Share News

EACPM: తెలంగాణ నయా రికార్డ్.. దేశంలోనే రెండో స్థానం

ABN , Publish Date - Sep 18 , 2024 | 09:28 PM

భారత్‌లోని ధనిక, పేద రాష్ట్రాల జాబితాను ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి(PMEAC) బుధవారం విడుదల చేసింది. అందులోని వివరాల ప్రకారం.. ధనిక రాష్ట్రాల జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ తొలిస్థానంలో నిలిచింది.

EACPM: తెలంగాణ నయా రికార్డ్.. దేశంలోనే రెండో స్థానం

ఢిల్లీ: భారత్‌లోని ధనిక, పేద రాష్ట్రాల జాబితాను ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి(PMEAC) బుధవారం విడుదల చేసింది. అందులోని వివరాల ప్రకారం.. ధనిక రాష్ట్రాల జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ తొలిస్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానంలో తెలంగాణే ఉండటం విశేషం. కర్ణాటక, హరియాణా, తమిళనాడు వరుసగా 3,4,5 స్థానాల్లో నిలిచాయి. ఇక బిహార్, జార్ఖండ్, యూపీ, మణిపుర్, అసోం రాష్ట్రాలు తొలి ఐదు పేద రాష్ట్రాలుగా నిలిచాయి. రాష్ట్రాల తలసరి ఆదాయం ప్రామాణికంగా ఈ జాబితాను రూపొందించారు.

ఐదు పెద్ద దక్షిణాది రాష్ట్రాలు కలిసి మార్చి 2024 ముగిసే ఆర్థిక సంవత్సరం నాటికి దేశ GDPలో దాదాపు 30 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 2014లో విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. అతి పిన్న వయస్సు కలిగిన తెలంగాణ.. ధనిక రాష్ట్రాల జాబితాలో అగ్రస్థానం కోసం పోటీ పడుతుండటం ఆసక్తికరంగా మారింది.


మహారాష్ట్ర దశాబ్దంన్నర కిందట దేశ జీడీపీలో 15 శాతానికిపైగా కంట్రిబ్యూట్ చేసేది. ఇప్పుడు 13.3 శాతానికి చేరింది. అయితే తలసరి ఆదాయంలో మహారాష్ట్ర మొదటి ఐదు స్థానాల్లో లేదు. ఆ రాష్ట్ర తలసరి ఆదాయం మార్చి 2024 చివరి నాటికి జాతీయ సగటులో 150.7 శాతానికి పెరిగింది(అరవై మూడేళ్ల క్రితం 133.7 శాతం). 1960-61లో ఉత్తరప్రదేశ్ 14 శాతం కంట్రిబ్యూట్ చేయగా ప్రస్తుతం 9.5 శాతానికి తగ్గింది.

For Latest News and National News click here

Updated Date - Sep 18 , 2024 | 09:37 PM