Stock Market: సరికొత్త రికార్డుల దిశగా సెన్సెక్స్, నిఫ్టీ.. సెన్సెక్స్ 545 పాయింట్లు ప్లస్!
ABN , Publish Date - Jul 03 , 2024 | 04:03 PM
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళ్లాయి. సెన్సెక్స్ తొలిసారి 80 వేల మైలురాయిని చేరుకుంది. నిఫ్టీ కూడా జీవన కాల గరిష్టాన్ని టచ్ చేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళ్లాయి. సెన్సెక్స్ తొలిసారి 80 వేల మైలురాయిని చేరుకుంది. నిఫ్టీ కూడా జీవన కాల గరిష్టాన్ని టచ్ చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ సెక్టార్ షేర్లు రాణించడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూలాంశాల కారణంగా ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా అదే జోరును కొనసాగంచింది. చివరకు 545 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది. (Business News).
మంగళవారం ముగింపు (79, 441)తో పోల్చుకుంటే దాదాపు 600 పాయింట్ల లాభంతో 80, 013 వద్ద రోజును ప్రారంభించిన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. 80, 074 వద్ద లైఫ్ టైమ్ హైని టచ్ చేసింది. ఆ తర్వాత కిందకు దిగి వచ్చినప్పటికీ తర్వాత మళ్లీ కోలుకుంది. చివరకు 545 పాయింట్ల లాభంతో 79, 986 వద్ద రోజును ముగించింది. ఇక, నిఫ్టీ కూడా అదే బాటలో పయనించింది. 24,309 వద్ద జీవన కాల గరిష్టాన్ని టచ్ చేసింది. చివరకు 162 పాయింట్ల లాభంతో 24,286 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్‌లో పవర్ ఫైనాన్స్, భెల్, బందన్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. అశోఖ్ లేలాండ్, గుజరాత్ గ్యాస్, బలరామ్‌పూర్ చిన్నీ, టీసీఎస్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 438 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 921 పాయింట్లు ఎగబాకింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.53గా ఉంది.
ఇవి కూడా చదవండి..
Koo: మూతపడిన దేశీ 'ట్విట్టర్' కూ.. ఎందుకిలా చేశారు, ఏమైందంటే..
July 17th: ఈ ప్రాంతాల్లో జులై 17న పబ్లిక్ హాలిడే.. కారణమిదే
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..