Share News

PAN Card: బిగ్ అలర్ట్.. పాన్ కార్డ్ హోల్డర్స్ మే 31వ తేదీలోపు ఆ పని చేయకపోతే..

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:35 PM

పాన్ కార్డ్ హోల్డర్లకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ తెరమీదకి వచ్చింది. యూజర్లు నిర్ణీత సమయంలోపు తన పాన్ కార్డ్‌ని ఆధార్‌తో లింక్ చేయకపోతే.. చర్యలు తీసుకుంటామని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది. పన్ను చెల్లింపుదారులు మే 31వ తేదీ లోగా తమ పాన్‌ను ఆధార్‌తో అనుసంధానిస్తే..

PAN Card: బిగ్ అలర్ట్.. పాన్ కార్డ్ హోల్డర్స్ మే 31వ తేదీలోపు ఆ పని చేయకపోతే..

పాన్ కార్డ్ (PAN Card) హోల్డర్లకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ తెరమీదకి వచ్చింది. యూజర్లు నిర్ణీత సమయంలోపు తన పాన్ కార్డ్‌ని ఆధార్‌తో (Aadhar Card) లింక్ చేయకపోతే.. చర్యలు తీసుకుంటామని ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) హెచ్చరించింది. పన్ను చెల్లింపుదారులు మే 31వ తేదీ లోగా తమ పాన్‌ను ఆధార్‌తో అనుసంధానిస్తే.. టీడీఎస్‌ షార్ట్‌ డిడక్షన్‌ కోసం పన్ను చెల్లింపుదారులపై ఏ చర్యలూ ఉండబోవని ఆ శాఖ తెలిపింది. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం.. బయోమెట్రిక్ ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయకపోతే, సాధారణంగా వర్తించే రేటుకు రెండింతల టీడీఎస్‌ మినహాయింపులుంటాయి.


ధోనీకేమో అలా.. రుతురాజ్‌కి ఇలా.. ఇదెక్కడి న్యాయం?

మరోవైపు.. లావాదేవీ సమయంలో పాన్‌ ఇన్‌ఆపరేటివ్‌లో (ఆధార్‌తో పాన్ లింక్ చేయబడని యూజర్లు) ఉన్న ట్యాక్స్‌పేయర్లకు టీడీఎస్‌/టీసీఎస్‌ షార్ట్‌ డిడక్షన్‌/కలెక్షన్‌ ఎగవేతకు పాల్పడ్డారన్న నోటీసులు వస్తున్నట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) తెలిపింది. ఈ మేరకు తమకు పన్ను చెల్లింపుదారుల నుంచి ఫిర్యాదులు అందినట్లు పేర్కొంది. ఇలాంటి కేసుల్లో.. మే 31వ తేదీన లేదా అంతకన్నా ముందే ఆధార్‌తో లింక్ చేయబడిన పాన్ కార్డ్స్ యాక్టివేట్ అయితే, సాధారణ రేటుకే టీడీఎస్‌/టీసీఎస్‌ వసూలు ఉంటుందని సీబీడీటీ స్పష్టం చేసింది. ఈ అంశంపై ఏకేఎమ్ గ్లోబల్ వద్ద పార్ట్నర్ అయిన సందీప్ సెహగల్ మాట్లాడుతూ.. మే 31లోపు ఆధార్‌ను పాన్‌తో లింక్ చేయాలని, తద్వారా తక్కువ పన్ను చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నారు.

తెలంగాణలో మళ్లీ మొదలైన ఫ్లెక్సీ వార్.. మోదీ హామీలను టార్గెట్ చేస్తూ..

ఇదిలావుండగా.. 2017 జులై 1వ తేదీ కంటే ముందు జారీ చేసిన పాన్ కార్డులను ఆధార్‌తో అనుసంధాని చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. ఈ ప్రక్రియని పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పటి నుంచి గడువు పొడిగిస్తూ వచ్చింది. 2022 జూన్‌ 30 వరకు ఆధార్‌తో పాన్‌ అనుసంధానం ఉచితంగానే జరిగింది. ఆ తర్వాత జులై 1వ తేదీ నుంచి 2023 జూన్ 30 వరకు రూ.1,000 ఆలస్య రుసుముతో అనుమతించారు. అప్పటికీ లింక్‌ అవ్వని పాన్‌ కార్డులు.. జులై 1వ తేదీ నుంచి ఇన్‌ఆపరేటివ్‌లోకి వెళ్లాయి. దీనిని ఆపరేషన్‌లోకి తీసుకురావాలంటే.. రూ.1000 ఫైన్ తప్పకుండా కట్టాల్సి ఉంటుంది. కానీ.. ఈ ప్రక్రియ పూర్తవ్వడానికి 30 రోజుల సమయం పడుతుంది.

Read Latest Business News and Telugu News

Updated Date - Apr 25 , 2024 | 01:35 PM