Share News

ITR Filling: ఐటీఆర్ దాఖలుకు నేడే లాస్ట్ ఛాన్స్.. గడువు పెంచుతారా, క్లారిటీ

ABN , Publish Date - Jul 31 , 2024 | 03:15 PM

ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్(ITR filling) చేయడానికి ఈరోజే చివరి తేదీ. జులై 31 తర్వాత ఐటీఆర్ ఫైల్ చేస్తే ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది పన్ను శ్లాబ్ ఆధారంగా ఎంత ఫైన్ చెల్లించాలనేది నిర్ణయించబడుతుంది. అయితే ITR దాఖలు చివరి తేదీని పొడిగించారని సోషల్ మీడియాలో ఓ ప్రకటన వైరల్ అవుతుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

ITR Filling: ఐటీఆర్ దాఖలుకు నేడే లాస్ట్ ఛాన్స్.. గడువు పెంచుతారా, క్లారిటీ
ITR Filling 2024

ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్(ITR filling) చేయడానికి ఈరోజే చివరి తేదీ. జులై 31 తర్వాత ఐటీఆర్ ఫైల్ చేస్తే ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది పన్ను శ్లాబ్ ఆధారంగా ఎంత ఫైన్ చెల్లించాలనేది నిర్ణయించబడుతుంది. ఈ క్రమంలో పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేసేటప్పుడు కొత్త పన్ను విధానం, పాత పన్ను విధానం దీనినైనా ఎంచుకోవచ్చు. ఇదే సమయంలో కొన్ని రోజుల క్రితం గుజరాత్‌కు చెందిన ఒక వార్తాపత్రిక చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిలో ITR దాఖలు చేయడానికి చివరి తేదీని పొడిగించారని ప్రకటించారు. అయితే దీనిపై స్పందించిన పీఐబీ ఫ్యాక్ట్ దాన్ని తనిఖీ చేసి అది నకిలీదని తేల్చి చెప్పింది. ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలుకు చివరి తేదీని పొడిగించలేదని స్పష్టం చేసింది.


5 కోట్ల దాటిన రిటర్నులు

జులై 31 గడువును కోల్పోయిన తర్వాత ఐటీ చట్టంలోని సెక్షన్ 234F ప్రకారం ఆదాయపు పన్ను శాఖ (IT) రూ. 5,000 ఆలస్య రుసుమును విధించవచ్చు. మీ ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువగా ఉంటే, ఆలస్యంగా దాఖలు చేసినందుకు మీరు రూ. 1000 జరిమానా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా ఏదైనా పన్ను బాధ్యత ఉన్నట్లయితే, పన్ను చెల్లింపుదారులు గడువు తేదీ నుంచి బకాయి ఉన్న పన్ను మొత్తంపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234A ప్రకారం నెలకు 1 శాతం చొప్పున వడ్డీని చెల్లించాలి.

ఇక జులై 26 నాటికి 5 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. IT పోర్టల్‌లో సాంకేతిక లోపాలు ఉన్నప్పటికీ గత సంవత్సరంతో పోలిస్తే వీటి సంఖ్య పెరిగిందని చెప్పారు. ఇక నేడు చివరి తేదీ కావడంతో మరిన్ని రిటర్నులు దాఖలయ్యే అవకాశం ఉంది.


ఏ పన్ను విధానం మంచిది

ఒక వ్యక్తికి పాత పన్ను విధానంలో ఎటువంటి తగ్గింపులు లేకుంటే, కొత్త పన్ను విధానం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని టాక్స్‌మన్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ వాధ్వా సూచించారు. పన్ను చెల్లింపుదారుడు సెక్షన్ 80C మినహాయింపును మాత్రమే ఉపయోగిస్తే, కొత్త పన్ను విధానం ప్రయోజనకరంగా ఉంటుంది. సెక్షన్ 80C, 80D కింద మినహాయింపు పొందినట్లయితే, బ్రేక్ ఈవెన్ పాయింట్ రూ. 8,25,000.

మీ ఆదాయం రూ. 8,25,000 కంటే ఎక్కువ ఉంటే, కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C, సెక్షన్ 80D, సెక్షన్ 24 (గృహ రుణంపై వడ్డీ) కింద మినహాయింపులను పొందుతున్న పన్ను చెల్లింపుదారులు పాత పన్ను విధానాన్ని ఎంచుకోవాలన్నారు. మరోవైపు ఒక వ్యక్తి గణనీయమైన ఆర్థిక పెట్టుబడిని చేస్తున్నట్లయితే, అతను పాత విధానానికి కట్టుబడి ఉండాలని వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

Ola Electric: మై మ్యాప్ ఇండియా డేటా చోరీ ఆరోపణలను ఖండించిన ఓలా ఎలక్ట్రిక్


Ola IPO: ఓలా ఐపీఓ షేర్ల ధర ఫిక్స్.. పెట్టుబడికి ఎంత కావాలంటే..

Saving Schemes: ఈ పోస్టాఫీస్ స్కీం ద్వారా ఐదేళ్లలో లక్షాధికారులు కావచ్చు..ఎలాగంటే


Bank Holidays: ఆగస్టులో దాదాపు సగం రోజులు బ్యాంకులు బంద్.. కారణాలివే

Read More Business News and Latest Telugu News

Updated Date - Jul 31 , 2024 | 03:19 PM