Share News

Stock Market Updates: నేడు నిఫ్టీ క్లోజింగ్ డే..లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

ABN , Publish Date - Jan 11 , 2024 | 10:34 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. మరోవైపు ఈరోజు నిఫ్టీ క్లోజింగ్ డే కావడంతో ఈ సూచీ తక్కువ స్థాయి వద్ద కదలాడుతుంది.

Stock Market Updates: నేడు నిఫ్టీ క్లోజింగ్ డే..లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. మరోవైపు ఈరోజు నిఫ్టీ క్లోజింగ్ డే కావడంతో ఈ సూచీ తక్కువ స్థాయి వద్ద కదలాడుతుంది. ఈ క్రమంలో సెన్సెక్స్ ఒక దశలో 300 పాయింట్లు పెరిగి 71,900 దాటగా..నిఫ్టీ కూడా 80 పాయింట్లు జంప్ చేసి 21,600 ఎగువన ట్రేడవుతోంది. బ్యాంకింగ్, ఆటో, మెటల్ రంగాలు మార్కెట్‌లో ఆల్ రౌండ్ వృద్ధిలో ముందంజలో ఉన్నాయి. నిఫ్టీలో హీరో మోటో కార్ప్ 2 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. అంతకుముందు బుధవారం సెన్సెక్స్ 271 పాయింట్లు ఎగబాకి 71,657 వద్ద ముగిసింది.


అయితే అంతర్జాతీయలంగా కొనసాగుతున్న అనుకూల సంకేతాల కారణంగా ప్రధాన సూచీలు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. ఎఫ్‌ఐఐలు భారీగా అమ్ముడవడం, ఆసియా మార్కెట్లు పాజిటివ్ ధోరణి సహా పలు అంశాల కారణంగా సూచీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్ కార్ప్, ఇండస్ఇండ్ బ్యాంక్, BPCL స్టాక్స్ లాభాల్లో కొనసాగుతుండగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్, గ్రాసిమ్, అదానీ పోర్ట్స్, నెస్లే సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి.

Updated Date - Jan 11 , 2024 | 10:34 AM