Share News

Economic Survey 2024: ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. ఈసారి భారత్ వృద్ధి రేటు ఏంతంటే..

ABN , Publish Date - Jul 22 , 2024 | 01:41 PM

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) 2023-2024 ఆర్థిక సర్వేను(Economic Survey 2024) లోక్‌సభలో సమర్పించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Economic Survey 2024: ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. ఈసారి భారత్ వృద్ధి రేటు ఏంతంటే..
economic survey 2024

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండో పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) 2023-2024 ఆర్థిక సర్వేను(Economic Survey 2024) నేడు లోక్‌సభలో సమర్పించారు. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వే. ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పలు ముఖ్యమైన విషయాలను ఇందులో ప్రస్తావించారు. వీటిలో జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, ఉపాధి రేటు, ఆర్థిక లోటు వంటి అనేక అంశాలు ఉన్నాయి.


GDP వృద్ధి

బడ్జెట్‌కు ముందు సమర్పించిన ముఖ్యమైన ఆర్థిక పత్రం ఇది. దీని ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో GDP వృద్ధి అంచనా FY24కి 6 నుంచి 6.8 శాతం మధ్య ఉంటుందని తెలిపారు. FY 24లో GDP వృద్ధి రేటు 8.2 శాతంగా పేర్కొనబడిన గణాంకాల మంత్రిత్వ శాఖ కొత్త అంచనా కంటే ఇది చాలా తక్కువ కావడం విశేషం. ఈ సర్వేలో వచ్చే ఆర్థిక సంవత్సరం 2025కి భారతదేశ ఆర్థిక వృద్ధి 6.5 నుంచి 7 శాతం మధ్య ఉంటుందని అంచనా వేయబడింది. అంటే వాస్తవ వృద్ధి దీని కంటే కొంచెం తక్కువగా లేదా ఎక్కువగా ఉండవచ్చు.


78.5 లక్షల ఉద్యోగాలు

మరోవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇబ్బందులు ఉన్నాయని, ఇది మూలధన ప్రవాహాలపై ప్రభావం చూపుతుందని ఆర్థిక సర్వే పేర్కొంది. సేవారంగంలో మున్ముందు మంచి వృద్ధి ఉండవచ్చు. ఉద్యోగావకాశాల కల్పనలో కార్పొరేట్ రంగం పాత్ర పెరగాలి. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం రేటు 2023 మొదటి మూడు నెలల్లో 6.7 శాతానికి తగ్గుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగంలో పెద్దగా నియామకాలు జరగడం లేదు. పెరుగుతున్న శ్రామికశక్తి అవసరాలను తీర్చడానికి భారత ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి వ్యవసాయేతర రంగంలో ఏటా సగటున 78.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి.


ఐదో స్థానానికి భారత్

కోవిడ్-19 మహమ్మారి తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని ఆర్థిక సర్వే పేర్కొంది. FY 24లో వాస్తవ GDP FY 2020 కంటే 20 శాతం ఎక్కువ. ఇది కొన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థలు మాత్రమే సాధించగలిగిన ఘనత. భౌగోళిక రాజకీయ, ఆర్థిక మార్కెట్, వాతావరణ ప్రమాదాలకు లోబడి FY25లో బలమైన వృద్ధిని కొనసాగించే అవకాశాలు బాగానే ఉన్నాయి. ప్రైవేట్ క్యాపిటల్ మార్కెట్‌ బలంగా ఉంది. FY24లో దీని ద్వారా రూ.10.9 లక్షల కోట్ల మూలధనం సమీకరించబడింది. దీంతో భారత స్టాక్ మార్కెట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గణనీయంగా పెరిగింది. ఈ క్రమలో జీడీపీ, మార్కెట్ క్యాపిటలైజేషన్ నిష్పత్తిలో భారత్ ప్రపంచంలోనే ఐదో స్థానానికి చేరుకుంది.


వ్యవసాయంపై

దేశంలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యానికి ప్రాధాన్యత పెరుగుతుందని సర్వే తెలిపింది. ఈ ఏడాది NHAI కోసం 33 ఆస్తులు విక్రయించడానికి గుర్తించబడ్డాయి. ప్రయివేటు రంగం లాభం పెరిగిందని, కానీ ఉపాధి అవకాశాలు అందుకు అనుగుణంగా పెరగలేదని కూడా చెబుతోంది. వ్యవసాయంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సర్వే ప్రస్తావించింది. భవిష్యత్తులో భారతదేశ ఆర్థిక ఆరోగ్యం ఎలా ఉంటుందో ఆర్థిక సర్వే గుర్తు చేసింది. భౌగోళిక-రాజకీయ సవాళ్లు ఉన్నప్పటికీ, దేశ ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని ఆర్థిక సర్వే 2024లో చెప్పబడింది. ఇందులో మానసిక ఆరోగ్యం, వ్యవసాయంపై దృష్టి సారించాలని వెల్లడించింది.


ద్రవ్యోల్బణం

ప్రపంచ సంక్షోభం, సరఫరా గొలుసు అంతరాయాలు, రుతుపవన అనిశ్చితి కారణంగా ద్రవ్యోల్బణ ఒత్తిడిని పరిపాలనా, ద్రవ్య విధానాల ద్వారా సమర్ధవంతంగా నిర్వహించినట్లు ఆర్థిక సర్వే వెల్లడించింది. దీని కారణంగా FY 23లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 6.7 శాతంగా ఉంది. ఎఫ్‌వై24లో 5.4 శాతానికి తగ్గింది. ద్రవ్యోల్బణానికి సంబంధించి ఆర్‌బీఐ అంచనా ప్రకారం సాధారణ రుతుపవన వర్షాలు, బాహ్య లేదా విధానపరమైన షాక్‌లు లేని సందర్భంలో రిటైల్ ద్రవ్యోల్బణం FY2025లో 4.5 శాతం నుంచి FY2026లో 4.1 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. మరోవైపు IMF భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 2024లో 4.6 శాతం, 2025లో 4.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2024, 2025లో గ్లోబల్ ధరలు తగ్గుతాయని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది.


ఇవి కూడా చదవండి:

Economic Survey: ఆర్థిక సర్వే ప్రత్యేకత ఏంటి.. బడ్జెట్‌కు ఒకరోజు ముందే ఎందుకు సమర్పిస్తారు?

8 ఐపీఓలు.. 8 లిస్టింగ్‌లు

Read More Business News and Latest Telugu News

Updated Date - Jul 22 , 2024 | 01:50 PM