Money Savings: ఈ FDలలో పెట్టుబడి పెట్టేందుకు కొన్ని రోజులే ఛాన్స్.. 8% వరకు వడ్డీ రేటు
ABN , Publish Date - Sep 02 , 2024 | 08:25 PM
అత్యధిక ఫిక్సెడ్ డిపాజిట్ రేట్లు భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి ఉపయోగపడతాయి. ఈ నేపథ్యంలో మీ దగ్గర డబ్బు ఉంటే దానిని FD చేయవచ్చు. అందుకోసం ఈనెలలోనే FDపై అధిక వడ్డీని అందిస్తున్న బ్యాంకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో చాలా మంది వ్యక్తులు అదనపు ఆదాయం కోసం చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చింతించకుండా మీ డబ్బును సరైన సమయంలో పెట్టుబడి(investments) చేయాలి. ఆ విధంగా చేస్తే ఆ డబ్బుతో భవిష్యత్తులో మీ అవసరాలను తీర్చుకోవచ్చు. అనేక బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ ఖాతాదారులకు వివిధ పథకాల ప్రయోజనాలను అందిస్తాయి. ఇందులో భాగంగా డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్(fixed deposits) చేయడం సురక్షితమైన పెట్టుబడి అని చెప్పవచ్చు.
ఈ నేపథ్యంలో ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల స్కీంల కోసం సెప్టెంబర్ 30, 2024ని పలు బ్యాంకులు కటాఫ్ తేదీగా నిర్ణయించారు. ఈ క్రమంలో మీ డబ్బును FDలో ఉంచాలనుకుంటే FDపై అధిక వడ్డీ ప్రయోజనాన్ని అందించే బ్యాంకుల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
IDBI బ్యాంక్
IDBI బ్యాంక్ ప్రత్యేక FD గడువు 300 రోజులు, 375 రోజులు, 444 రోజులు, 700 రోజుల కోసం ఉత్సవ్ FDలలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30, 2024. సాధారణ పౌరులకు 300 రోజులలో మెచ్యూర్ అయ్యే ఉత్సవ్ FDలపై బ్యాంక్ 7.05% వడ్డీ రేటు అందిస్తున్నారు. అదే సమయంలో సీనియర్ సిటిజన్లు 300 రోజుల ఉత్సవ్ FDలపై 7.55% పొందుతారు. 375 రోజులలో మెచ్యూర్ అయ్యే ఉత్సవ్ FDలకు బ్యాంక్ 7.15% వడ్డీ రేటును అందిస్తున్నారు. సీనియర్ సిటిజన్లు 375 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఉత్సవ్ FDల కోసం 7.65%. 444 రోజుల వ్యవధిలో బ్యాంక్ సాధారణ పౌరులకు 7.35%, సీనియర్ సిటిజన్లకు 7.85% అందిస్తున్నారు. 700 రోజుల వ్యవధిలో సాధారణ పౌరులకు 7.20%, సీనియర్ సిటిజన్లకు 7.70% అందిస్తున్నారు.
ఇండియన్ బ్యాంక్
ఇండియన్ బ్యాంక్ స్పెషల్ ఎఫ్‌డీ గడువు కూడా సెప్టెంబర్ 30, 2024. ఇండియన్ బ్యాంక్ 300 రోజుల ఎఫ్‌డీ కోసం సాధారణ ప్రజలకు 7.05%, సీనియర్‌లకు 7.55%, సూపర్ సీనియర్ సిటిజన్‌లకు 7.80% వడ్డీ రేట్లను అందిస్తుంది. 400 రోజులకు సాధారణ ప్రజలకు 7.25%, సీనియర్‌లకు 7.75%, సూపర్ సీనియర్ సిటిజన్‌లకు 8.00% వడ్డీ రేట్లను అందిస్తున్నారు.
పంజాబ్ సింధ్ బ్యాంక్
పంజాబ్ సింధ్ బ్యాంక్ ప్రత్యేక FD గడువు సెప్టెంబర్ 30, 2024. దీనిలో 222 రోజుల వ్యవధిలో 6.30% అధిక వడ్డీ రేటును అందిస్తున్నారు. 333 రోజుల వ్యవధితో ప్రత్యేక డిపాజిట్లపై బ్యాంక్ 7.15% అందిస్తుంది. 444 రోజుల వ్యవధిలో బ్యాంక్ సాధారణ పౌరులకు 7.25% అందిస్తుంది.
SBI
SBI కస్టమర్లు సెప్టెంబర్ 30, 2024 వరకు అమృత్ కలాష్ FDలో పెట్టుబడి పెట్టవచ్చు. దీనిలో 400 రోజుల పథకానికి 7.10 % వడ్డీ రేటు, సీనియర్ సిటిజన్లు 7.60% వడ్డీ రేటుకు అర్హులు. ఈ పథకం సెప్టెంబర్ 30, 2024 వరకు చెల్లుబాటు అవుతుంది.
ఇవి కూడా చదవండి:
Tata Curve ICE: రూ.9 లక్షలకే కొత్త మోడల్ కార్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
Madhabi Puri Buch: సెబీ చీఫ్ మాధవిపై కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు.. 3 చోట్ల జీతం తీసుకుంటున్నారని ఆరోపణ
Next Week IPOs: ఈ వారం రానున్న ఐపీఓలివే.. షేర్ మార్కెట్‌లో మనీ సంపాదించే ఛాన్స్
ITR Refund: ఐటీఆర్ రీఫండ్ ఇంకా వాపసు రాలేదా.. అయితే ఇలా చేయండి
Read More Business News and Latest Telugu News