Switzerland: ఆ హోదా తొలగించి భారత్‌కు షాకిచ్చిన స్విట్జర్లాండ్.. ఇబ్బందులు తప్పవా..
ABN , Publish Date - Dec 13 , 2024 | 06:47 PM
నెస్లేపై కోర్టు ప్రతికూల తీర్పు తర్వాత స్విట్జర్లాండ్ భారతదేశానికి ఇచ్చిన 'మోస్ట్ ఫేవర్డ్ నేషన్' (MFN) హోదాను ఉపసంహరించుకుంది. దీంతో అక్కడి భారతీయులపై ప్రభావం పడనుంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
భారతదేశానికి (india) ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (MFN) హోదాను స్విట్జర్లాండ్ (switzerland ) తాజాగా ఉపసంహరించుకుంది. అందుకు గల కారణాలను కూడా వెల్లడించింది. అయితే నెస్లేకు సంబంధించిన కేసులో భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యతో స్విట్జర్లాండ్‌లో పనిచేస్తున్న భారతీయ కంపెనీలపై పన్ను భారం మరింత పెరగనుంది. జనవరి 1, 2025 నుంచి భారతీయ కంపెనీలు స్విట్జర్లాండ్‌లో తమ ఆదాయంపై అధిక పన్నులు చెల్లించాల్సి ఉంటుందని స్విట్జర్లాండ్ ప్రకటించింది. ఆ క్రమంలో డివిడెండ్ రూపంలో 10% చొప్పున పన్ను విధించబడుతుంది.
MFN అంటే ఏంటి?
MFN స్థితి అనేది భారతదేశం, స్విట్జర్లాండ్ దేశాల మధ్య ఉన్న డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ (DTAA)లో భాగమైన ప్రోటోకాల్. ఈ ఒప్పందం ప్రకారం MFN నిబంధన తాత్కాలికంగా నిలిపివేయబడిందని స్విట్జర్లాండ్ స్పష్టం చేసింది. నెస్లేకి సంబంధించిన కేసులో భారత సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయమే ఈ నిర్ణయానికి కారణమని స్విట్జర్లాండ్ తెలిపింది. నెస్లే ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని వెవీలో ఉంది.
పన్నుల డిమాండ్..
అక్టోబరు 19, 2023న సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పును అనుసరించి, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 90 కింద నోటిఫై చేస్తే తప్ప ద్వంద్వ పన్నుల ఎగవేత ఒప్పందాన్ని (DTAA) అమలు చేయడం సాధ్యం కాదు. దీని కారణంగా నెస్లే SA (నెస్లే ఇండియా మాతృ సంస్థ) వంటి కంపెనీలు, ఇతర స్విస్, డచ్, ఫ్రెంచ్ MNCలు డివిడెండ్‌లపై అధిక పన్నుల డిమాండ్‌ను ఎదుర్కొంటున్నాయి. ఈ తీర్పును ఉటంకిస్తూ స్విస్ అధికారులు భారతదేశం-స్విట్జర్లాండ్ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ (IN-CH DTA) ప్రోటోకాల్‌లోని 5వ పేరా వివరణను భారతదేశం పంచుకోలేదని అంగీకరించారు.
అధికార ప్రతినిధి
ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య పరస్పర అగ్రిమెంట్ లేనట్లయితే, ఇది 1 జనవరి 2025 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఆగస్ట్ 13, 2021 నాటి స్టేట్‌మెంట్‌లో స్విస్ కాంపిటెంట్ అథారిటీ ఆమోదించిన స్థానం 2018-2024 పన్ను సంవత్సరాలలో వచ్చే ఆదాయానికి వర్తిస్తుంది. స్విస్ అధికార చర్యపై స్పందిస్తూ, విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇలా పేర్కొన్నారు. EFTA కారణంగా, DTAA మళ్లీ చర్చలు జరుపుతుందని తెలిపారు. MFN గురించి ఎలాంటి అప్‌డేట్ మాకు రాలేదని అన్నారు.
ఇవి కూడా చదవండి:
Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Bima Sakhi Yojana 2024: మహిళలకు మంచి ఛాన్స్.. బీమా సఖీ యోజనతో రూ. 48 వేలు సంపాదించే అవకాశం..
Read More Business News and Latest Telugu News