Share News

Gold Prices: బిగ్ రిలీఫ్.. నేడు బంగారం రేట్లు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Oct 19 , 2024 | 06:53 AM

హైదరాబాద్‌లో రెండ్రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ రాగా నేడు(అక్టోబర్ 19న) స్వల్పంగా మాత్రమే పెరిగాయి. అక్టోబర్ 19న 22 క్యారెట్ల పసిడి తులానికి రూ.72,410 ఉండగా.. 24 క్యారెట్ల తులం ధర రూ.78,990కి చేరింది.

Gold Prices: బిగ్ రిలీఫ్.. నేడు బంగారం రేట్లు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్: దీపావళి పండగ వేళ బంగారం కొనాలనుకునేవారికి గత రెండ్రోజులపాటు ధరలు షాక్ ఇచ్చాయి. అంతకుముందు తగ్గినట్లే కనిపించిన రేట్లు ఈనెల 17, 18తేదీల్లో భారీగా పెరిగాయి. దీంతో పసిడి ప్రియులు కొనాలా, వద్దా అనే ఆలోచనలో పడ్డారు. అయితే తాజాగా నేడు ధరలు స్వల్పంగా మాత్రమే పెరిగాయి. దీపావళి ముందు వచ్చే ధంతేదాస్‌ను దేశ ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు బంగారం కొనుగోలు చేయడం అనేది కొన్నేళ్లుగా వస్తున్న సంప్రదాయం. అయితే ఈసారి రేట్లు మరింత పెరగడంతో పసిడి కొనాలంటే పేద, మధ్య ప్రజలు తటపటాయిస్తున్నారు. దీపావళి నాటికి తులం బంగారం ధర రూ.80వేలకు చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..


హైదరాబాద్‌లో రెండ్రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ రాగా నేడు(అక్టోబర్ 19న) స్వల్పంగా మాత్రమే పెరిగాయి. అక్టోబర్ 19న 22 క్యారెట్ల పసిడి తులానికి రూ.72,410 ఉండగా.. 24 క్యారెట్ల తులం ధర రూ.78,990కి చేరింది. నిన్నటి రేట్లతో పోలిస్తే 10గ్రాములకు కేవలం రూ.10మేర స్వల్పంగా పెరిగింది. అలాగే విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,410 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.78,990లుగా ఉంది. అయితే నిన్న వెండి మాత్రం భారీ షాక్ ఇచ్చింది. ఒక్కరోజే ఏకంగా కిలోకు రూ.2,100 పెరిగి రూ.1,05,000లకు చేరింది. నేడు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలోకు రూ.100 పెరిగి ధర రూ.1,05,100 వద్ద కొనసాగుతోంది.


అలాగే ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.72,560 ఉండగా.. 24 క్యారెట్ల రేటు రూ.79,140లుగా ఉంది. ముంబై, చెన్నై, కోల్‌కతాలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.72,410 కాగా.. 24 క్యారెట్ల రేటు రూ.78,990లుగా ఉంది.

Updated Date - Oct 19 , 2024 | 06:53 AM