Share News

Stock Market: నష్టాల నుంచి లాభాల్లోకి.. కోలుకుంటున్న దేశీయ సూచీలు..

ABN , Publish Date - Oct 04 , 2024 | 11:34 AM

గురువారం భారీ నష్టాలను చూసిన మార్కెట్లు శుక్రవారం లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత మరింత క్షీణించాయి. అయితే ఆ తర్వాత కొనుగోళ్లు మొదలవడంతో లాభాల్లోకి వచ్చాయి.

Stock Market: నష్టాల నుంచి లాభాల్లోకి.. కోలుకుంటున్న దేశీయ సూచీలు..
Stock Market

అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ముదురుతున్న ఘర్షణ వాతావరణం, యుద్ధ భయాలతో దేశీయ సూచీలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. గురువారం భారీ నష్టాలను చూసిన మార్కెట్లు శుక్రవారం లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత మరింత క్షీణించాయి. అయితే ఆ తర్వాత కొనుగోళ్లు మొదలవడంతో లాభాల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు (Business News).


గురువారం ముగింపు (82, 497)తో పోల్చుకుంటే దాదాపు 200 పాయింట్ల నష్టంతో 82, 244 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత కొద్ది సేపటికే 82, 051కు పడిపోయింది. అయితే ఆ తర్వాత కొనుగోళ్లు ప్రారంభం కావడంతో లాభాల బాట పట్టింది. కనిష్టం నుంచి ఏకంగా 900 పాయింట్లు ఎగబాకి 82, 935 వద్ద గరిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం ఉదయం 11:25 గంటల సమయానికి సెన్సెక్స్ 272 పాయింట్ల లాభంతో 82, 769 వద్ద ట్రేడ్ అవుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. దాదాపు 75 పాయింట్ల నష్టంతో రోజును ప్రారంభించింది. ఆ తర్వాత లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుతానికి 54 పాయింట్ల లాభంతో 25, 304 వద్ద ట్రేడ్ అవుతోంది


సెన్సెక్స్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా, గ్లెన్‌మార్క్, ఓఎన్‌జీసీ, గుజరాత్ గ్యాస్ లాభాల బాటలో సాగుతున్నాయి. ఎమ్ అండ్ ఎమ్ ఫైనాన్సియల్స్, చంబల్ ఫెర్టిలైజర్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, బర్గర్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బీఎస్‌ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 64 పాయింట్ల లాభంలో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 273 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.96గా ఉంది.

ఇవి కూడా చదవండి..

Gold Price: పరుగులు తీస్తున్న పసిడి ధర.. తులం ఎంతంటే


అక్కడ ఇక్కడ వార్‌.. బేర్‌ర్‌..!


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 04 , 2024 | 11:34 AM