Share News

Stock Market: ఫెడ్ రేట్ల తగ్గింపు వేళ.. భారీ లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

ABN , Publish Date - Sep 19 , 2024 | 09:57 AM

అగ్రరాజ్యం అమెరికా ఫెడ్ రేట్లను తగ్గించిన నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ట స్థాయిలకు చేరుకున్నాయి. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు కూడా పైపైకి చేరాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

Stock Market: ఫెడ్ రేట్ల తగ్గింపు వేళ.. భారీ లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు
stock market updates

దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market) గురువారం (సెప్టెంబర్ 19న) భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. మార్కెట్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో NSE నిఫ్టీ 50 0.47% లాభంతో 25,500 వద్ద మొదలు కాగా, BSE సెన్సెక్స్ 0.51% లాభంతో 83,369.78 వద్ద ప్రారంభమైంది. బ్యాంక్ నిఫ్టీ 53,100 దాటింది. మిడ్‌క్యాప్ ఐటీ షేర్లలో మంచి వృద్ధి నమోదైంది. ఫైనాన్షియల్ స్టాక్స్ కూడా బలంగా ఉన్నాయి. అమెరికాలో బుధవారం ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించాలని నిర్ణయించింది.


టాప్ స్టాక్స్

ఈ క్రమంలో US FED వడ్డీ రేట్లను 0.50% అంటే 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఆర్థిక వ్యవస్థలో మాంద్యం భయం లేదని తెలిపింది. ఆ తర్వాత అమెరికన్ మార్కెట్లలో కొత్త లైఫ్ హై కనిపించింది. ఈ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నిఫ్టీ 50లో NTPC, LTIMindtree, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, టైటాన్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి.

రంగాల వారీగా

అదే సమయంలో ONGC, HCL టెక్నాలజీస్, BPCL, బజాజ్ ఫిన్‌సర్వ్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ వెనుకబడి ఉన్నాయి. రంగాల వారీగా చూస్తే ఐటీ ఇండెక్స్ 1.55 శాతం, రియాల్టీ ఇండెక్స్ 1.10 శాతం లాభాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మిగతా అన్ని రంగాల సూచీలు కూడా గ్రీన్‌లోనే ఉన్నాయి. మరోవైపు బీఎస్ఈ మిడ్‌క్యాప్ 0.59 శాతం, బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ 0.43 శాతం పెరిగింది.


ఆసియా మార్కెట్లు

ఇంకోవైపు ఆసియా పసిఫిక్ మార్కెట్లలో గురువారం జపాన్‌కు చెందిన నిక్కీ 225 ముందంజలో ట్రేడవుతోంది. Nikkei, Topix రెండూ దాదాపు 2 శాతం లాభపడ్డాయి. తైవాన్ వెయిటెడ్ ఇండెక్స్ 0.12 శాతం పెరిగింది. దక్షిణ కొరియా బ్లూ చిప్ కోస్పి అధిక ప్రారంభమైన తర్వాత 0.51 శాతం పడిపోయింది. అదే సమయంలో స్మాల్ క్యాప్ కోస్‌డాక్ 0.25 శాతం పెరిగింది. ఆస్ట్రేలియా S&P/ASX 200 ఇండెక్స్ 0.15 శాతం లాభంతో మొదలైంది.


నిన్న ఇలా

బంగారం ధర 0.62 శాతం తగ్గి ఔన్స్‌కు 2,553.67 డాలర్లకు చేరుకుంది. ఈ వారం ప్రారంభంలో రికార్డు స్థాయిలను తాకింది. చమురు ధరలు తగ్గాయి. ఎందుకంటే US లేబర్ మార్కెట్‌పై ఉన్న అశాంతికి ప్రతిస్పందనగా రేటు తగ్గింపు కనిపించింది. బ్రెంట్ క్రూడ్ 5 సెంట్లు కోల్పోయి బ్యారెల్ $73.65 వద్ద స్థిరపడింది. బుధవారం BSE సెన్సెక్స్ 131.43 పాయింట్లు లేదా 0.16% క్షీణించి 82,948.23 వద్ద ముగిసింది. మరోవైపు NSE నిఫ్టీ కూడా 41 పాయింట్లు లేదా 0.16% క్షీణించి 25,377.55 వద్ద ముగిసింది.


ఇవి కూడా చదవండి:

UPI Lite: యూపీఐ లైట్ నుంచి త్వరలో కొత్త ఫీచర్.. బ్యాలెన్స్ తక్కువ ఉన్నా కూడా

Stock Market: నాలుగున్నరేళ్లలో లక్షను రూ.29 లక్షలు చేసిన స్టాక్.. ఏకంగా 2818 శాతం గ్రోత్

Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే

Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు

Read MoreBusiness News and Latest Telugu News

Updated Date - Sep 19 , 2024 | 10:12 AM