Share News

New Rules: పీపీఎఫ్, ఎస్ఎస్‌వై వంటి పొదుపు పథకాలపై అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్

ABN , Publish Date - Sep 04 , 2024 | 02:37 PM

మీరు చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడులు చేస్తున్నారా. అయితే జాగ్రత్త. ఎందుకంటే జాతీయ పొదుపు పథకాల కొత్త రూల్స్ అక్టోబర్ 1, 2024 నుంచి మారనున్నాయి. ఈ మార్పులకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల విభాగం ఇటివల సర్క్యూలర్‌ను జారీ చేసింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

New Rules: పీపీఎఫ్, ఎస్ఎస్‌వై వంటి పొదుపు పథకాలపై అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
New rules from October 1st 2024

మీరు సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్, నేషనల్ స్మాల్ సేవింగ్స్ వంటి పొదుపు(savings) పథకాలలో పెట్టుబడులు చేస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే అక్టోబర్ 1, 2024 నుంచి ఈ స్కీంలకు సంబంధించిన నిబంధనలు మారనున్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం సర్క్యూలర్ ప్రకారం స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌ల కొత్త నియమాలు అక్టోబర్ 1, 2024 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలో సక్రమంగా లేని ఖాతాలతో పాటు సాధారణ ఖాతాదారులకు కూడా ఈ నియమాలు వర్తిస్తాయని ప్రకటించారు. పోస్టాఫీసు ద్వారా నేషనల్ స్మాల్ సేవింగ్స్ (NSS) కింద సక్రమంగా తెరిచిన ఖాతాలను క్రమబద్ధీకరించే లక్ష్యంతో ఈ కొత్త నిబంధనలు ఆమోదించబడ్డాయి.


మారున్న అంశాలు ఇవే

  • ఈ నేపథ్యంలో సక్రమంగా లేని NSS, PPF ఖాతాలు మైనర్ పేరుతో తెరవడం, PPF ఖాతాలను ఎక్కువగా కలిగి ఉండటం, ప్రవాస భారతీయులు (NRIల) PPF ఖాతాను పొడిగించడం, తల్లిదండ్రులకు బదులుగా తాతలు తెరిచిన సుకన్య సమృద్ధి ఖాతాలు (SSA) క్రమబద్ధీకరణ వంటి అంశాలు ఉన్నాయి.

  • సక్రమంగా లేని NSS ఖాతాలను వర్గీకరిస్తారు. మొదటి ఖాతా తర్వాత తెరిచిన రెండవ ఖాతాకు అదనంగా 200 బేసిస్ పాయింట్లు (bps) అందుతాయి. ఆ క్రమంలో రెండు ఖాతాలలో కలిపి డిపాజిట్ మొత్తం ప్రతి సంవత్సరానికి వర్తించే డిపాజిట్ పరిమితిని మించకూడదు. అదనపు డిపాజిట్ ఉంటే దానిపై ఎలాంటి వడ్డీ లేకుండా పెట్టుబడిదారుడికి తిరిగి ఇస్తారు. ఈ నిబంధనలు అక్టోబర్ 1, 2024 నుంచి ఈ ఖాతాలపై వర్తిస్తాయి.


  • రెండు కంటే ఎక్కువ NSS ఖాతాలు ఉంటే మూడవ, తదుపరి ఖాతాలపై వడ్డీ రేటు ఇవ్వబడదు. అసలు మొత్తం తిరిగి ఇవ్వబడుతుంది.

  • PPF ఖాతా మైనర్ పేరుతో తెరవబడితే అటువంటి క్రమబద్ధీకరించబడని ఖాతాలకు POSA వడ్డీ రేటు మైనర్‌కు 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు చెల్లించబడుతుంది.

  • అటువంటి ఖాతాల మెచ్యూరిటీ వ్యవధి మైనర్ మెజారిటీ సాధించిన తేదీ నుంచి లెక్కించబడుతుంది. అనగా ఖాతా తెరవడానికి అర్హత ఉన్న వ్యక్తికి 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తేదీ నుంచి లెక్కించబడుతుంది.


  • PPF ఖాతాలు ఎక్కువగా ఉంటే డిపాజిట్ మొత్తం వార్షిక పరిమితిలోపు ప్రాథమిక ఖాతా పథకం ప్రకారం వడ్డీని పొందుతారు

  • ప్రాథమిక, ద్వితీయ ఖాతా కాకుండా ఏదైనా అదనపు ఖాతా ఉంటే అది తెరిచిన తేదీ నుంచి ఎలాంటి వడ్డీ రేటు అందించబడదు

  • NRIల క్రియాశీల PPF ఖాతాలకు మాత్రమే వారి నివాస స్థితి ఆధారంగా POSA వడ్డీ రేటును స్వీకరించడానికి అర్హులు. ఈ క్రమంలో సెప్టెంబర్ 30, 2024 వరకు ఖాతాదారుడు తప్పనిసరిగా భారతీయ పౌరుడిగా ఉండాలి. వారి ఖాతా ప్రారంభం సమయంలో NRI అయ్యి ఉండాలి. ఆ తర్వాత పేర్కొన్న ఖాతా 0% వడ్డీ రేటును పొందుతుంది.


ఇవి కూడా చదవండి:

Money Savings: ఈ FDలలో పెట్టుబడి పెట్టేందుకు కొన్ని రోజులే ఛాన్స్.. 8% వరకు వడ్డీ రేటు


Next Week IPO: ఈ వారం రానున్న ఐపీఓలివే.. షేర్ మార్కెట్‌లో మనీ సంపాదించే ఛాన్స్

ITR Refund: ఐటీఆర్ రీఫండ్ ఇంకా వాపసు రాలేదా.. అయితే ఇలా చేయండి


Read More Business News and Latest Telugu News

Updated Date - Sep 04 , 2024 | 02:40 PM