ABN , Publish Date - Aug 05 , 2024 | 04:10 PM

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా(social media)లో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలున్న (bank accounts) వ్యక్తులకు భారీ జరిమానా(fine) విధించబడుతుందనే సమాచారం చక్కర్లు కోడుతోంది. అయితే ఇందులో నిజమెంత అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Bank Accounts: ఒకరికి ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉండాలి.. ఎక్కువ ఉంటే ఇబ్బందులేంటి?
How many bank accounts one person

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా(social media)లో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలున్న (bank accounts) వ్యక్తులకు భారీ జరిమానా(fine) విధించబడుతుందనే సమాచారం చక్కర్లు కోడుతోంది. ఈ మెసేజ్ వైరల్ అవుతుండడంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వ ప్రెస్ ఏజెన్సీ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ వైరల్ సందేశంపై క్లారిటీ ఇచ్చింది.

వైరల్ అవుతున్న సందేశాన్ని పరిశోధించి ఆ పోస్టులో నిజం లేదని స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాల ప్రకారం ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు నిర్వహిస్తే పెనాల్టీ విధించడం ఉండదని తెలిపింది. ఆర్బీఐ అటువంటి మార్గదర్శకాలను జారీ చేయలేదని స్పష్టం చేసింది. ఇలాంటి ఫేక్ న్యూస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.


బ్యాంకు ఖాతా

అయితే ప్రజలు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటే ఏదైనా సమస్యలు ఉంటాయా అనే ప్రశ్నలు కూడా పలువురిలో తలెత్తుతున్నాయి. ఐదు కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు తెరిస్తే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు బ్యాంకు ఖాతాదారుల మదిలో మొదలుతున్నాయి. మన డిపాజిట్లను భద్రంగా ఉంచుకోవాలన్న విషయానికి వస్తే మనకు వెంటనే బ్యాంకు గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలకు బ్యాంకు ఖాతా తప్పనిసరిగా మారిపోయింది. దీంతో పాటు బ్యాంక్ మన ఆర్థిక లావాదేవీలను(bank transactions) సులభతరం చేస్తుంది. అదే సమయంలో మన డిపాజిట్లను కూడా సురక్షితంగా ఉంచుతుంది. ఈ క్రమంలో ఒక వ్యక్తి వివిధ రకాల బ్యాంకు ఖాతాలను తెరిచి, వాటి ద్వారా చిన్న, పెద్ద ఆర్థిక లావాదేవీలను నిర్వహిస్తాడు.


అలా చేయకపోతే

కాబట్టి ఒక వ్యక్తి ఎన్ని బ్యాంకు ఖాతాలనైనా(bank accounts) కల్గి ఉండవచ్చు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి నిబంధన పెట్టలేదు. కానీ కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం మూడు కంటే ఎక్కువ సేవింగ్ ఖాతాలు కలిగి ఉండటం సమస్యలను కలిగిస్తుంది. ఎందుకంటే జీతం ఖాతా తప్ప ఇతర ఖాతాలలో కనీస మొత్తం బ్యాలెన్స్(minimum balance) మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మూడు కంటే ఎక్కువ బ్యాంకు సేవింగ్ ఖాతాలు తెరిస్తే ఆ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయడంతోపాటు ఎప్పటికప్పుడు ఆర్థిక లావాదేవీలు కూడా జరపాలి.

జరిమానా

అలా చేయకపోతే ఆ ఖాతాకు బ్యాంకు జరిమానాలను విధిస్తుంది. అంతేకాదు మొత్తానికే 6 నెలలకుపైగా బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోతే ఆ ఖాతాను డియాక్టివేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఖాతాలు తెరిచి ఉపయోగించకుండా ఉంటే వాటిని క్లోజ్ చేసుకోవడం మంచిది. లేదంటే ప్రతి నెల లేదా ఏడాదికి జరిమానా రూపంలో పన్నులను వసూలు చేస్తారు. కాబట్టి అవసరం మేరకు బ్యాంకు ఖాతాలను ఉంచుకుని మిగతావి రద్దు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి:

Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం.. ఏటా 50 లక్షలకుపైగా సంపాదించే ఛాన్స్!


Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్

Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 05 , 2024 | 04:13 PM