Share News

iPhone 16: ఐఫోన్ 16కి విపరీతమైన క్రేజ్.. డే1 సేల్స్ ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Sep 21 , 2024 | 08:05 AM

భారత్‌లో ఆపిల్ ఐఫోన్ 16 ఫోన్ల విక్రయాలు నిన్నటి నుంచి మొదలయ్యాయి. వీటిని కొనుగోలు చేసేందుకు ఢిల్లీ, ముంబైలోని యాపిల్ స్టోర్ల వద్ద పెద్ద సంఖ్యలో జనం కనిపించారు. దీని సేల్ శుక్రవారం నుంచే ఆన్‌లైన్‌లో కూడా ప్రారంభమైంది. అయితే మొదటి రోజు సేల్స్ ఎలా ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకుందాం.

 iPhone 16: ఐఫోన్ 16కి విపరీతమైన క్రేజ్.. డే1 సేల్స్ ఎలా ఉన్నాయంటే..
iPhone 16 mobiles first day sale india

ఇండియాలో యాపిల్(apple) ఐఫోన్ 16 సిరీస్ విక్రయాలు నిన్నటి(సెప్టెంబర్ 20) నుంచి ప్రారంభమయ్యాయి. అయితే వీటిని కొనుగోలు చేసేందుకు ఢిల్లీ, ముంబైలోని యాపిల్ స్టోర్ల వద్ద భారీ సంఖ్యలో జనం కనిపించారు. రాత్రి నుంచే జనం క్యూలో నిలబడి ఫోన్ల కొనుగోలు కోసం పోటీ పడ్డారు. దీని సేల్ శుక్రవారం నుంచే ఆన్‌లైన్‌లో కూడా ప్రారంభమైంది. సమాచారం ప్రకారం రిటైల్ విభాగంలో iPhone 16 సిరీస్ ఫోన్లు దీని iPhone 15 సిరీస్‌తో పోలిస్తే 15 నుంచి 20 శాతం అమ్మకాలు పెరిగాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫీడ్‌బ్యాక్ ఆధారంగా బేసిక్ ఐఫోన్ 16 మోడల్ మొదటి రోజున బెస్ట్ సెల్లర్‌గా ఉందని రీసెర్చ్ వ్యవస్థాపకుడు నీల్ షా పేర్కొన్నారు. ఆ తర్వాత స్థానంలో ప్రో మ్యాక్స్‌ ఉందని వెల్లడించారు.


నిమిషానికి మూడు

మరోవైపు క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ Blinkit, BigBasket కూడా ఈ ఫోన్లను 10 నిమిషాల్లో కస్టమర్లకు డెలివరీ చేసే సౌకర్యాన్ని ప్రారంభించాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు అనేక మంది ఉత్సాహం చూపించారు. ఈ క్రమంలో బిగ్ బాస్కెట్ నిన్న ఉదయం 8 గంటల నుంచి డెలివరీ ప్రారంభించింది. మొదటి ఆర్డర్ 8 గంటలకు వచ్చిందని, కేవలం 7 నిమిషాల్లోనే కస్టమర్‌కు డెలివరీ అయిందని కంపెనీ చీఫ్ గ్రాసర్ హరి మీనన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో తెలిపారు. ఆ తర్వాత ప్రతి 3 నిమిషాలకు ఒక ఐఫోన్‌ను విక్రయించామని, మొదటి గంటలో 138 ఐఫోన్‌లను డెలివరీ చేసినట్లు చెప్పారు.


ధర తగ్గడం విశేషం

ఇటీవల బడ్జెట్‌లో దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల కంపెనీ గత మోడళ్ల కంటే తక్కువ ధరకు ఐఫోన్ ప్రో సిరీస్‌ను విక్రయించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. iPhone 16 Pro ప్రారంభ ధర రూ. 1,19,900, iPhone 16 Pro Max ప్రారంభ ధర రూ. 1,44,900. ఒక సంవత్సరం క్రితం iPhone 15 Pro ప్రారంభ ధర రూ. 1,34,900, iPhone 15 Pro Max ప్రారంభ ధర రూ. 1,59,900. ఐఫోన్ 16 సిరీస్‌లో ఐఫోన్ 16 ధర రూ. 79,900 వేలు. ఈ సిరీస్‌లో ఇదే అత్యంత చవకైన ఫోన్. ఇది 128GB వరకు స్టోరేజ్ సౌకర్యాన్ని కలిగి ఉంది. ఐఫోన్ 16 ప్లస్ ప్రారంభ ధర రూ.89,900 అని యాపిల్ పేర్కొంది. దీంతోపాటు iPhone 16 Plus, iPhone 16 Pro Max కూడా ఉన్నాయి. ఐఫోన్ 16 సిరీస్‌తో పాటు, 14, 13 వంటి పాత ఐఫోన్ సిరీస్‌ల అమ్మకాలు కూడా పెరిగాయి.


ఇవి కూడా చదవండి:

Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే


Stock Market: నాలుగున్నరేళ్లలో లక్షను రూ.29 లక్షలు చేసిన స్టాక్.. ఏకంగా 2818 శాతం గ్రోత్

Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు

Read More Business News and Latest Telugu News

Updated Date - Sep 21 , 2024 | 08:08 AM