Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన గోల్డ్ రేట్.. కొనేందుకు బెస్ట్ టైమ్
ABN , Publish Date - Dec 15 , 2024 | 08:38 AM
Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్. పసిడి మరింత తగ్గింది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంత తక్కువ రేట్‌కు పడిపోయింది బంగారం.
బంగారం ముట్టుకుంటే షాక్ కొడుతోంది. ఈ మధ్య వరుసగా పెరుగుతూ పోతున్న పసిడిని టచ్ చేయాలంటే అంతా భయపడుతున్నారు. రూ.80 వేల మార్క్‌కు చేరువలో ఉండటంతో గోల్డ్‌పై ఇన్వెస్ట్‌మెంట్స్ తగ్గాయి. ధర తగ్గినప్పుడు కొందామనే చాలా మంది ఆలోచిస్తున్నారు. ధరాఘాతం వల్ల పసిడిని ఎంతో ఇష్టపడే మహిళలు నిరాశకు లోనవుతున్నారు. అయితే వాళ్లకు గుడ్ న్యూస్. గోల్డ్ రేట్స్ భారీగా తగ్గాయి. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా దిగొచ్చింది పసిడి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి? అనేది ఇప్పుడు చూద్దాం..
దిగొచ్చిన పసిడి
వరుసగా రెండో రోజు దేశీయ మార్కెట్‌లో పసిడి ధరలు భారీగా పడిపోయాయి. డిసెంబర్ 15న హైదరాబాద్‌లో గోల్డ్ రేట్స్ చూసుకుంటే. నిన్న రూ.550 మేర తగ్గిన 22 క్యారెట్ల బంగారం ధర ఆదివారం నాడు మరో రూ.900 వరకు తగ్గింది. దీంతో తులం బంగారం ధర ఇవాళ రూ.71,400 పలుకుతోంది. అదే 24 క్యారెట్ల మేలిమి బంగారమైతే నిన్న రూ.600 తగ్గగా.. నేడు మరో రూ.980 మేర పడిపోయింది. మొత్తంగా సుమారు రూ.1,600 మేర దిగొచ్చింది. 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.77,890 పలుకుతోంది. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. రెండ్రోజుల్లో రూ.4 వేల మేర తగ్గిన సిల్వర్.. ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.1 లక్ష మార్క్ వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read:
హెచ్‌బీఎల్ ఇంజనీరింగ్‌కు రూ.1,522 కోట్ల ఆర్డర్
18న ఐడెంటికల్ బ్రెయిన్స్ ఐపీఓ
గోల్డెన్ ఇయర్
For More Business And Telugu News