Services Sector: 5 నెలల గరిష్టానికి సేవల రంగం వృద్ధి.. ఈసారి ఏకంగా..
ABN , Publish Date - Sep 04 , 2024 | 03:18 PM
కార్యకలాపాల్లో వేగవంతమైన పురోగమనం, అధిక వ్యాపార వృద్ధి కారణంగా భారతదేశ సేవల రంగం వృద్ధి ఆగస్టులో పుంజుకుంది. ఈ క్రమంలో ఐదు నెలల గరిష్ట స్థాయికి చేరుకుందని బుధవారం విడుదల చేసిన వ్యాపార సర్వే తెలిపింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
భారత ఆర్థిక వ్యవస్థ(economy) క్రమంగా పుంజుకుంటుంది. ఈ క్రమంలో జులైతో పోలిస్తే ఆగస్టులో భారత సేవల రంగం(services sector) వృద్ధి పెరిగింది. విశేషమేమిటంటే మార్చి తర్వాత అత్యంత వేగంగా పెరిగింది. ఈ సమాచారం నెలవారీ సర్వేలో ఇవ్వబడింది. HSBC ఇండియా భారత్ సర్వీస్ PMI వ్యాపార కార్యకలాపాల సూచిక ప్రకారం జులైలో 60.30 ఉండగా, ఇది కాస్తా ఆగస్టులో 60.90కి చేరుకుంది. ఉత్పాదకత లాభాలు, సానుకూల డిమాండ్ పోకడలు దీనికి ఎక్కువగా మద్దతునిచ్చాయని నివేదిక తెలిపింది.
బలమైన వృద్ధి
సేవల రంగంలో వేగవంతమైన వ్యాపార కార్యకలాపాల కారణంగా భారతదేశం మొత్తం PMI ఆగస్టులో బలమైన వృద్ధిని(growth) కనబరిచిందని HSBC చీఫ్ ఎకనామిస్ట్ ప్రంజూల్ భండారీ అన్నారు. కొత్త కాంట్రాక్టులు, ప్రత్యేకించి దేశీయ ఒప్పందాలు పెరగడం వల్ల ఈ వృద్ధి పెరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ధరల గురించి మాట్లాడితే ముడి పదార్థాల ధర ఆరు నెలల్లో పుంజుకుంది. ఈ క్రమంలో తయారీ, సేవా రంగాలలో కూడా ఇదే ధోరణి కనిపించింది. ఈ నేపథ్యంలో ఇది ఆగస్టులో అవుట్‌పుట్ ధరల ద్రవ్యోల్బణం తగ్గడానికి దారితీసిందని వెల్లడించారు.
ద్రవ్యోల్బణం
భారత సేవా ఆర్థిక వ్యవస్థలో టారిఫ్ ద్రవ్యోల్బణం మొత్తం రేటు మితంగానే ఉందని సర్వే పేర్కొంది. ఈ వృద్ధి జులైలో కనిపించిన వృద్ధి కంటే కూడా నెమ్మదిగా ఉంది. అయితే నియామకాల వేగం జులైలో కొంచెం తక్కువగా ఉంది. ఆగస్టు సర్వే డేటా కూడా భారతీయ వస్తువులు, సేవల ధరలు జులైలో కంటే తక్కువగా పెరిగినట్లు చూపించింది. ఈ క్రమంలో ఉత్పాదక సంస్థలు వారి సర్వీస్ విభాగాలు రెండూ ఆగస్ట్‌లో వ్యయ ఒత్తిడిని తగ్గించాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో మొత్తం ద్రవ్యోల్బణం ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయిందని సర్వే స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి:
Money Savings: ఈ FDలలో పెట్టుబడి పెట్టేందుకు కొన్ని రోజులే ఛాన్స్.. 8% వరకు వడ్డీ రేటు
Next Week IPO: ఈ వారం రానున్న ఐపీఓలివే.. షేర్ మార్కెట్లో మనీ సంపాదించే ఛాన్స్
ITR Refund: ఐటీఆర్ రీఫండ్ ఇంకా వాపసు రాలేదా.. అయితే ఇలా చేయండి
Read More Business News and Latest Telugu News