Share News

Stock Market: బడ్జెట్ ముందు అప్రమత్తత.. రోజంతా తీవ్ర అనిశ్చిత్తిలో దేశీయ సూచీలు..!

ABN , Publish Date - Jul 22 , 2024 | 03:50 PM

కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రోజు దేశీయ సూచీలు తీవ్ర ఒడిదుడుకులును ఎదుర్కొన్నాయి. రోజుంతా లాభనష్టాలతో దోబూచులాడాయి. మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో చివరకు నష్టాలతోనే రోజును ముగించాయి. సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు కొద్ది సేపటి తర్వాత కోలుకున్నాయి.

Stock Market: బడ్జెట్ ముందు అప్రమత్తత.. రోజంతా తీవ్ర అనిశ్చిత్తిలో దేశీయ సూచీలు..!
Stock Market

కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రోజు దేశీయ సూచీలు తీవ్ర ఒడిదుడుకులును ఎదుర్కొన్నాయి. రోజుంతా లాభనష్టాలతో దోబూచులాడాయి. మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో చివరకు నష్టాలతోనే రోజును ముగించాయి. సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు కొద్ది సేపటి తర్వాత కోలుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ నష్టాల బాట పట్టాయి. చివరకు సెన్సెక్స్ 102 పాయింట్ల నష్టంతో రోజును ముగించింది. నిఫ్టీ స్వల్ప నష్టాలను మూటగట్టుకుంది. (Business News).


శుక్రవారం ముగింపు (80, 604)తో పోల్చుకుంటే దాదాపు 200 పాయింట్ల నష్టంతో 80 ,408 రోజును ప్రారంభించిన సెన్సెక్స్ ఆ తర్వాత కోలుకుంది. 80,800 వద్ద ఇంట్రాడే హైని టచ్ చేసింది. ఆ తర్వాత మళ్లీ నష్టాల బాట పట్టింది. ఓ దశలో సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్లు నష్టపోయి 80,100 వద్ద ఇంట్రాడే లో కి చేరుకుంది. చివరకు 102 పాయింట్ల నష్టంతో 80, 502 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీకి కూడా నష్టాలు తప్పలేదు. నిఫ్టీ 21 పాయింట్లు కోల్పోయి 24,509 వద్ద స్థిరపడింది. రిలయన్స్ షేర్ 3 శాతానికి పైగా నష్టపోయింది.


సెన్సెక్స్‌లో ఇండియన్ హోటల్స్, హిందుస్తాన్ కాపర్, అతుల్, పీఐ ఇండస్ట్రీస్ షేర్లు లాభాలు ఆర్జించాయి. విప్రో, కోటక్ మహీంద్రా, రిలయన్స్, బిర్లా సాఫ్ట్ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. వరసగా నష్టాలు మూటగట్టుకుంటున్న మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈ రోజు లాభపడింది. 716 పాయింట్లు ఎగబాకింది. బ్యాంక్ నిఫ్టీ 14 పాయింట్లు స్వల్ప లాభాన్ని ఆర్జించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.66గా ఉంది.

ఇవి కూడా చదవండి..

Economic Survey 2024: ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. ఈసారి భారత్ వృద్ధి రేటు ఏంతంటే..


Amazon: స్విగ్గీలో వాటాను కొనుగోలు చేయనున్న అమెజాన్!


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 22 , 2024 | 03:50 PM