Share News

IPO: వచ్చే వారం రూ. 6,560 కోట్ల ఐపీఓ.. ప్రైస్ బాండ్ ఎంతంటే..

ABN , Publish Date - Sep 07 , 2024 | 09:43 PM

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్(Bajaj Housing Finance) IPO సోమవారం మొదలుకానుంది. అయితే దీనిని తీసుకునే ముందు, ప్రైస్ బ్యాండ్ సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. 2024లో ఇప్పటివరకు వచ్చిన ఐపీఓలలో ఇదే అతిపెద్దది కావడం విశేషం.

 IPO: వచ్చే వారం రూ. 6,560 కోట్ల ఐపీఓ.. ప్రైస్ బాండ్ ఎంతంటే..
next week ipo update

వచ్చే వారం బజాజ్ గ్రూప్‌కి చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్(Bajaj Housing Finance) కంపెనీ (NBFC) బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ సోమవారం(సెప్టెంబర్ 9న) ప్రారంభం కానుంది. ఈ ఐపీఓ ద్వారా రూ.6,560 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 11, 2024 వరకు ఈ IPOలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ కంపెనీ షేర్ల ముఖ విలువ ఒక్కో షేరుకు రూ.10. ఈ IPO కింద కంపెనీ రూ. 3,560 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తోంది. రూ. 3,000 కోట్ల విలువైన షేర్లను(stock market) ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించనున్నారు. కంపెనీ షేర్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో లిస్ట్ చేయబడతాయి. మీరు కూడా ఈ IPOలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, ముందుగా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.


ప్రైస్ బాండ్

ఈ ఇష్యూలో దాదాపు 50 శాతం క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారులకు, 15 శాతం నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (ఎన్‌ఐఐలు), మిగిలిన 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేయబడ్డాయి. ఈ ఐపీఓ ఒక్కో షేరు ధరను రూ.66-70గా కంపెనీ నిర్ణయించింది. దీంతో ఈ IPOలో రిటైల్ పెట్టుబడిదారులు ఒక లాట్ 214 షేర్లకు తీసుకోవచ్చు. గరిష్టంగా 13 లాట్‌లను సబ్‌స్క్రయిబ్ చేయవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో రిటైల్ ఇన్వెస్టర్లు కనిష్టంగా రూ.14,980, గరిష్టంగా రూ.1,94,740 వరకు పెట్టుబడి పెట్టవచ్చు.


ఏ రోజున లిస్ట్

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ల కేటాయింపు సెప్టెంబర్ 12, 2024న ఖరారు అయ్యే అవకాశం ఉంది. ప్రాథమిక మార్కెట్లో బజాజ్ గ్రూప్ NBFC కంపెనీ షేర్ల లిస్టింగ్ సెప్టెంబర్ 16, 2024న జరిగే ఛాన్స్ ఉంది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మాతృ సంస్థ బజాజ్ ఫైనాన్స్. ఈ సంస్థ 2008 సంవత్సరంలో స్థాపించబడింది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సెప్టెంబర్ 2015లో నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌లో NBFCగా నమోదు చేయబడింది. ఇది రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీలను కొనుగోలు చేయడానికి, పునరుద్ధరించడానికి రుణాలను అందిస్తుంది.


యాంకర్ ఇన్వెస్టర్లు

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ IPO శుక్రవారం సెప్టెంబర్ 6న యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ప్రారంభించబడింది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.1,758 కోట్లు సమీకరించింది. యాంకర్ ఇన్వెస్టర్లకు మొత్తం 251,142,856 ఈక్విటీ షేర్లను కేటాయించినట్లు కంపెనీ తెలిపింది. ఒక్కో ఈక్విటీ షేర్‌పై రూ.70 చొప్పున ఈ షేర్లను కేటాయించారు. సింగపూర్ ప్రభుత్వం, ICICI ప్రుడెన్షియల్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, న్యూ వరల్డ్ ఇంక్ యాంకర్ రౌండ్‌లో పాల్గొన్నాయి.


ఇవి కూడా చదవండి:

Stock Market: వచ్చే వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది.. క్షీణిస్తుందా, పెరుగుతుందా..


BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కట్టడికి బీఎస్ఎన్ఎల్ పెద్ద ప్లాన్.. టాటా సపోర్ట్‌తో ఇక..


Money Saving Tips: రోజు రూ.250 సేవ్ చేయండి.. ఇలా రూ.2 కోట్లు సంపాదించండి..


Read MoreBusiness News and Latest Telugu News

Updated Date - Sep 07 , 2024 | 09:45 PM