Karti Chidambaram: వారంలో 70 గంటల పని వద్దు.. 4 రోజులు చాలు
ABN , Publish Date - Dec 23 , 2024 | 12:34 PM
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి 70 గంటల పనివారాల పిలుపు ఇవ్వడంతో విభేదాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఈ వ్యాఖ్యను విమర్శిస్తూ, పనివారాలు పొడిగించడం కంటే సామర్థ్యాన్ని మెరుగుపరచడం అవసరమని వ్యాఖ్యానించారు.
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Karti Chidambaram) గత నెలలో భారతదేశంలో 70 గంటల పనివారాలను ప్రోత్సహించాలని ఒక వివాదాస్పద వ్యాఖ్య చేశారు. భారతీయులు దేశ అభివృద్ధికి సహకరించడానికి మరింత కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. 78 ఏళ్ల టెక్ టైకూన్ నారాయణ మూర్తి తన కెరీర్ గురించి పంచుకుంటూ, వారానికి 14 గంటలు, ఆరున్నర రోజుల పాటు పనిచేశానని గుర్తు చేశారు. ఈ విధంగా పనిచేసే విషయాన్ని ఆయన గర్వంగా చెప్పినప్పటికీ, ఆయన సూచించిన 70 గంటల పనివారాల పిలుపు తీవ్ర విమర్శలకు గురయ్యింది.
సామర్థ్యాన్ని మెరుగుపరచడం
తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ప్రత్యక్షంగా స్పందించారు. ఆయన చెప్పిన పని గంటలను అర్థం లేనిదిగా అభివర్ణించారు. చిదంబరం X (ట్విట్టర్)లో ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ, పొడిగించిన పనిగంటలు కాకుండా.. సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఎక్కువగా అవసరమని సూచించారు. ముఖ్యంగా, పని-జీవిత సమతుల్యతను సాధించడం అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశంలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు చాలా క్షీణంగా ఉండటంతో, ప్రజలు ఇప్పటికే తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారని గుర్తు చేశారు. ఈ విధమైన పొడిగించిన పనివారాల పిలుపు ప్రజలకు మరింత భారం కానుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
4 రోజుల పని చాలు..
ప్రస్తుతం భారతదేశంలో చాలా మంది ప్రజలు నిరుద్యోగం, దిగజారిన ఆర్థిక పరిస్థితులు సహా ఇతర సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో 70 గంటల పనివారాల పిలుపు సాధారణ ప్రజలకు అన్యాయంగా అనిపిస్తుందన్నారు. కాబట్టి భారతదేశంలో 4 రోజుల పనివారాన్ని అమలు చేయాలని చిదంబరం సూచించారు. ఇది ఆర్థిక వ్యవస్థకు కూడా మంచిదే కాకుండా, సామాజిక సామరస్యాన్ని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇద్దరి కామెంట్లలో
నారాయణ మూర్తి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారాయి. కానీ మూర్తి అభిప్రాయం ప్రకారం భారతీయ యువత గరిష్ఠంగా పని చేస్తే, దేశం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన భావిస్తున్నారు. కానీ కార్తీ చిదంబరం మాత్రం ఆయన అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సమస్యలను పరిశీలిస్తూ పని జీవిత సమతుల్యతను ముఖ్యంగా పరిగణించాలని సూచిస్తున్నారు. ఒక పక్క మూర్తి దేశ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేయాలని ప్రోత్సహిస్తే, మరో పక్క చిదంబరం సామాజిక, ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని పని జీవిత సమతుల్యతను కాపాడాలని పిలుపునిచ్చారు. వీరి కామెంట్లలో మీరు దేనిని ఏకిభవిస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి మరి.
ఇవి కూడా చదవండి:
Cyber Protection: సైబర్ మోసాల నుంచి మీ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఇలా రక్షించుకోండి..
Public Holidays: 2025లో పబ్లిక్ హాలిడేస్ ఎన్ని రోజులో తెలుసా..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Top Mutual Funds: గత ఐదేళ్లలో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే..
Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..
Read More Business News and Latest Telugu News