Womens Business: మహిళల వ్యాపార ఆలోచన.. రూ. 5 కోట్ల ప్రభుత్వ సాయం..
ABN , Publish Date - Nov 18 , 2024 | 01:49 PM
ప్రస్తుత కాలంలో మహిళలు ఇంటి పనులు, ఉద్యోగాలు చేయడం మాత్రమే కాదు. పలువురు వ్యాపారాలు సైతం ప్రారంభించి సక్సెస్ అయ్యారు. అయితే కొత్తగా బిజినెస్ చేయాలనుకునే వారి కోసం ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది. ఆ వివరాలేంటనేది ఇక్కడ తెలుసుకుందాం.
మహిళలు ఇప్పుడు ఇంటిని నిర్వహించుకోవడమే కాదు. వారు కూడా తమ కాళ్లపై తాము నిలబడాలని కోరుకుంటున్నారు. దీని కోసం వారు ఎంచుకున్న రంగాలలో ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ప్రైవేట్ ఉద్యోగాల ఎంపిక మాత్రమే కాకుండా వ్యాపారం కూడా చేయాలనుకుంటున్నారు. ఇలాంటి సందర్భాలలో మహిళలకు ఎలాంటి వ్యాపార అవకాశాలు ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. దేశంలో ఇప్పటివరకు 100 కంటే ఎక్కువ యునికార్న్‌లు ఉన్నాయి. పురుషులే కాదు, మహిళలు కూడా కొన్ని సంస్థలకు ముందుండి వ్యవస్థాపకులుగా (Women Entrepreneurs) తమ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో మీరు మహిళ అయితే వ్యాపార ప్రణాళికను కలిగి ఉంటే, మీరు కూడా పనులను ప్రారంభించవచ్చు. దీనికి నిధుల సమస్య కూడా ఉండదు.
నిధులు సమకూర్చడం
అలాంటి స్టార్టప్‌లకు సహాయం చేయడానికి భారత ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను ప్రారంభించింది. ఆర్థిక సలహాదారు ఆర్తీ భట్నాగర్ ఇటీవలే స్టార్టప్‌లు తమ వ్యాపారాన్ని పురోగమింపజేసేందుకు రూ. 5 కోట్ల వరకు పొందవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం కింద మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడానికి ప్రతి ఇంక్యుబేటర్‌కు రూ. 5 కోట్లు కేటాయిస్తున్నట్లు గుర్తు చేశారు. ఇది కేవలం నిధుల గురించి మాత్రమే కాదన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు అవసరమైన వనరులు సమకూర్చడం, వారి వెంచర్‌లను అభివృద్ధి చేయడానికి గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమన్నారు.
మహిళా పారిశ్రామికవేత్తలకు..
వ్యాపారాల విషయంలో మహిళా పారిశ్రామికవేత్తలు కొత్త ఆవిష్కర్తలతో ముందుకొస్తే భారతదేశ సుస్థిరత ప్రయాణంలో మార్పుకు అవకాశం ఉంటుందని భట్నాగర్ ఈ సందర్భంగా అన్నారు. వివిధ అవసరాల కోసం స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం అందించడానికి రూ. 945 కోట్లతో DPIIT స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ (SISF)ని ప్రకటించారు. SISF కాన్సెప్ట్ ఉద్దేశం ప్రోటోటైప్ డెవలప్‌మెంట్, ప్రోడక్ట్ టెస్టింగ్, మార్కెట్ ఎంట్రీ, వాణిజ్యీకరణ కోసం స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కొత్తగా ప్రారంభించిన స్టార్టప్‌లు లేదా వెంచర్ క్యాపిటలిస్ట్‌లతో పోటీపడే దశకు మద్దతు కల్పించడానికి వీలు కల్పిస్తుంది.
వెంచర్ క్యాపిటల్స్ కూడా..
ఇది ఇప్పటికే 300 ఇంక్యుబేటర్ల ద్వారా 3,600 మంది పారిశ్రామికవేత్తలకు మద్దతునిస్తుంది. ఈ పథకం 2021లో ప్రారంభించబడింది. ఈ ఫండ్ పొందాలనుకునే వారు ప్రభుత్వ వెబ్‌సైట్ seedfund.startupindia.gov.inని సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదే సమయంలో వెంచర్ క్యాపిటల్ (VC) ఫండ్‌లు మేనేజ్‌మెంట్ ఇన్వెస్ట్‌మెంట్ పూల్స్‌గా ఉంటాయి. ఇవి అధిక అభివృద్ధి గల స్టార్టప్‌లు, ఇతర ప్రారంభ దశ సంస్థలలో పెట్టుబడి పెడతాయి. ఇవి సాధారణంగా గుర్తింపు పొందిన పెట్టుబడిదారులకు మాత్రమే అమల్లో ఉంటాయి. ఈ ఫండ్‌లు అధిక స్కేలబుల్, భారీ టార్గెట్ మార్కెట్‌ను కలిగి ఉన్న స్టార్టప్‌ల కోసం చూస్తాయి.
ఇవి కూడా చదవండి:
Rupee: డాలర్‌తో పోల్చితే డేంజర్ జోన్‌లో రూపాయి.. కారణమిదేనా..
Viral News: మీటింగ్‌కు రాలేదని 90% ఉద్యోగులను తొలగించిన సీఈఓ.. నెటిజన్ల కామెంట్స్
PAN Aadhaar: పాన్ ఆధార్ ఇంకా లింక్ చేయలేదా.. ఇప్పుడే చేసుకోండి, గడవు సమీపిస్తోంది..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Read More Business News and Latest Telugu News