Share News

Coriander Free: ఓ తల్లి సూచన.. కొత్తిమీర ఫ్రీ అంటూ బ్లింకిట్ సంస్థ ప్రకటన

ABN , Publish Date - May 16 , 2024 | 02:55 PM

ఆన్‌లైన్‌లో కిరాణా, కూరగాయలు, పండ్లు సహా పలు ఉత్పత్తులను విక్రయించే బ్లింకిట్(Blinkit) సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మీరు ఈ ప్లాట్ ఫాంలో కూరగాయలు కొనుగోలు చేస్తే కొత్తిమీర(coriander) ఉచితంగా పొందవచ్చు. అవును మీరు విన్నది నిజమే.

Coriander Free: ఓ తల్లి సూచన.. కొత్తిమీర ఫ్రీ అంటూ బ్లింకిట్ సంస్థ ప్రకటన
Blinkit company offer 200 grams coriander free

ఆన్‌లైన్‌లో కిరాణా, కూరగాయలు, పండ్లు సహా పలు ఉత్పత్తులను విక్రయించే బ్లింకిట్(Blinkit) సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మీరు ఈ ప్లాట్ ఫాంలో కూరగాయలు కొనుగోలు చేస్తే కొత్తిమీర(coriander) ఉచితంగా పొందవచ్చు. అవును మీరు విన్నది నిజమే. ఇటివల ఈ కంపెనీకి కూరగాయలతో పాటు కొత్తిమీరను ఉచితంగా అందించాలని ముంబైకి చెందిన ఓ వ్యక్తి తల్లి సూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని బ్లింకిట్ సీఈవో అల్బిందర్ ధిండా ఎక్స్‌లో షేర్ చేస్తూ వెల్లడించారు. ముంబైకి చెందిన ఓ వ్యక్తి తల్లి బ్లింకిట్ నుంచి ఆర్డర్ చేస్తున్నప్పుడు ఆమె కొత్తిమీర కోసం కూడా చెల్లించాల్సి వచ్చిందని చూసి షాక్ అయ్యారు.


ఆ క్రమంలో కొంత మొత్తంలో కూరగాయలు కొనుగోలు చేస్తే కొత్తిమీర ఉచితంగా(free) ఇవ్వాలని తన తల్లి సూచించినట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా కోరారు. అతని పోస్ట్ CEO అల్బిందర్ ధిండాతో సహా చాలా మంది దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆ వ్యక్తి పోస్ట్‌పై సీఈఓ స్పందించారు. పోస్ట్ చేసిన అంకిత్ తల్లికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో తమ ప్లాట్ ఫాం నుంచి ఉచితంగా కొత్తిమీర అందిస్తామని వెల్లడించారు. అంతేకాదు అందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేశారు. దానిలో కొన్ని కూరగాయల ఆర్డర్‌లపై 100 గ్రాముల ఉచిత కొత్తిమీర ఉన్నట్లు కనిపిస్తోంది.


ఇది తెలిసిన నెటిజన్లు బ్లింకిట్ సంస్థ సీఈఓ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్ట్ కేవలం కొన్ని గంటల్లోనే 5.88 లక్షల కంటే ఎక్కువ వీక్షణలు పొందింది. దీంతోపాటు ఇప్పటి వరకు ఈ పోస్టును 8000 మందికిపైగా లైక్‌ చేశారు. ఇది చూసిన మరికొంత మంది కూడా పలు రకాలుగా కామెంట్‌లు చేస్తున్నారు. ఇక బ్లింకిట్(Blinkit) విషయానికి వస్తే (గతంలో గ్రోఫర్స్) సహ వ్యవస్థాపకుడు, CEO అయిన అల్బిందర్ ధిండా 2013లో ఈ కంపెనీని ప్రారంభించారు. 2022లో జోమాటో కొనుగోలు చేసిన గురుగ్రామ్ ఆధారిత ఈ కంపెనీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 26 నగరాల్లో ఉంది.


ఇది కూడా చదవండి:

Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త

SEBI: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు శుభవార్త.. ఆ రూల్స్ సడలించిన సెబీ


Read Latest Business News and Telugu News

Updated Date - May 16 , 2024 | 02:58 PM