Business: ఒమేగా హాస్పిటల్స్‌లో భారీగా పెట్టుబడులు.. దేశ వ్యాప్తంగా విస్తరించనున్న వైద్య సేవలు..
ABN , Publish Date - Jun 19 , 2024 | 07:14 PM
వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తూ.. దేశంలోని పలు ప్రాంతాల్లో క్యాన్సర్ ఆసుపత్రులు నిర్వహిస్తున్న హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ప్రైవేట్ లిమిటెడ్ (ఒమేగా హాస్పిటల్స్)లో విదేశీ పెట్టుబడుల సంస్థ మోర్గాన్ స్టాన్లీ ప్రైవేట్ ఈక్విటీ దాదాపు రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టింది.
వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తూ.. దేశంలోని పలు ప్రాంతాల్లో క్యాన్సర్ ఆసుపత్రులు నిర్వహిస్తున్న హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ప్రైవేట్ లిమిటెడ్ (ఒమేగా హాస్పిటల్స్)లో విదేశీ పెట్టుబడుల సంస్థ మోర్గాన్ స్టాన్లీ ప్రైవేట్ ఈక్విటీ దాదాపు రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టింది. కేంద్రప్రభుత్వం విదేశీ పెట్టుబడుల విధానాన్ని సరళీకృతం చేయడంతో దేశంలోని ప్రైవేటు ఆస్పత్రులకు పెద్దఎత్తున విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. సింగపూర్, యూకే, అమెరికా, స్వీడన్‌తో పాటు పలు దేశాలకు చెందిన సంస్థలు దేశంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో వాటాలు కొనుగోలు చేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఒమేగా హాస్పిటల్స్ చేరాయి. ఆంకాలజీ సర్జన్ అయిన డాక్టర్ మోహన్ వంశీ ఒమేగా హాస్పిటల్స్‌ను 2010లో ప్రారంభించారు. బంజారాహిల్స్ గచ్చిబౌలిలలో ఒమేగా హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్‌ను దేశ వ్యాప్తంగా విస్తరించడంలో భాగంగా విదేశీ పెట్టుబడులను ఆహ్వానించగా మోర్గాన్ స్టాన్లీ రూ.500 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. దీంతో ఒమేగా హాస్పిటల్స్ దేశంలోని వివిధ రాష్ట్రాలకు తన వైద్య సేవలను విస్తరించనుంది.
ITR Filling: ఐటీఆర్ ఫాం 16 ఎలా సమర్పించాలి.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
భారీగా విదేశీ పెట్టుబడులు..
మోర్గాన్ స్టాన్లీ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ద్వారా ఒమేగా హాస్పటల్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా లక్షలాది మందికి అధిక నాణ్యతతో కూడిన ఆరోగ్య సంరక్షణ సేవలు అందిచడానికి వీలుకలగనుంది. ఒమేగా హాస్పటల్స్ దేశంలోనే రెండవ అతిపెద్ద క్యాన్స్‌ర్ ఆసుపత్రిగా పేర్గాంచింది. దక్షిణ భారతదేశ వ్యాప్తంగా ఒమేగా హాస్పటల్స్‌ను విస్తరించేందుకు.. క్యాన్సర్ వైద్య సేవల్లో తన ఆధిపత్య స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఈ పెట్టుబడులు ఉపయోగపడనున్నాయి. ఇటీవల కాలంలో దేశంలో క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. ఈ క్రమంలో క్యాన్సర్ నుంచి రోగిని సంరక్షించడమే లక్ష్యం ఒమేగా హాస్పటల్స్ ముందుకు వేళ్లనున్నాయని సంస్థ మేనేజంగ్ డైరెక్టర్ డాక్టర్ మోహన్ వంశీ తెలిపారు. మోర్గాన్ స్టాన్లీ ప్రైవేట్ ఈక్వీటీ ఆసియాతో కలిసి ప్రయాణించడానికి ఎంతో సంతోషిస్తున్నట్లు డాక్టర్ మోహన్ వంశీ తెలిపారు. రానున్న కాలంలో భారతదేశంలో అతిపెద్ద క్యాన్సర్ వైద్య సేవలు అందించే హాస్పటల్స్‌గా ఒమేగా అవతరించనున్నట్లు తెలిపారు.
ఒమేగా హాస్పిటల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ నమ్రత మాట్లాడుతూ.. మోర్గాన్ స్టాన్లీ ప్రైవేట్ ఈక్విటీ ఆసియా ఫండ్‌తో భాగస్వామిగా ఉండటానికి సంతోషిస్తున్నామని తెలిపారు. తాజా పెట్టుబడులతో దేశమంతటా తమ వైద్య సేవలను విస్తరించడానికి, ఆసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగుపర్చడానికి, కొత్త ఆసుపత్రుల ఏర్పాటుకు సహాయపడుతుందన్నారు. ఎక్కువ మందికి అధునాతన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి వీలు కలుగుతుందన్నారు. నాణ్యతతో కూడిన వైద్య సంరక్షణ సేవలు అందిచడమే లక్ష్యం ఒమేగా హాస్పటల్స్ పనిచేస్తున్నాయన్నారు.
ఒమేగా హాస్పటల్స్ ప్రెసిడెంట్ హరగోవింద్ మాట్లాడుతూ.. తమ ఆసుపత్రి వైద్య సేవలను విస్తరించే ప్రణాళికలో భాగంగా విదేశీ పెట్టుబడులను ఆహ్వానించామన్నారు. మోర్గాన్ స్టాన్లీ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల ద్వారా వచ్చే నిధులతో నాణ్యమైన క్యాన్సర్ సంరక్షణ వైద్య సేవలను అందించడానికి దోహదపడతాయన్నారు.
మోర్గాన్ స్టాన్లీ ప్రైవేట్ ఈక్విటీ ఆసియా మేనేజింగ్ డైరెక్టర్ అర్జున్ సైగల్ మాట్లాడుతూ.. ఆసియా ఖండంలో కీలక దేశంగా ఉన్న భారత్‌లో వైద్య రంగంలో పెట్టుబడులు పెట్టాలనే ఆసక్తితో ఒమేగా హాస్పిటల్స్‌లో పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. డాక్టర్ మోహన్ వంశీ, డాక్టర్ నమ్రత సమర్థ నాయకత్వంలో ఒమేగా హాస్పటల్స్ మరింత అభివృద్ధి దిశగా పయనించనున్నట్లు తెలిపారు. రానున్న ఏడాది కాలంలో మరింత వేగంగా నాణ్యమైన వైద్య సేవలను అందించేదిశగా ఈ హాస్పటల్స్ ముందుకువెళ్తాయన్నారు.
Stock Market Updates: బీఎస్ఈలో సరికొత్త రికార్డులకు బెంచ్‌మార్క్ సూచీలు..త్వరలో ఇంకా పెరుగుతుందా..?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Business News and Latest Telugu News