Shyam Pitroda: సంపన్నులు చనిపోతే వారి సంపద తీసుకునే చట్టం రూపొందించాలి
ABN , Publish Date - Apr 24 , 2024 | 10:45 AM
భారతదేశంలో ధనికులు, పేదల మధ్య సంపద(wealth) అంతరం గురించి ప్రతి సారి అనేక విధాలుగా చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఈ అంశంపై ఇటివల రాజకీయ పార్టీలు సైతం ప్రకటనలు ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అమెరికాలోని చికాగోలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు(Indian Overseas Congress Chairman) శ్యాం పిట్రోడా(Shyam Pitroda) భారతదేశంలోని సంపన్నుల సంపద గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
భారతదేశంలో ధనికులు, పేదల మధ్య సంపద(wealth) అంతరం గురించి ప్రతి సారి అనేక విధాలుగా చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఈ అంశంపై ఇటివల రాజకీయ పార్టీలు సైతం ప్రకటనలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని అధికార బీజేపీ ధనికులపై ఆసక్తి చూపిస్తుందని భారత జాతీయ కాంగ్రెస్(congress) ఆరోపణలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా అమెరికాలోని చికాగోలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షులు(Indian Overseas Congress Chairman) శ్యాం పిట్రోడా(Shyam Pitroda) భారతదేశంలోని సంపన్నుల సంపద గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
అయితే శ్యాం పిట్రోడా 'అమెరికా(America)లో వారసత్వపు పన్ను(inheritance tax) గురించి ప్రస్తావించారు. ఎవరైనా అమెరికాలో 100 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు కలిగి ఉండి, వారు చనిపోతే, అతని సంపదలో 45 శాతం మాత్రమే వారి పిల్లలకు వెళ్తుంది. మిగిలిన 55 శాతం ఆస్తి(property) అక్కడి ప్రభుత్వానికి చెందుతుందన్నారు. మీ తరంలో సంపదను సృష్టించి, మీరు వెళ్లిపోయే సమయంలో దానిలో కొంత ప్రజలకు వదిలివేయాలని అక్కడి చట్టం చెబుతుంది. అన్నీ కాదు కానీ సగం. ఈ న్యాయమైన చట్టం తనకు ఇష్టమని శ్యాం పిట్రోడా(Shyam Pitroda) అన్నారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వంతోపాటు ప్రజలకు మేలు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కానీ భారతదేశంలో(india) ఈ చట్టం లేదని అన్నారు. ఒకరి సంపద 10 బిలియన్లు ఉండి, అతను చనిపోతే(death) అతని పిల్లలకు 10 బిలియన్లు లభిస్తాయి. కానీ ప్రభుత్వం, ప్రజలకు ఏమీ లభించదన్నారు. కాబట్టి ప్రజలు ఇలాంటి విషయాలపై చర్చించాలన్నారు. అంతిమంగా ఎలాంటి తీర్మానం చేస్తారో తెలియదు. కానీ సంపద పునర్విభజన గురించి మాట్లాడేటప్పుడు మాత్రం ధనవంతుల ప్రయోజనాలే కాకుండా ప్రజల ప్రయోజనాలు కూడా పట్టించుకోవాలని అన్నారు.
అయితే ఈ అంశంపై శ్యాం పిట్రోడా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన సోషల్ మీడియా(social media) ఎక్స్ లో పోస్ట్ చేయగా ఇది చూసిన పలువురు స్పందిస్తున్నారు. కొందరు దీనికి సపోర్ట్ చేస్తుండగా, మరికొంత మంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. కానీ దీని వల్ల ధనవంతులకు ఏ విధంగా ప్రయోజనకరంగా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి:
IPL 2024: నేడు DC vs GT మ్యాచ్.. గెలవకుంటే ప్లేఆఫ్ రేసు నుంచి
Gold and Silver Rates: బంగారం, వెండి మళ్లీ తగ్గిందోచ్..ఎంత ఉన్నాయంటే
Read Latest Business News and Telugu News