Koo: మూతపడిన దేశీ 'ట్విట్టర్' కూ.. ఎందుకిలా చేశారు, ఏమైందంటే..
ABN , Publish Date - Jul 03 , 2024 | 02:19 PM
కోటి మంది యాక్టివ్ నెలవారీ యూజర్లను కలిగి ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫాం కూ(koo) ఇప్పుడు మూతపడింది. ఈ విషయాన్ని స్వయంగా కంపెనీ ప్రతినిధులే చెప్పడం విశేషం. అసలు ఎందుకు మూతపడింది, కారణాలేంటనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
కోటి మంది యాక్టివ్ నెలవారీ యూజర్లను కలిగి ఉన్న సోషల్ మీడియా(social media) ప్లాట్‌ఫాం కూ(koo) ఇప్పుడు మూతపడింది. ఈ విషయాన్ని స్వయంగా కంపెనీ ప్రతినిధులే చెప్పడం విశేషం. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం Twitter (ఇప్పుడు X)కి గట్టి పోటీ ఇచ్చిందని చెప్పవచ్చు. ఒకప్పుడు స్టాక్ ఆటగాడు విరాట్ కోహ్లీ సహా రాజకీయ నాయకుల నుంచి మంత్రుల వరకు చాలా మంది వీఐపీలు కూ ఖాతాలను క్రియేట్ చేసుకున్నారు.
కోటి యూజర్లు
ప్రస్తుతం కూ రోజువారీ క్రియాశీల వినియోగదారుల(users) సంఖ్య 21 లక్షలకు చేరుకుంది. ఇది మాత్రమే కాదు, కంపెనీ నెలవారీ క్రియాశీల వినియోగదారుల సంఖ్య ఇటివల 1 కోటికి చేరుకుంది. ఈ వేదికపై 9 వేల మంది వీఐపీలకు ఖాతాలు ఉన్నాయి. ఈ వేదికను రాజకీయ నాయకులు కూడా చాలా ప్రచారం చేశారు. అప్పట్లో ఎలాన్ మస్క్ భారతదేశంలో 23 లక్షల కంటే ఎక్కువ ట్విట్టర్ ఖాతాలను నిషేధించింది. దీంతో అనేక మంది ప్రత్యమ్నాయంగా కూలో ఖాతాలో తెరిచారు. ఢిల్లీ రైతు ఉద్యమం సమయంలో ఈ యాప్ ఎక్కువగా ప్రచార్యుంలోకి వచ్చింది.
ఎందుకు ఆగిపోయింది?
ఈ ప్లాట్‌ఫారమ్ దేశీ ట్విట్టర్‌గా Koo పేరు దక్కించుకుంది. ఆ క్రమంలో ఈ యాప్‌ను నైజీరియా, బ్రిజిల్ వంటి దేశాల్లో కూడా విస్తరించారు. ఇంత విజయం సాధించినప్పటికీ కంపెనీ మాత్రం ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. దీంతో ఈ కంపెనీలో ఇటివల పలువురు ఉద్యోగులను కూడా తొలగించారు. ఏప్రిల్ 2023 నుంచి ఈ కంపెనీ శ్రామిక శక్తిని తగ్గించడం ప్రారంభించింది.
అధిక సాంకేతిక వ్యయం, మూలధనం కొరత మరింత పెరిగిన నేపథ్యంలో కంపెనీ అమ్మకం కోసం పలు అంతర్జాతీయ సంస్థలు, డైలీ హంట్ వంటి వివిధ కంపెనీలతో చర్చలు జరిపారు. అవి సఫలం కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవస్థాపకులు అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ బిడవత్కా ఈ సంస్థను మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ యాప్ 2019లో ప్రారంభమైంది.
ఇది కూడా చదవండి:
Stock Market: జీవితకాల గరిష్టానికి సెన్సెక్స్.. మరోవైపు నిఫ్టీ కూడా..
Gold and Silver Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి రేట్లు
For Latest News and Business News click here