Share News

Aadhar Card Security: మీ ఆధార్ కార్డ్ దుర్వినియోగం కాకుండా తెలుసుకోవడం ఎలా..

ABN , Publish Date - Dec 22 , 2024 | 09:18 PM

ఆధార్ కార్డు ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగత గుర్తింపు కార్డుగా ఉంది. అయితే దీనిని దుర్వినియోగం కాకుండా కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. అయితే అందుకోసం ఏం చేయాలి, ఎలా కాపాడుకోవాలనే విషయాలను ఇక్కడ చూద్దాం.

Aadhar Card Security: మీ ఆధార్ కార్డ్ దుర్వినియోగం కాకుండా తెలుసుకోవడం ఎలా..
Aadhar Card Security

ప్రస్తుతం భారతదేశంలో ఆధార్ కార్డ్ (Aadhar Card) అనేది వ్యక్తిగత గుర్తింపు కార్డుగా అనేక ప్రభుత్వ సేవలు, ప్రయోజనాల కోసం అవసరమైన ఒక కీలక పత్రంగా మారిపోయింది. కానీ ఆధార్ కార్డు ఎక్కువ వినియోగం కూడా దుర్వినియోగానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అనేక ప్రాంతాల్లో మీ ఆధార్ వివరాలను నిర్లక్ష్యంగా ఉపయోగించడం వల్ల కీలకమైన సమాచారం పలువురు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే మీ ఆధార్ దుర్వినియోగాన్ని తెలుసుకోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఇక్కడ తెలుసుకుందాం.


ఆధార్ నంబర్ దుర్వినియోగాన్ని ఎలా తెలుసుకోవాలి?

  • మీ ఆధార్ నంబర్‌కు సంబంధించి దుర్వినియోగాన్ని తెలుసుకోవడానికి మీరు కొన్ని దశలను పాటించాల్సి ఉంటుంది. దీని కోసం మీరు ముందుగా

  • ముందుగా MyAadhaar (https://uidai.gov.in/en/) పోర్టల్‌ని సందర్శించండి

  • MyAadhaar పోర్టల్‌లో వచ్చిన లాగిన్ పేజీలో మీ ఆధార్ నంబర్‌ను (12 అంకెల నంబర్) నమోదు చేయండి

  • ఆ క్రమంలో క్యాప్చా కోడ్‌ని నమోదు చేసిన తర్వాత "OTPతో లాగిన్" బటన్‌పై క్లిక్ చేయండి

  • మీరు నమోదు చేసిన ఆధార్ నంబర్‌కు సంబంధించి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP పంపబడుతుంది

  • ఆ OTPను నమోదు చేసి, ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయండి

  • ఆ తర్వాత వచ్చిన సర్వీసెస్ విండోలో అథేంటికేషన్ హిస్టరీ ఆప్షన్ సెలక్ట్ చేయండి

  • అక్కడ, మీ ఆధార్ ఉపయోగించిన అన్ని సందర్భాలను వీక్షించడానికి మీ తేదీని ఎంచుకోండి

  • ఆ క్రమంలో మీరు ఏదైనా అనధికార విషయాన్ని గుర్తిస్తే, వెంటనే దానిని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI)కి తెలపండి

  • వారు ఈ విషయంపై దర్యాప్తు చేసి, కఠిన చర్యలు తీసుకుంటారు.

  • నో రికార్డ్స్ ఫౌండ్ అని వస్తే మీ కార్డ్ సురక్షితమని అర్థం


ఆధార్ కార్డ్‌ను ఆన్‌లైన్‌లో లాక్ చేయడం ఎలాగంటే..

  • MyAadhaar పోర్టల్‌లో వచ్చిన లాగిన్ పేజీలో మీ ఆధార్ నంబర్‌ను (12 అంకెల నంబర్) నమోదు చేయండి

  • ఆ క్రమంలో క్యాప్చా కోడ్‌ని నమోదు చేసిన తర్వాత "OTPతో లాగిన్" బటన్‌పై క్లిక్ చేయండి

  • మీరు నమోదు చేసిన ఆధార్ నంబర్‌కు సంబంధించి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP పంపబడుతుంది

  • ఆ OTPను నమోదు చేసి, ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయండి

  • ఆ తర్వాత వచ్చిన సర్వీసెస్ విండోలో "లాక్/అన్‌లాక్ ఆధార్" ఆప్షన్‌ను ఎంచుకోండి

  • తర్వాత నెక్ట్స్ బటన్ నొక్కి అక్కడ వచ్చిన అండర్ స్టాండ్ మై ఆధార్ కార్డ్ ఆప్షన్ ఎంచుకుని నెక్ట్స్ నొక్కండి

  • దీంతో మీ వర్చవల్ ఆధార్ ID సురక్షితంగా ఉంటుంది


సురక్షితంగా ఉంచుకోవడం

ఆధార్ కార్డ్‌లో సున్నితమైన వ్యక్తిగత వివరాలు, బయోమెట్రిక్ సమాచారం ఉంటుంది. ఈ కార్డు దుర్వినియోగం జరిగినప్పుడు ఆ వ్యక్తి కార్డును ఆర్థిక, నేరాల సంబంధిత మోసాల కోసం వినియోగిస్తే పలు కేసుల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఆధార్ కార్డును సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో దీని ఉపయోగం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Cyber Protection: సైబర్ మోసాల నుంచి మీ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఇలా రక్షించుకోండి..


Public Holidays: 2025లో పబ్లిక్ హాలిడేస్ ఎన్ని రోజులో తెలుసా..

Next Week IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని కంపెనీలంటే..

Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..


Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..

Top Mutual Funds: గత ఐదేళ్లలో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే..

Choti Choti Savings: ఈ చిన్నారి పొదుపును చూస్తే షాక్ అవుతారు.. వైరల్ వీడియో

Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..


Read More Business News and Latest Telugu News

Updated Date - Dec 22 , 2024 | 09:19 PM