Share News

Stock Market: సెన్సెక్స్, నిఫ్టీకి లాభాలు.. ఆల్ టైమ్ హైకి చేరుకున్న దేశీయ సూచీలు..!

ABN , Publish Date - Sep 02 , 2024 | 04:21 PM

అంతర్జాతీయంగా పలు ఉద్రిక్తతల కారణంగా ఇతర దేశాల మార్కెట్లు అనిశ్చిత్తిలో కదలాడుతున్నా దేశీయ సూచీలు మాత్రం లాభాల భాటలోనే పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుతున్నా ఫైనాన్సియల్, ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్ల కారణంగా సెన్సెక్స్, నిఫ్టీ లాభాలు అందుకున్నాయి.

Stock Market: సెన్సెక్స్, నిఫ్టీకి లాభాలు.. ఆల్ టైమ్ హైకి చేరుకున్న దేశీయ సూచీలు..!
Stock Market

అంతర్జాతీయంగా పలు ఉద్రిక్తతల కారణంగా ఇతర దేశాల మార్కెట్లు అనిశ్చిత్తిలో కదలాడుతున్నా దేశీయ సూచీలు మాత్రం లాభాల భాటలోనే పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుతున్నా ఫైనాన్సియల్, ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్ల కారణంగా సెన్సెక్స్, నిఫ్టీ లాభాలు అందుకున్నాయి. దీంతో వరుసగా 13వ రోజు కూడా దేశీయ సూచీలు లాభాలతోనే ముగిశాయి. సెన్సిక్స్, నిఫ్టీ ఆల్‌టైమ్ హైని టచ్ చేశాయి. (Business News).


శనివారం ముగింపు (82, 365)తో పోల్చుకుంటే దాదాపు 400 పాయింట్ల లాభంతో 82, 725 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ప్రారంభంలోనే 82, 725 వద్ద జీవన కాల గరిష్టాన్ని తాకి ఆ తర్వాత కిందకు దిగింది. ఆ తర్వాత అమ్మకాల కారణంగా కిందకు దిగింది. చివరకు 194 పాయింట్ల లాభంతో 82, 559 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా లాభాల జోరు కొనసాగించింది. ఇంట్రాడేలో 25, 300 మార్క్‌ను తొలిసారి తాకింది. చివరకు 42 పాయింట్ల లాభంతో 25, 278 వద్ద స్థిరపడింది.


సెన్సెక్స్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌పీసీఎల్ టెక్నాలజీస్, ఐటీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాలు ఆర్జించాయి. ఎన్టీపీసీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, ఎల్ అండ్ టీ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బీఎస్‌ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 134 పాయింట్లు కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ 88 పాయింట్లు ఎగబాకింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.92గా ఉంది.

ఇవి కూడా చదవండి..

Madhabi Puri Buch: సెబీ చీఫ్ మాధవిపై కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు.. 3 చోట్ల జీతం తీసుకుంటున్నారని ఆరోపణ


ITR Refund: ఐటీఆర్ రీఫండ్ ఇంకా వాపసు రాలేదా.. అయితే ఇలా చేయండి


Telegram: మరికొన్ని రోజుల్లో టెలిగ్రామ్ యాప్ బ్యాన్?.. కారణాలివేనా..

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 02 , 2024 | 04:21 PM