Share News

Viral Video: కన్యాదానం అసలు ప్రాముఖ్యతను వివరించిన నీతా అంబానీ

ABN , Publish Date - Jul 17 , 2024 | 09:37 AM

ఆసియాలోనే అత్యంత ధనిక వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ(mukesh ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ(Anant Ambani), రాధిక మర్చంట్‌ల(Radhika Merchant) పెళ్లి వేడుకల గురించి గత కొన్ని రోజులుగా దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో తాజాగా నీతా అంబానీకి సంబంధించిన మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Viral Video: కన్యాదానం అసలు ప్రాముఖ్యతను వివరించిన నీతా అంబానీ
Nita Ambani

ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ(mukesh ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ(Anant Ambani)-రాధిక మర్చంట్‌ల (Radhika Merchant) పెళ్లి వేడుకల గురించి గత కొన్ని రోజులుగా దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పెళ్లి ఖర్చు, వంటకాల మెనూ సహా అనేక అంశాల గురించి మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో తాజాగా నీతా అంబానీ(Nita Ambani)కి సంబంధించిన మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో నీతా అంబానీ కన్యాదానం (Kanyadaan) ప్రాముఖ్యత గురించి ఎంతో చక్కగా వివరించారు. అది విన్న అనేక మంది ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకోవడం విశేషం.


నీతా అంబానీ ఏం చెప్పారంటే..

కన్యాదానం (Kanyadaan) అనేది సాధారణ సంప్రదాయం కంటే గొప్పదని నీతా అంబానీ(Nita Ambani) అన్నారు. ఇది రెండు కుటుంబాల మధ్య అనుబంధానికి చిహ్నమని వ్యాఖ్యానించారు. కన్యాదానంతో ఒక కుటుంబానికి ఓ కొడుకు, మరొకరికి ఓ కుమార్తె లభిస్తుందని, రెండు కుటుంబాల మధ్య పరస్పర ప్రేమ, గౌరవ మార్పిడి జరిగి చక్కటి అనుబంధాన్ని ఏర్పరస్తుందని చెప్పారు. కన్యాదానం కొత్త కుటుంబానికి నాంది పలుకుతుందని, హిందూ సంస్కృతిలో కుమార్తెల పాత్ర చాలా కీలకం అని ఆమె పేర్కొన్నారు.

‘‘ఆడపిల్లలకు ప్రేమ, ఆనందం, శక్తిని అందించేందుకు ఈ వేడుక గౌరవంగా ఉంటుంది. కన్యాదానం వేడుక ప్రేమ, గౌరవం, ఐక్యతకు శాశ్వతమైన చిహ్నం. కన్యాదానం నిర్వహించడం ద్వారా ఇరు కుటుంబాలు వారి బిడ్డలను గౌరవించడమే కాకుండా భవిష్యత్తును కూడా అర్థం చేసుకుంటారు. కన్యాదానం అంటే 'కూతురిని ఇవ్వడం'. హిందూ వివాహాలలో ముఖ్యమైన సంప్రదాయం. ఇందులో వధువు తల్లిదండ్రులు వరుడికి చేయి అందించే రెండు కుటుంబాల కలయికకు ప్రతీక’’ అని ఆమె చెప్పారు.


ఆడపిల్లలే ఒక లక్ష్మి

‘‘కుమార్తెలు(daughters) ప్రపంచంలోనే అత్యుత్తమ దీవెనలు. కుమార్తెను ప్రతి కుటుంబానికి ఒక లక్ష్మిగా భావిస్తారు. మీరు మీ కూతురిని మాకు ఇవ్వడం లేదు. కానీ మీరు మా కొడుకు, కొత్త కుటుంబాన్ని పొందుతున్నారని శైలా, వీరేన్‌కు చెప్పాలనుకుంటున్నాను. ఇక రాధికా-అనంత్ అంబానీకి మేము హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము’’ అని అన్నారు. నీతా అంబానీ మాటలు విని అక్కడ ఉన్న చాలా మంది ఉద్వేగానికి లోనయ్యారు. పలువురు కన్నీళ్లు తుడుచుకోవడం కనిపించింది.

అనంత్ అంబానీ, రాధిక్ మర్చంట్ వివాహానికి సంబంధించిన ప్రతి ఆచారాన్ని పూర్తి ఆచారాలతో, సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. జూలై 12, 2024న అనంత్, రాధిక మర్చంట్‌ల వివాహం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. ఈ పెళ్లిలో భారతీయ సంప్రదాయాన్ని చాలా అందంగా చూపించారు.


ఇవి కూడా చదవండి:

Union Budget 2024: బడ్జెట్‌కు ముందు సాంప్రదాయ హల్వా వేడుక.. నోళ్లను తీపి చేసిన ఆర్థిక మంత్రి


Gold and Silver Rates Today: మరింత ఖరీదైన బంగారం, పడిపోయిన వెండి.. ఎంతకు చేరాయంటే..

హై రిస్క్‌ పెట్టుబడుల కోసం కొత్త అసెట్‌ క్లాస్‌

For Latest News and Business News click here

Updated Date - Jul 17 , 2024 | 10:25 AM