Share News

Chennai Super Kings: ధోనీకేమో అలా.. రుతురాజ్‌కి ఇలా.. ఇదెక్కడి న్యాయం?

ABN , Publish Date - Apr 25 , 2024 | 09:57 AM

క్రికెట్ మ్యాచ్‌లో ఫలితం ఎలా వచ్చినా.. దాన్ని ఆయా జట్టు కెప్టెన్‌లకే ఆపాదిస్తారు. అంటే.. మ్యాచ్ గెలిస్తే కెప్టెన్ తెలివిగా రాణించాడని, ఓడిపోతే కెప్టెన్ విఫలమయ్యాడని కామెంట్లు వస్తుంటాయి. కానీ.. ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ విషయంలో మాత్రం కాస్త భిన్నమైన వాదనలు

Chennai Super Kings: ధోనీకేమో అలా.. రుతురాజ్‌కి ఇలా.. ఇదెక్కడి న్యాయం?
MS Dhoni vs Ruturaj Gaikwad

క్రికెట్ మ్యాచ్‌లో ఫలితం ఎలా వచ్చినా.. దాన్ని ఆయా జట్టు కెప్టెన్‌లకే ఆపాదిస్తారు. అంటే.. మ్యాచ్ గెలిస్తే కెప్టెన్ తెలివిగా రాణించాడని, ఓడిపోతే కెప్టెన్ విఫలమయ్యాడని కామెంట్లు వస్తుంటాయి. కానీ.. ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) విషయంలో మాత్రం కాస్త భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. సీఎస్కే గెలిచినప్పుడు ఎంఎస్ ధోనీపై (MS Dhoni) ప్రశంసలు.. ఓడినప్పుడు మాత్రం కెప్టెన్ రుతురాజ్ గైక్వెడ్‌పై (Ruturaj Gaikwad) విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా.. ఎల్‌ఎస్‌జీతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఘోర పరాజయం చవిచూసిన తర్వాత రుతురాజ్ కెప్టెన్సీపై అందరూ వేలెత్తారు. చెత్త కెప్టెన్సీ కారణంగానే సీఎస్కే మ్యాచ్ ఓడిపోయిందంటూ.. ఫ్యాన్స్‌తో పాటు కొందరు మాజీ ఆటగాళ్లూ పెదవి విరిచారు. అలాంటి వారికి నవ్‌జోత్ సింగ్ సిద్దూ (Navjot Singh Siddhu) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.


భారత టీ20 వరల్డ్‌కప్ స్వ్కాడ్‌లో ఆ ముగ్గురు స్టార్స్‌కి నో ఛాన్స్..?

ఎల్‌ఎస్‌జీ చేతిలో సీఎస్కే మ్యాచ్ ఓడిపోయిన తర్వాత సిద్ధూ, అంబటి రాయుడు మధ్య ఓ ఆసక్తికర సంభాషణ సాగింది. చెన్నై ఓటమికి రుతురాజ్‌ చెత్త కెప్టెన్సీ కారణమని రాయుడు పేర్కొన్నాడు. డెత్‌ ఓవర్లలో రుతురాజ్‌ ఫీల్డింగ్‌ను మొహరించడంలో విఫలమయ్యాడని, కెప్టెన్‌గా అతని అనుభవ రాహిత్యం స్పష్టంగా బయటపడిందని విమర్శించాడు. స్టోయినిస్‌ విధ్వంసకర మూడ్‌లో ఉన్నప్పుడు రుతురాజ్‌ సిల్లీ ఫీల్డ్‌ సెటప్‌ చేసి.. అతను మరింత రెచ్చిపోయేలా చేశాడని చెప్పుకొచ్చాడు. ఇందుకు సిద్దూ బదులిస్తూ.. చెన్నై గెలిచినప్పుడు ధోనీకి క్రెడిట్‌ ఇచ్చి, ఓడినప్పుడు రుతురాజ్‌ను నిందించడం సమంజసం కాదన్నాడు. గెలిచినప్పుడు ధోనీని పొగిడిన నోళ్లు.. ఓడినప్పుడు కూడా అతన్నే నిందించాలని నొక్కి చెప్పాడు. అంతేకాదు.. సీఎస్‌కే కెప్టెన్సీని ఇంకా ధోనీనే మోస్తున్నాడన్న విషయం బహిరంగ సత్యమని తెలిపాడు. రుతురాజ్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు.. వెనకుండి జట్టుని నడిపిస్తోంది మాత్రం ధోనీనే అని సిద్దూ అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్ చరిత్రలోనే.. మోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డ్

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. రుతురాజ్ (108 నాటౌట్) శతక్కొట్టడంతో పాటు శివమ్ దూబే (66) అర్థశతకంతో మెరుపులు మెరిపించడంతో.. చెన్నై అంత భారీ స్కోరు చేయగలిగింది. లక్ష్య ఛేధనలో భాగంగా.. ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసి, ఎల్‌ఎస్‌జీ ఘనవిజయం సాధించింది. మార్కస్ స్టోయినిస్ (124 నాటౌట్) సెంచరీతో ఊచకోత కోసి.. జట్టుని విజయతీరాలకు చేర్చాడు. అతనికి పూరన్‌ (34), దీపక్‌ హుడా (17) కూడా సహకరించారు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Apr 25 , 2024 | 09:57 AM