Viral News: 15 గంటల షిఫ్టులో ఏడ్చాను.. సోషల్ మీడియాలో టెక్ ఉద్యోగి పోస్ట్ వైరల్
ABN , Publish Date - Dec 21 , 2024 | 04:31 PM
ఒక భారతీయ టెక్ ఉద్యోగి తాను ఎదుర్కొన్న 15 గంటల ఫిఫ్ట్ టైమింగ్, స్టార్టప్ సహ వ్యవస్థాపకుడి వేధింపుల గురించి ఆవేదన వ్యక్తం చేశారు. ఒకానొక సమయంలో తాను గూగుల్ మీట్‌లో ఏడ్చానని వెల్లడించారు. అయితే అసలు ఏం జరిగిందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఒక భారతీయ టెక్ ఉద్యోగి (Tech Employee) కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరు ఉద్యోగులతో అసభ్యంగా ప్రవర్తించారని, తరచూ మాటలతో దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు. ఆ క్రమంలో 15 గంటల షిఫ్టు సమయంలో మానసిక వేధింపులతో ఇబ్బంది పెట్టేవారని పేర్కొన్నారు. ఆ క్రమంలోనే గూగుల్ మీట్‌లో టెక్ లీడ్ ముందు తాను ఏడ్చానని, మానసిక ఒత్తిడికి గురయ్యానని టెక్ ఉద్యోగి వెల్లడించాడు. అందుకు సంబంధించిన విషయాలను భారతీయ టెక్ ఉద్యోగి ఇటీవల రీడిట్‌లో ఉద్వేగభరితమైన పోస్ట్ చేసి పంచుకున్నారు.
15 గంటల షిఫ్ట్
ఇప్పుడు దీన్ని ఎలా ఎదుర్కోవాలో తనకు తెలియడం లేదన్నారు. తన కంపెనీకి చెందిన ముగ్గురు సహ వ్యవస్థాపకుల్లో ఒకరు టెక్ లీడ్‌గా పనిచేస్తున్నారని, తరచూ ఉద్యోగులతో అనుచితంగా ప్రవర్తించేవారని ఆయన అన్నారు. ఆ టెక్ లీడ్స్ తనను, ఇతర ఉద్యోగులను 15 గంటల పాటు పని చేయమని బలవంతం చేశారని, పని గురించి స్పష్టమైన మార్గదర్శకాలు ఏమి లేవని ఆరోపించారు. ఈ క్రమంలో తనకు కన్నీళ్లు తెప్పించిన సంఘటనను గుర్తు చేసుకుంటూ.. ప్రాజెక్టుపై ఎలాంటి సూచనలు లేవని ఫిర్యాదు చేయగా.. సాయం చేయకుండా దూషించారని పేర్కొన్నారు.
మానసికంగా పని చేయలేని స్థితిలో..
ఆ క్రమంలో తాను భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయానని, చివరకు తాను పని చేయడానికి మానసికంగా సిద్ధంగా లేనన్నారు. దీంతోపాటు కొన్ని గంటల తర్వాత సెలవు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో చేసిన ఈ పోస్ట్‌కు అనేక మంది నుంచి పెద్ద ఎత్తున కామెంట్లు వచ్చాయి. చాలా మంది వినియోగదారులు ఒత్తిడిని ఎదుర్కొవాలని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని కోరారు. మరికొంత మంది మాత్రం కొత్త ఉద్యోగం వెతుక్కోవాలని సలహా ఇచ్చారు.
ఫిర్యాదు చేయాలి..
మరొక యూజర్ అయితే మీ భావోద్వేగాలను వ్యక్తీకరించడం ఫర్వాలేదు. కానీ ఆ ప్రాంతం నుంచి మీరు వెంటనే బయటపడటానికి ప్రయత్నించాలని సూచించారు. వారు మిమ్మల్ని ఒక వనరుగా చూస్తున్నారు. వీలైనంత వరకు మిమ్మల్లి ఉపయోగించుకోవాలని మాత్రమే చూస్తున్నారని పేర్కొన్నారు. మరోకరు దీనిపై స్టార్టప్‌లలో ఎక్కువ గంటలు పని చేస్తున్న ఉద్యోగులు, అనారోగ్య వాతావరణంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ప్రస్తావించారు.
మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోవడం కూడా చాలా అవసరమని పేర్కొన్నారు. పని ప్రదేశాల్లో ఉద్యోగుల పట్ల గౌరవప్రదంగా ప్రవర్తించడం, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరమని వెల్లడించారు. ఇలాంటి వారి విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయాలని మరికొంత మంది సూచనలు జారీ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
GST Council: జీవిత, ఆరోగ్య బీమాపై పన్ను తగ్గింపు నిర్ణయంలో ట్విస్ట్.. ఈసారి కూడా..
Top Mutual Funds: గత ఐదేళ్లలో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే..
Spherical Egg: ఒక కోడి గుడ్డు ధర రూ. 21 వేలు.. స్పెషల్ ఏంటో తెలుసా..
Choti Choti Savings: ఈ చిన్నారి పొదుపును చూస్తే షాక్ అవుతారు.. వైరల్ వీడియో
Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Read More Business News and Latest Telugu News