Gold Rates: 70 వేల మార్క్ చేరిన బంగారం ధర
ABN , Publish Date - Aug 10 , 2024 | 07:07 AM
పెళ్లిళ్ల సీజన్ దగ్గరికి వచ్చేసింది. బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. నిన్న, మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన ధరలు.. ఈ రోజు (శనివారం) నుంచి పెరుగుదల మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, మంచి రోజులు ప్రారంభం అవడంతో బంగారం ధరలు పెరిగాయి.
హైదరాబాద్: పెళ్లిళ్ల సీజన్ దగ్గరికి వచ్చేసింది. బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. నిన్న, మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన ధరలు.. ఈ రోజు (శనివారం) నుంచి పెరుగుదల మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, మంచి రోజులు ప్రారంభం అవడంతో బంగారం ధరలు పెరిగాయి.
హైదరాబాద్‌లో ఇలా..
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,260కి చేరింది. నిన్నటితో పోలిస్తే రూ.770 పెరిగింది. ఈ రోజు రూ.64,260గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.840 పెరిగింది. నిన్న 10 గ్రాముల ధర రూ.69,260గా ఉండగా ఈ రోజు రూ.70,100కి చేరింది. విశాఖపట్టణం, విజయవాడలో కూడా ఇదేవిధంగా బంగారం ధరలు ఉన్నాయి.
బంగారం ధర | 10 గ్రాములు (22 క్యారెట్లు) | 10 గ్రాములు (24 క్యారెట్లు) |
హైదరాబాద్ | 64,260 | 70,100 |
విజయవాడ | 64,260 | 70,100 |
ఢిల్లీలో ఇలా..
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.770 పెరిగింది. నిన్న 63,640 ఉండగా ఈ రోజు రూ.64,410కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.840 పెరిగింది. నిన్న రూ.69,410గా ఉండగా ఈ రోజు రూ.70,250కి చేరింది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.770 పెరిగింది. నిన్న రూ.63,490గా ఉండగా ఈ రోజు రూ. 64,260కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.840 పెరిగింది. నిన్న రూ.69,260 ఉండగా ఈ రోజు రూ70,100 పెరిగింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,260 ఉండగా, మేలిమి బంగారం ధర రూ.70,100గా ఉంది. వెండి ధర కూడా పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.88,100కి చేరింది.
విశాఖపట్టణం | 64,260 | 70,100 |
ఢిల్లీ | 64,410 | 70,250 |
చెన్నై | 64,260 | 70,100 |