Tesla Deal: టెస్లా కార్లలో టాటా సెమీకండక్టర్ చిప్స్.. ఒప్పందం కుదిరినట్లు..
ABN , Publish Date - Apr 15 , 2024 | 11:13 AM
కపై టెస్లా(tesla) కార్లలో టాటా సెమీకండక్టర్ చిప్స్(semiconductor chips) రానున్నాయా? నమ్మశక్యంగా లేదా? కానీ ప్రస్తుతం అలాంటి సంకేతాలే వినిపిస్తున్నాయి. టెస్లా తన గ్లోబల్ కార్యకలాపాలలో ఉపయోగించే సెమీకండక్టర్ చిప్‌లను కొనుగోలు చేయడానికి టాటా ఎలక్ట్రానిక్స్(Tata Electronics)తో వ్యూహాత్మక ఒప్పందంపై సంతకం చేసినట్లు తెలుస్తోంది.
ఇకపై టెస్లా(tesla) కార్లలో టాటా సెమీకండక్టర్ చిప్స్(semiconductor chips) రానున్నాయా? నమ్మశక్యంగా లేదా? కానీ ప్రస్తుతం అలాంటి సంకేతాలే వినిపిస్తున్నాయి. టెస్లా తన గ్లోబల్ కార్యకలాపాలలో ఉపయోగించే సెమీకండక్టర్ చిప్‌లను కొనుగోలు చేయడానికి టాటా ఎలక్ట్రానిక్స్(Tata Electronics)తో వ్యూహాత్మక ఒప్పందంపై సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వెహికల్ (EV) సెక్టార్‌లో అగ్రగామి అయిన అమెరికన్ కంపెనీ అయిన టెస్లా, ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రధాన ఆటోమోటివ్ మార్కెట్ అయిన భారతదేశంలోకి ప్రవేశించడానికి ఆసక్తిగా ఉంది.
ఈ క్రమంలోనే ఎలాన్ మస్క్(Elon Musk) ఈ నెలలో ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi)తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. మస్క్ EV తయారీ సౌకర్యాలు సహా దేశంలో పెట్టుబడులను ప్రకటించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం అతని కంపెనీ మార్కెట్ విలువ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమోటివ్ కంపెనీగా ఉంది. ఈ క్రమంలో టెస్లా భారతదేశంలో తన తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయవచ్చని నివేదికలు చెబుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడూ అంచనాలు మారుతూ ఉన్నాయి. కానీ చాలా మంది పరిశ్రమ నిపుణులు భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడానికి టెస్లా కనీసం రెండు నుంచి మూడు బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టగలరని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల వాహన తయారీదారులు 35,000 డాలర్ల లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన EVలను 15% తక్కువ దిగుమతి సుంకంతో దిగుమతి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారతదేశంలో తయారీ కర్మాగారాలను నెలకొల్పేందుకు మూడేళ్లలోగా 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలనే నిబంధన కూడా ఉంది. దీంతో ఈ అవకాశాన్ని టెస్లా వినియోగించుకోవాలని భావిస్తోంది. ఈ నిర్ణయం ద్వారా టెస్లా భారత మార్కెట్లలో దాని సరఫరాను పెంచుకునే అవకాశం ఉంటుంది.
మరోవైపు సెమీకండక్టర్ల తయారీలో టాటా గ్రూప్ నేతృత్వంలోని టాటా ఎలక్ట్రానిక్స్, అత్యున్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌లను నియమించడం ద్వారా తన వర్క్‌ఫోర్స్‌ను పెంచుకుందని నివేదికలు సూచిస్తున్నాయి. టాటా ఎలక్ట్రానిక్స్ ఇప్పటికే హోసూర్, ధోలేరా, అసోంలో సెమీకండక్టర్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున సెమీకండక్టర్లను తయారు చేస్తుంది.
ఇది కూడా చదవండి:
SIP: ప్రతి రోజు రూ.110 ఇన్‌వెస్ట్ చేయండి.. కోటీశ్వరులుగా మారండి
Special Trains: రూ.200తో రామాలయం టూర్.. సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్స్
మరిన్ని బిజినెస్ వార్తల కోసం