Share News

Deadline: వీటికి మార్చి 31 గడువు.. త్వరగా పూర్తి చేయండి, లేదంటే మీకే నష్టం

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:55 PM

2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇంకా కొన్ని రోజులు మాత్రమే(march 31st) మిగిలి ఉంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మార్చి 31 వరకు ఉండే అనేక రకాల ఆర్థిక లావాదేవీల గడువు గురించి ఇప్పుడు చుద్దాం. ఈ నెలలో పరిష్కరించుకునే ప్రధాన అంశాలను ఇక్కడ తెలుసుకుందాం.

Deadline: వీటికి మార్చి 31 గడువు.. త్వరగా పూర్తి చేయండి, లేదంటే మీకే నష్టం

2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇంకా కొన్ని రోజులు మాత్రమే(march 31st) మిగిలి ఉంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మార్చి 31 వరకు ఉండే అనేక రకాల ఆర్థిక లావాదేవీల గడువు గురించి ఇప్పుడు చుద్దాం. ఈ నెలలో పరిష్కరించుకునే ప్రధాన అంశాలను ఇక్కడ తెలుసుకుందాం. అయితే వీటిని మార్చి 31 లేపు(deadline) పూర్తి చేయకుంటే మీరు భవిష్యత్తులో నష్టపోయే అవకాశం ఉంది.

పన్ను ఆదాకు కూడా

పాత పన్ను విధానాన్ని ఎంచుకుని, పన్ను ఆదా చేయాలనుకునే పన్ను చెల్లింపుదారులు, పన్ను ఆదా ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడానికి వారికి ఇదే చివరి అవకాశం. మార్చి 31, 2024 వరకు ఏదైనా పన్ను ఆదా ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా వారు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C కింద, అనేక పథకాలు రూ. 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలను అందిస్తాయి. ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఈక్విటీ-లింక్డ్ సేవింగ్ స్కీమ్ (ELSS), టర్మ్ డిపాజిట్ (FD) వంటి అనేక ప్లాన్స్ ద్వారా పన్ను ఆదా చేసుకోవచ్చు.

కనీస పెట్టుబడి గడువు

PPF లేదా సుకన్య సమృద్ధి యోజన (SSY) వంటి ప్రభుత్వ చిన్న పొదుపు పథకాలకు సంవత్సరానికి కనీసం రూ. 500, రూ. 250 పెట్టుబడి అవసరం. మీరు ఏదైనా ఆర్థిక సంవత్సరంలో ఈ కనీస డిపాజిట్‌ను జమ చేయకపోతే, మీ ఖాతా డిఫాల్ట్‌గా గుర్తించబడవచ్చు జాగ్రత్త.


ఐటీఆర్ ఫైలింగ్ అప్‌డేట్

ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడానికి పన్ను చెల్లింపుదారులకు ఇదే చివరి అవకాశం. పన్ను చెల్లింపుదారులు ఈ పనిని మార్చి 31, 2024లోపు పూర్తి చేయాలి. పన్ను చెల్లింపుదారులు రిటర్న్‌ను దాఖలు చేయడం మానేసినా లేదా ఆదాయం గురించి ఎటువంటి సమాచారం ఇవ్వకపోయినా, వారికి ఇదే చివరి అవకాశం.

ఎస్‌బీఐ అమృత్ కలాష్‌

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ అమృత్ కలాష్‌పై అధిక వడ్డీ రేటును అందించడాన్ని మార్చి 31తో ఆపివేస్తుంది. ఈ తేదీ తర్వాత గృహ రుణాలపై రాయితీ వడ్డీ రేట్లను అందించదు. దీంతోపాటు డెబిట్ కార్డ్ ఛార్జీలను కూడా సవరించింది. ఇవి ఏప్రిల్ 1, 2024 నుంచి అమల్లోకి వస్తాయి.

బీమా పాలసీల సరెండర్ విలువ

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) బీమా పాలసీల సరెండర్ విలువకు సంబంధించి కొత్త నిబంధనలను విడుదల చేసింది. కొత్త నిబంధనలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అంటే ఏప్రిల్ 1, 2024 నుంచి అమలులోకి వస్తాయి.

ఐడీబీఐ బ్యాంక్ ప్రత్యేక FD

ఐడీబీఐ బ్యాంక్ ఉత్సవ్ కాల్ పేరుతో ప్రత్యేక FDని అందిస్తుంది. ఇక్కడ సాధారణ డిపాజిటర్లకు 7.05 నుంచి 7.25 శాతం వరకు, సీనియర్ సిటిజన్‌లకు 7.55 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ అందించబడుతుంది.

ఫాస్టాగ్ కేవైసీ అప్‌డేట్

ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) FASTag KYC వివరాలను అప్‌డేట్ చేయడానికి ఫిబ్రవరి 29 నుంచి మార్చి 31, 2024 వరకు గడువును పొడిగించింది. ఈ గడువులోపు కేవైసీ అప్‌డేట్ చేసుకోకుంటే ఇబ్బుందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: PM Modi: ప్రధాని మోదీ-బిల్ గేట్స్ చాయ్ పే చర్చ.. వీటిపైనే ప్రధానంగా చర్చ

Updated Date - Mar 29 , 2024 | 12:56 PM