Share News

AI Investments: ఏఐ పెట్టుబడులు వృథా..ఎంఐటీ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Oct 03 , 2024 | 07:46 PM

గత కొద్ది నెలలుగా అనేక టెక్ కంపెనీలు ఏఐపై పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నాయి. దీంతోపాటు అనేక మంది ఉద్యోగులను సైతం తొలగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏఐ పెట్టుబడుల గురించి ప్రముఖ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(MIT) ప్రొఫెసర్, ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు చేశారు.

AI Investments: ఏఐ పెట్టుబడులు వృథా..ఎంఐటీ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు
MIT economist Acemoglu

ఇటివల కాలంలో అనేక సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)పై పెద్ద ఎత్తున పెట్టుబడులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయా కంపెనీల్లో ఏఐ విధానాన్ని అమలు చేస్తూ అనేక రకాల పనులను నిర్వహిస్తున్నారు. దీనికోసం పలు కంపెనీలు పెద్దఎత్తున ఖర్చును కూడా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(MIT) ప్రొఫెసర్, ఆర్థికవేత్త డారన్ అసెమోగ్లు AI గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ విషయంలో చాలా డబ్బు వృథా అవుతుందని, దీని కారణంగా 5% కంటే ఎక్కువ ఆర్థిక విప్లవాన్ని తీసుకురాలేరని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.


నష్టమేనా

రాబోయే 10 సంవత్సరాలలో AI కేవలం 5% ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేస్తుందని అసెమోగ్లు(daron acemoglu) అన్నారు. ప్రస్తుత AI వ్యవస్థలు అంత గొప్పగా లేవని, అవి సమీప భవిష్యత్తులో మానవాళీని పూర్తిగా భర్తీ చేయలేవన్నారు. కేవలం వైట్ కాలర్ ఆఫీస్ ఉద్యోగాలు లేదా బ్లూ కాలర్ ఉద్యోగాలపై మాత్రమే ప్రభావం ఉంటుందని చెప్పారు. మానవ పర్యవేక్షణతో AI కొన్ని చోట్ల పనిచేయగలదని, కానీ చాలా చోట్ల ఇలాంటివి చేయలేమని Acemoglu తెలిపారు. అంతేకాదు ఈ వ్యయం ఇలాగే కొనసాగితే అది టెక్నాలజీ పరిశ్రమకు తీవ్ర నష్టమని అభిప్రాయం వ్యక్తం చేశారు.


మారనున్న వైఖరి

ఇప్పుడు చేస్తున్న ఖర్చు విషయంలో తరువాత ఆయా కంపెనీల వైఖరి మారిపోతుందన్నారు. ఇది క్రమంగా మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందన్నారు. ఇది ఇలాగే కొనసాగితే త్వరలో స్టాక్ మార్కెట్ క్రాష్‌కు దారి తీస్తుందన్నారు. AI సామర్థ్యాలపై కంపెనీలు అనుసరిస్తున్న ఓవర్ ఇన్వెస్ట్‌మెంట్ విధానం వారి బాటమ్ లైన్‌ను దెబ్బతీస్తుందని అసెమోగ్లు అన్నారు. అంతేకాదు AI పెట్టుబడుల నుంచి ఆశించిన దానికంటే తక్కువ ROI ఉంటుందన్నారు. ఇది పెట్టుబడిదారుల నిర్ణయాలలో మార్పు, చివరికి టెక్ స్టాక్‌లలో భారీ పతనానికి దారి తీస్తుందని జోస్యం చెప్పారు.


భారీ వ్యయం

బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలోనే మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, అమెజాన్, మెటాలు 50 బిలియన్ డాలర్లపైగా మూలధన వ్యయంపై ఖర్చు చేశాయి. వీటిలో ఎక్కువ భాగం AI పెట్టుబడులకు ఖర్చు చేశాయి. ఈ ఖర్చు ChatGPT తయారీదారు OpenAI విలువను $157 బిలియన్లకు (అక్టోబర్ 2) పెంచడంలో సహాయపడింది. సంస్థ నగదు కొరతను ఎదుర్కొంటున్నప్పటికీ ఎలాన్ మస్క్ xAI సంస్థ వాల్యుయేషన్ ప్రారంభించబడిన ఒక సంవత్సరం లోపు $24 బిలియన్లకు చేరుకుంది.


ఇవి కూడా చదవండి:

IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన


Loans: గూగుల్ పే నుంచి క్షణాల్లోనే రూ. 50 లక్షల లోన్స్


SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

Cash Deposit Machine: క్యాష్ డిపాజిట్ మెషిన్ ద్వారా రోజు ఎంత డిపాజిట్ చేసుకోవచ్చు..


Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Read More Business News and Latest Telugu News

Updated Date - Oct 03 , 2024 | 07:47 PM