Share News

Viral Video: జోమాటో కంపెనీ ఓనర్‌కు మాల్‌లోకి నో ఎంట్రీ.. అసలేం జరిగిందంటే..

ABN , Publish Date - Oct 07 , 2024 | 10:57 AM

ఆయనొక కంపెనీ ఓనర్ అయినప్పటికీ ఒక మాల్‌లోకి మాత్రం ప్రవేశం లభించలేదు. మెట్ల మార్గం గుండా పైకి వెళ్లాలని అక్కడి సెక్యూరిటీ చెప్పారు. దీంతో ఆయన అలాగే పైకి వెళ్లారు. అయినప్పటికీ కూడా నిరాశ చెందారు. ఆయన ఎవరు, అసలేం జరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Viral Video: జోమాటో కంపెనీ ఓనర్‌కు మాల్‌లోకి నో ఎంట్రీ.. అసలేం జరిగిందంటే..
Zomato CEO Deepinder Goyal

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో(Zomato) సీఈవో దీపిందర్ గోయల్‌(Deepinder Goyal)కు ఇటీవల చేదు అనుభవం ఎదురైంది. తన భార్య గ్రీసియా మునోజ్‌తో కలిసి ఒక రోజు ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేసిన క్రమంలోనే ఇది జరిగింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ వీడియోను పంచుకుంటూ తెలిపారు. గురుగ్రామ్‌లోని ఒక మాల్‌లో ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లినప్పుడు ఆయనను లోనికి అనుమతించలేదు. గోయల్ జొమాటో డెలివరీ బాయ్ ఎరుపు యూనిఫాంలో మాల్ ప్రవేశించారు. ఆ క్రమంలో డెలివరీ ఏజెంట్లకు ఎలివేటర్ అనుమతి లేదని అక్కడి సెక్యూరిటీ గార్డు తెలిపారు. మెట్లను ఉపయోగించి పైకి వెళ్లాలని సూచించారు.


మెట్ల మార్గం

ఆ క్రమంలో ఆయన మెట్ల మార్గం గుండా మూడో ఫ్లోర్‌కి చేరుకున్నారు. కానీ మూడో అంతస్తుకు చేరుకోగానే మరింత నిరాశ చెందారు. ఎందుకంటే అక్కడ వారికి మాల్ లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదు. ఇతర డెలివరీ ఏజెంట్లు కూడా అక్కడే మెట్లపై కూర్చుని ఉన్నారు. ఆర్డర్లు తీసుకునే వారి కోసం అక్కడే మెట్లపైనే వేచి ఉన్నారు. ఆ క్రమంలో నేలపై కూర్చుని అక్కడి డెలివరీ బాయ్స్‌తో కాసేపు మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


మానవత్వమేది

ఈ అంశంపై దీపిందర్ గోయల్‌ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. తన ఉద్యోగుల రోజువారీ కష్టాలను అర్థం చేసుకునేందుకే ఇదంతా చేస్తున్నానని దీపిందర్ తెలిపారు. ఈ క్రమంలో మాల్స్ లాంటి వాటిల్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషి చేస్తానని దీపిందర్ అన్నారు. డెలివరీ డ్రైవర్‌గా పని చేస్తున్న సమయంలో దీపిందర్ అనేక పోస్ట్‌లను షేర్ చేశాడు. రీల్‌ వీడియోలో తన అనుభవం గురించి పంచుకున్నారు. మా కస్టమర్‌లకు ఫుడ్ డెలివరీ చేయడం, ప్రయాణాన్ని ఆస్వాదించడం చాలా గొప్పగా అనిపిస్తుందని అన్నారు. పలు మాల్స్ ఈ డెలివరీ భాగస్వాముల పట్ల మరింత మానవత్వంతో వ్యవహరించాలని కోరారు.


కామెంట్లు

ఈ వీడియోను కొన్ని గంటల్లోనే 12 లక్షల మందికిపైగా వీక్షించారు. అంతేకాదు ఇది చూసిన నెటిజన్లు డెలివరీ ఏజెంట్ల పట్ల అలా వ్యవహరించడం తగదని కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం మీరు గ్రేట్ సార్ అని, ఓనర్ స్థాయిలో ఉండి డెలివరీ బాయ్ కష్టాలను తెలుసుకుంటున్నారని వెల్లడించారు. అయితే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మరి. మాల్స్ విషయంలో ఇలా చేయడం సరియైనదేనా కాదా అనేది చెప్పండి.


ఇవి కూడా చదవండి:


Bhavish Aggarwal: కమెడియన్‌పై ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ గరం గరం.. నెటిజన్ల కామెంట్స్



IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి


Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన


Read More Business News and Latest Telugu News

Updated Date - Oct 07 , 2024 | 11:00 AM