JNTU: జేఎన్‌టీయూలో కొలిక్కిరాని అఫిలియేషన్ ప్రక్రియ
ABN , Publish Date - Jun 26 , 2024 | 01:10 PM
టీఎస్‌ఎప్‌సెట్ కౌన్సెలింగ్‌కు సమయం ఆసన్నమవుతున్నప్పటికీ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు జేఎన్‌టీయూ(JNTU) ఇచ్చే అఫిలియేషన్ ప్రక్రియ ఇంకా కొలిక్కిరాలేదు. ఎప్‌సెట్‌లో ర్యాంకులు పొందిన అభ్యర్థులకు ఈనెల 27నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని సాంకేతిక విద్యాశాఖ అధికారులు నెలరోజుల (మే24న)కిందటే తేదీలను ప్రకటించారు.
హైదరాబాద్ సిటీ: టీఎస్‌ఎప్‌సెట్ కౌన్సెలింగ్‌కు సమయం ఆసన్నమవుతున్నప్పటికీ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు జేఎన్‌టీయూ(JNTU) ఇచ్చే అఫిలియేషన్ ప్రక్రియ ఇంకా కొలిక్కిరాలేదు. ఎప్‌సెట్‌లో ర్యాంకులు పొందిన అభ్యర్థులకు ఈనెల 27నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని సాంకేతిక విద్యాశాఖ అధికారులు నెలరోజుల (మే24న)కిందటే తేదీలను ప్రకటించారు. అయినప్పటికీ జేఎన్‌టీయూ పరిధిలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్/అనుమతులు ఇచ్చే విషయమై ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కౌన్సెలింగ్ తేదీలు సమీపిస్తున్నప్పటికీ అఫిలియేషన్ల గురించి అకడమిక్ ఆడిట్ సెల్ విభాగం నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో దాదాపు 138 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు జేఎన్‌టీయూ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి.
ఇదికూడా చదవండి: Shantikumari: గ్రేటర్‌లో కంటోన్మెంట్ ప్రాంతాల విలీనానికి సిద్ధం..
ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్లు ఇచ్చే ప్రక్రియ ఇంకా కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం రెగ్యులర్ వైస్ చాన్స్‌లర్ (వీసీ) లేకపోవడమేనని యూనివర్సిటీ వర్గాలంటున్నాయి. ఇన్‌చార్జ్ వీసీ తగినంత సమయం కేటాయిస్తేనే అఫిలియేషన్ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని, లేనిపక్షంలో కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించడం సాధ్యం కాదని అంటున్నారు.
ఇదికూడా చదవండి: Telangana: ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావు నేడు భారత్‌కి.. అరెస్ట్‌కు సిద్ధమైన పోలీసులు
పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది: రిజిస్ట్రార్
ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు జేఎన్‌టీయూ అఫిలియేషన్లు ఇచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని రిజిస్ట్రార్ డాక్టర్ కె.వెంకటేశ్వరరావు చెప్పారు. ఇన్‌చార్జ్ వీసీ సోమవారం జేఎన్‌టీయూకు వచ్చారని, కాలేజీల అఫిలియేషన్‌కు సంబంధించిన వివరాలన్నీ ఆయనకు అందజేస్తున్నామన్నారు. ప్రస్తుతం అఫిలియేషన్ ప్రక్రియ పరిశీలన దశలోనే ఉందన్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News