Share News

Alpha Hotel: ఆ వార్తలపై ఆల్ఫా హోటల్ క్లారిటీ.. అలాంటివి నమ్మోద్దని సూచన

ABN , Publish Date - Jun 26 , 2024 | 01:30 PM

సికింద్రాబాద్‌(secunderabad) ప్రధాన రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఫేమస్ ఆల్ఫా హోటల్‌(Alpha Hotel) గురించి నగరవాసులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ హోటల్ గురించి సోషల్ మీడియా(social media)లో ఇటివల పలు వార్తలు, పుకార్లు ప్రచారం వచ్చాయి. వీటిపై హోటల్ యాజమాన్యం స్పందించి, అలాంటివి నమ్మోద్దని ప్రజలకు సూచించింది. అసలేమైందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Alpha Hotel: ఆ వార్తలపై ఆల్ఫా హోటల్ క్లారిటీ.. అలాంటివి నమ్మోద్దని సూచన
secunderabad Alpha Hotel

సికింద్రాబాద్‌(secunderabad) ప్రధాన రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఫేమస్ ఆల్ఫా హోటల్‌(Alpha Hotel) గురించి నగరవాసులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సికింద్రాబాద్‌ వెళ్లిన అనేక మంది ఇక్కడ ఛాయ్ ఒక్కసారైనా రుచి చూడాలని భావిస్తారు. ఇక్కడ ఛాయ్ మాత్రమే కాదు బిర్యానీతోపాటు పలు రకాల వంటకాలకు కూడా ఈ హోటల్ పేరు గాంచింది. అయితే గత రెండు మూడు రోజులుగా ఈ హోటల్ గురించి సోషల్ మీడియా(social media)లో పలు వార్తలు, పుకార్లు ప్రచారం జరుగుతున్నాయి. ఈ హోటల్లో నిబంధనలకు విరుద్ధంగా అపరిశుభ్రమైన కిచెన్ ఉందని, తనిఖీ చేయడానికి వచ్చిన అధికారులకు కూడా యాజమాన్యం సహకరించలేదని పలు రకాల వార్తలొచ్చాయి.


అయితే ఇలాంటి వార్తలపై హోటల్ యాజమాన్యం(Alpha Hotel) స్పందించి, తీవ్రంగా ఖండించింది. ఆల్ఫా హోటల్‌పై వివిధ వార్తాపత్రికలు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు ఇలాంటి తప్పుడు కథనాలను(fake news) ప్రచారం చేయోద్దని హోటల్ మేనేజ్‌మెంట్ కోరింది. తాము FSSAI నిబంధల ప్రకారమే నాణ్యమైన ఆహారాన్ని ప్రతిరోజు దాదాపు 70 వేల మందికిపైగా అందిస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు ఇటివల ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన సోదాలకు తాము సహాకరించామని యాజమాన్యం తెలిపింది.


తనిఖీ అనంతరం హోటల్ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పలు సూచనలు మాత్రమే చేశారని ఆల్ఫా హోటల్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో తప్పుదోవ పట్టించే వార్తల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అలాంటివి నమ్మోద్దని యాజమాన్యం స్పష్టం చేసింది. గత 40 ఏళ్లకుపైగా ఎంతో మంది కస్టమర్లకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని ఈ సందర్భంగా ఆల్ఫా హోటల్‌ యాజమాన్యం మరోసారి గుర్తు చేసింది.


ఇది కూడా చదవండి:

JNTU: జేఎన్‌టీయూలో కొలిక్కిరాని అఫిలియేషన్‌ ప్రక్రియ


Telangana: ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావు నేడు భారత్‌కి.. అరెస్ట్‌కు సిద్ధమైన పోలీసులు


వచ్చే ఐదేళ్లలో రూ.2,000 కోట్ల పెట్టుబడులు


For Latest News and Telangana News click here

Updated Date - Jun 26 , 2024 | 01:34 PM