Share News

Ola Electric: మై మ్యాప్ ఇండియా డేటా చోరీ ఆరోపణలను ఖండించిన ఓలా ఎలక్ట్రిక్

ABN , Publish Date - Jul 31 , 2024 | 03:04 PM

ఓలా ఎలక్ట్రిక్(Ola Electric) మ్యాప్‌లను రూపొందించడానికి ఓలా యాజమాన్యం డేటాను కాపీ చేసిందని ఆరోపిస్తూ MapMyIndia మాతృ సంస్థ CE ఇన్ఫో సిస్టమ్స్ చేసిన ఆరోపణలపై Ola Electric స్పందించింది. ఈ క్రమంలో మై మ్యాప్ ఇండియా వాదనలను ఓలా ఎలక్ట్రిక్(Ola Electric) ఖండించి, ఈ ఆరోపణలు తప్పుడువని వెల్లడించింది.

Ola Electric: మై మ్యాప్ ఇండియా డేటా చోరీ ఆరోపణలను ఖండించిన ఓలా ఎలక్ట్రిక్
Ola Electric

ఓలా ఎలక్ట్రిక్(Ola Electric) మ్యాప్‌లను రూపొందించడానికి ఓలా యాజమాన్యం డేటాను కాపీ చేసిందని ఆరోపిస్తూ MapMyIndia మాతృ సంస్థ CE ఇన్ఫో సిస్టమ్స్ చేసిన ఆరోపణలపై Ola Electric స్పందించింది. ఈ క్రమంలో మై మ్యాప్ ఇండియా వాదనలను ఓలా ఎలక్ట్రిక్(Ola Electric) ఖండించి, ఈ ఆరోపణలు తప్పుడువని వెల్లడించింది. అంతేకాదు ఇవి దురుద్దేశపూరితమైనవి, తప్పుదారి పట్టించేవని తెలిపింది. దీంతోపాటు CE ఇన్ఫో సిస్టమ్స్ చేసిన నోటీసులకు త్వరలోనే తగిన సమాధానం ఇస్తామని ఓలా ఎలక్ట్రిక్ స్పష్టం చేసింది.


కాపీ చేసిందని

ఇటివల ఓలా ఎలక్ట్రిక్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. CE ఇన్ఫో సిస్టమ్స్ MapMyIndia బ్రాండ్ యజమాని.. Ola Electricకి లీగల్ నోటీసులు పంపించింది. ఆ నోటీసులో ఓలా మ్యాప్‌లను రూపొందించడానికి తన డేటాను కాపీ చేసిందని, దాని యాప్‌ను 'రివర్స్' ఇంజనీరింగ్ చేసిందని ఆరోపించారు. ఆ క్రమంలో ఓలాతో చర్చలు విఫలమవడంతో నోటీసు పంపినట్లు తెలిపింది. జూన్ 2021లో డిజిటల్ నావిగేషన్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఓలా ఎలక్ట్రిక్ ఉల్లంఘించిందని CE ఇన్ఫో సిస్టమ్స్ లీగల్ నోటీసులో పేర్కొంది. అన్యాయమైన వాణిజ్య లాభాల కోసం ఓలా కంపెనీ తమ డేటాను కాపీ చేసిందని MapMyIndia యజమాని ఆరోపించారు.


లాభాల కోసం

జూన్ 2021లో సంతకం చేసిన తమ ఒప్పందాన్ని కంపెనీ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ CE ఇన్ఫో సిస్టమ్స్ Olaకి లీగల్ నోటీసు పంపిన క్రమంలో వివాదం మొదలైంది. CE ఇన్ఫో సిస్టమ్స్ ప్రకారం Ola MapMyIndia యాజమాన్య డేటాను మ్యాప్స్‌ని అభివృద్ధి చేయడానికి దుర్వినియోగం చేసిందని తెలిపింది. ఆ క్రమంలో ఓలా మ్యాప్‌లను రూపొందించడానికి మా క్లయింట్‌కు చెందిన యాజమాన్య మూలాలైన API, SDKల నుంచి సమాచారం చోరీ చేశారని చెప్పింది. అన్యాయమైన వాణిజ్య లాభాల కోసం చట్ట విరుద్ధంగా డేటాను కాపీ చేశారని CE ఇన్ఫో సిస్టమ్స్ నోటీసులో స్పష్టం చేసింది. మరోవైపు ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ ఆగస్టు 2న నుంచి ప్రారంభం కానుంది. దీని ధరను కంపెనీ ఇప్పటికే ప్రకటించింది.


ఇవి కూడా చదవండి:

Ola IPO: ఓలా ఐపీఓ షేర్ల ధర ఫిక్స్.. పెట్టుబడికి ఎంత కావాలంటే..

Rich Stock: ఏడాదిలోనే ధనవంతులను చేసిన టాటా గ్రూప్ స్టాక్.. ఇంకా పెరగనుందా?


Saving Schemes: ఈ పోస్టాఫీస్ స్కీం ద్వారా ఐదేళ్లలో లక్షాధికారులు కావచ్చు..ఎలాగంటే


Bank Holidays: ఆగస్టులో దాదాపు సగం రోజులు బ్యాంకులు బంద్.. కారణాలివే

Read More Business News and Latest Telugu News

Updated Date - Jul 31 , 2024 | 03:06 PM