Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
ABN , Publish Date - Nov 13 , 2024 | 08:11 PM
మీరు ప్రతి నెలా మీ జీతం నుంచి కొద్ది మొత్తంలో పెట్టుబడి చేయడం ద్వారా దీర్ఘకాలంలో భారీ మొత్తాన్ని పొందవచ్చు. అయితే రూ. 2 కోట్ల మొత్తాన్ని పొందాలంటే నెలకు ఎంత సేవ్ చేయాలి, ఎన్నేళ్లు పడుతుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు చిన్న వయస్సు నుంచే పొదుపు అలవాటు చేసుకుంటే దీర్ఘకాలంలో మంచి రాబడులను పొందవచ్చు. అందుకోసం నెలకు రూ. 5 వేలు సేవ్ చేసినా, మీరు కొన్నేళ్లలోనే రూ. 2 కోట్ల మొత్తాన్ని పొందవచ్చు. అయితే ఇందుకోసం ఎన్నేళ్లు పడుతుంది. ఎంత మొత్తంలో పెట్టుబడులు (investments) చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మీకు SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) పెట్టుబడులు అద్భుతమైన ఎంపిక. క్రమం తప్పకుండా క్రమశిక్షణతో పెట్టుబడులు చేస్తే అధిక మొత్తాన్ని దక్కించుకుంటారు. మీరు సమ్మేళనం ద్వారా మీ సంపదను క్రమంగా పెంచుకోవచ్చు.
వార్షిక రాబడి ఎలా
అయితే మీరు రూ. 2 కోట్ల మొత్తాన్ని పొందాలంటే నెలకు ఎంత కట్టాలి, ఎన్నేళ్లు సేవ్ చేయాలనే విషయాలను ఇప్పుడు చుద్దాం. రూ. 5,000 నెలవారీ SIPతో ప్రారంభించి, ప్రతి సంవత్సరం 12 శాతం వార్షిక రాబడిని పొందుతారని భావిస్తే మీరు 32 ఏళ్లలో రూ. 2,25,46,485 మొత్తాన్ని పొందుతారు. దీనికోసం మీరు చేసే పెట్టుబడి రూ. 19,20,000 మాత్రమే. దీనికి అదనంగా మీరు చేసిన పెట్టుబడి కంటే వడ్డీనే రెండు కోట్ల రూపాయలకుపైగా రావడం విశేషం. ఒక వేళ మీరు 15 శాతం వార్షిక రాబడిని పొందితే ఈ మొత్తం నాలుగు కోట్ల రూపాయలు అవుతుంది.
సిప్ అంటే ఏంటి?
సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP). దీని ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి చేయవచ్చు. ఇందులో మీరు చిన్న, సులభమైన వాయిదాలలో పెట్టుబడి చేయవచ్చు. దీని కోసం మీరు నెలవారీ, త్రైమాసిక లేదా ఆరు నెలల ప్రాతిపదికన పెట్టుబడి ప్రణాళికలను ఎంచుకోవచ్చు. SIP ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి పెద్ద మొత్తం అవసరం లేదు. ఇందులో మీరు కనీసం మొత్తం రూ. 100 లేదా రూ. 500 నుంచి కూడా పెట్టుబడులు చేసుకోవచ్చు.
ఉపయోగాలు ఏంటి..
సిప్ పెట్టుబడులు వివిధ ఆర్థిక అవసరాల కోసం ఉపయోగపడతాయి. ఉదాహరణకు వివాహం, విద్య, ఆస్తి కొనుగోలు మొదలైన వాటి కోసం నిర్ణీత వ్యవధిలో డబ్బును సేకరించడానికి పెట్టుబడిదారులకు ఇవి సులభమైన మార్గంగా ఉంటాయి. దీని కింద ముందుగా నిర్ణయించిన మొత్తం పెట్టుబడిదారుడు ఎంచుకున్న మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెడతాడు. ఈ పెట్టుబడి స్థిర ప్రాతిపదికన ఉంటుంది. చాలా మంది నెలవారీ మోడ్‌ను ఎంచుకుంటారు. లేదంటే ఏకమొత్తంలో కూడా పెట్టుబడులు చేసుకోవచ్చు. SIPలు అనుభవం లేని, మొదటిసారి పెట్టుబడిదారులకు మంచి ఎంపిక. ఎందుకంటే వీటిలో తక్కువ రిస్క్‌తో మంచి రాబడిని పొందే అవకాశాన్ని ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
Vegetable Prices: షాకింగ్.. త్వరలో పెరగనున్న కూరగాయల ధరలు, కారణమిదేనా...
Credit Card New Rules: క్రెడిట్ కార్డ్ యూజర్లకు అలర్ట్.. నవంబర్ 15 నుంచి కొత్త రూల్స్..
Jobs: గుడ్‌న్యూస్ త్వరలో 3.39 కోట్ల ఉద్యోగాలు.. ఏ రంగంలో ఉంటాయంటే.
Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..
Read More International News and Latest Telugu News