Manappuram Finance: మణప్పురం ఫైనాన్స్‌కు భారీ షాక్.. 11 నెలల కనిష్టానికి షేర్లు
ABN , Publish Date - Oct 18 , 2024 | 04:41 PM
దేశీయ స్టాక్ మార్కెట్లో మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ (MGFL) షేర్లు శుక్రవారం భారీగా పడిపోయాయి. దాదాపు ఏకంగా 17 శాతం తగ్గిపోవడం విశేషం. అయితే ఈ కంపెనీ షేర్లు ఎందుకు అమాంతం పడిపోయాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రముఖ గోల్డ్ లోన్ సంస్థ మణప్పురం ఫైనాన్స్(Manappuram Finance) షేర్లలో నేడు (అక్టోబర్ 18న) భారీ పతనం కనిపించింది. ఈ క్రమంలో ఒక దశలో BSEలో ఈ షేరు 16.85 శాతం క్షీణించి రూ. 147.50 కనిష్ట స్థాయికి చేరుకుంది. గత 11 నెలల్లో ఈ స్టాక్ ఇంత తక్కువకు చేరుకోవడం ఇదే మొదటిసారి. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మణప్పురం అనుబంధ సంస్థ అయిన ఆశీర్వాద్ మైక్రోఫైనాన్స్‌కు రుణాలు ఇవ్వకుండా నిలిపివేయడం వల్ల మణప్పురం ఫైనాన్స్ షేర్లు భారీగా పడిపోయాయి.
రుణగ్రహీతల నుంచి అధిక వడ్డీ వసూలు చేయడంతో బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ ఈ చర్య తీసుకుంది. ఇప్పటికే ప్రాసెస్‌లో ఉన్న లావాదేవీలను పూర్తి చేసిన తర్వాత అక్టోబర్ 21 నుంచి ఈ కంపెనీపై పరిమితి అమల్లోకి వస్తుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
వీరికి కూడా రుణాలు ఇవ్వొద్దు
ఇదే సమయంలో ఆశీర్వాద్ మైక్రోఫైనాన్స్‌తో పాటు, ఆరోహన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, DMI ఫైనాన్స్, ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ నవీ ఫిన్‌సర్వ్‌లపై కూడా RBI ఇదే విధమైన పరిమితులను విధించింది. ఈ కంపెనీలు ఇప్పటికే ఉన్న రుణాలకు సేవలను కొనసాగించుకోవచ్చు. కానీ కొత్త రుణాలపై మాత్రం పరిమితులు విధించారు. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో ఈ కంపెనీల వ్యాపార వృద్ధి, ఆదాయాలపై ప్రభావం చూపనుంది. మణప్పురం ఫైనాన్స్‌కు అనుబంధంగా ఉన్న ఆశీర్వాద్ మైక్రోఫైనాన్స్ నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులలో నాలుగింట ఒక వంతు వాటాను (AUM) అందజేస్తుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఒక నోట్‌లో పేర్కొంది.
టార్గెట్ తగ్గింపు
ఆర్బీఐ నుంచి ఈ నివేదిక వచ్చిన తర్వాత మోర్గాన్ స్టాన్లీ ఈ స్టాక్ విలువను తగ్గించింది. ఈ నేపథ్యంలో షేర్ టార్గెట్ ధరను రూ.170కి తగ్గించింది. MFIలపై చర్యలు లాభాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని బ్రోకరేజ్ తెలిపింది. ఈ నేపథ్యంలో FY25 కోసం కంపెనీ ఏకాభిప్రాయ ఆదాయ అంచనాలను 20 శాతం నుంచి FY26-27 కోసం 30 శాతానికి తగ్గించింది. ఆదాయాల అంచనాలను తగ్గించినప్పటికీ వాల్యుయేషన్లు చౌకగా ఉన్నాయని బ్రోకరేజ్ సంస్థ చెబుతోంది. దీంతో ఈ స్టాక్‌పై ఇన్వెస్టర్ల ఆసక్తి పెరగడానికి మరికొంత సమయం పట్టవచ్చని అంచనా వేసింది.
ఆదేశాలు జారీ
వెయిటెడ్ యావరేజ్ లెండింగ్ రేట్ (WALR), నిధుల వ్యయంతో సహా కంపెనీ ధరల విధానాన్ని పరిశీలించిన తర్వాత ఆశీర్వాద్ మైక్రోఫైనాన్స్ రుణ వ్యాపారాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు RBI తెలిపింది. అక్టోబర్ 17, 2024 నాటి ఆర్డర్‌లో అక్టోబర్ 21న వ్యాపారం ముగిసిన తర్వాత రుణ మంజూరు లేదా పంపిణీని నిలిపివేయాలని కంపెనీకి ముఖ్యమైన అనుబంధ సంస్థ అయిన ఆశీర్వాద్ మైక్రోఫైనాన్స్ లిమిటెడ్ (AMFL)ని RBI ఆదేశించిందని మణప్పురం ఫైనాన్స్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.
ఇవి కూడా చదవండి:
Stock Market: వారాంతంలో స్టాక్ మార్కెట్లో లాభాల జోష్.. కొన్ని గంటల్లోనే లక్షల కోట్ల లాభం..
Lay Offs: మళ్లీ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో లే ఆఫ్స్.. భయాందోళనలో టెకీలు..
Firecracker Insurance: ఫైర్‌క్రాకర్స్‌తో గాయపడితే ఇన్సూరెన్స్ పాలసీ.. ఫోన్ పే నుంచి కొత్త స్కీం..
Gold Investment: ఫిజికల్ గోల్డ్ లేదా డిజిటల్ గోల్డ్.. వీటిలో ఏ పెట్టుబడి బెస్ట్
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Read More Business News and Latest Telugu News