Multibagger Stock: ఐదేళ్లలో లక్షను 96 లక్షలు చేసిన స్టాక్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం
ABN , Publish Date - Sep 23 , 2024 | 01:10 PM
షేర్ మార్కెట్‌లో తక్కువ సమయంలో పెట్టుబడిదారులకు విపరీతమైన రాబడిని అందించిన షేర్లు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి వాటిలో ఇటివల మరోక స్టాక్ కూడా చేరింది. ఇది ఏకంగా ఐదేళ్లలోనే ఇన్వెస్టర్లకు ఏకంగా అనేక రెట్ల లాభాలను అందించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
స్టాక్ మార్కెట్లో(stock markets) అప్పుడప్పుడు పలు కంపెనీల షేర్ల ధరలు భారీగా పెరిగిపోతాయి. దీంతో ఆయా కంపెనీలలో పెట్టుబడులు చేసిన పెట్టుబడిదారులకు పెద్ద ఎత్తున లాభాలు వస్తాయి. ఇక్కడ కూడా అచ్చం అలాగే జరిగింది. Piccadily Agro Industries కంపెనీ స్టాక్ ధర అమాంతం పుంజుకుంది. BSE డేటా ప్రకారం 5 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 20, 2019న ఈ కంపెనీ షేరు ధర రూ. 8.05. కానీ ప్రస్తుతం సెప్టెంబర్ 23న సోమవారం ఈ షేరు రూ.772కు చేరుకుంది. ఈ విధంగా గత 5 సంవత్సరాలలో ఈ షేరు ధర ఏకంగా 9500 శాతం పెరగడం విశేషం.
ఐదేళ్లలో
అంటే ఈ లెక్కన చూస్తే 5 ఏళ్ల క్రితం ఈ కంపెనీలో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి విక్రయించకుండా ఉంటే, ఇప్పుడు 96 లక్షలు వచ్చాయని చెప్పవచ్చు. ఎందుకంటే షేర్ 9500% బంపర్ రాబడిని ఇచ్చింది. రూ.10,000 ఇన్వెస్ట్ చేసి విక్రయించకుండా ఉంటే, ఆ మొత్తం రూ.9,60,000 అయ్యేవి.
అదేవిధంగా రూ.50,000 పెట్టుబడి చేస్తే రూ.48 లక్షలు వచ్చేవి. ఈ కంపెనీ షేర్లు దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు బలమైన రాబడులను అందించాయి. గత ఆరు నెలల్లో ఈ స్టాక్ దాదాపు 155 శాతం మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చింది. ఏడాది వ్యవధిలో స్టాక్ దాదాపు 180 శాతం పెరిగింది.
నికర లాభం
ఏప్రిల్-జూన్ 2024 త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా పిక్కాడిలీ ఆగ్రో ఇండస్ట్రీస్ ఏకీకృత ఆదాయం వార్షిక ప్రాతిపదికన రూ. 208.28 కోట్లకు తగ్గింది. త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన రూ.14 కోట్లకు పెరిగింది. రూ. 189.30 కోట్లకు ఖర్చులు తగ్గాయి. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.7300 కోట్లు. షేరు ముఖ విలువ రూ.10. ప్రమోటర్లు జూన్ 2024 చివరి వరకు కంపెనీలో 70.97 శాతం వాటాను కలిగి ఉన్నారు. 2 సంవత్సరాలలో రాబడి 1918 శాతం.
ఉత్పత్తులు
1953లో మద్యం పంపిణీ వ్యాపారంలో స్థాపించబడింది. పిక్కాడిల్లీ బ్రాండ్ పేరు 1967లో ఉనికిలోకి వచ్చింది. పిక్కాడిలీ ఆగ్రో ఇండస్ట్రీస్ 1994లో స్థాపించబడింది. ఈ కంపెనీ ప్రస్తుతం భారతదేశంలో మాల్ట్ స్పిరిట్స్ అతిపెద్ద స్వతంత్ర తయారీదారు, విక్రయదారుగా ఉంది. ఇది ఇథనాల్, అదనపు న్యూట్రల్ ఆల్కహాల్ (ENA), CO2, వైట్ క్రిస్టల్ షుగర్‌ను కూడా ఉత్పత్తి చేస్తుంది. దీని ఉత్పత్తులలో ఇంద్రి బ్రాండ్ పేరుతో సింగిల్ మాల్ట్ విస్కీ, కెమికారా బ్రాండ్ పేరుతో చెరకు రసం రమ్, అలాగే విస్లర్, రాయల్ హైలాండ్ బ్రాండ్ పేర్లతో బ్లెండెడ్ మాల్ట్ విస్కీ వంటివి ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Customers: జియో, ఎయిర్ టెల్, వీఐలకు షాకిచ్చిన కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్‌కు లాభం
Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే
Read MoreBusiness News and Latest Telugu News