Interim Dividend: అగ్ర సంస్థ భారీగా డెవిడెండ్ ప్రకటన.. ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు..
ABN , Publish Date - Dec 16 , 2024 | 08:32 PM
మెటల్స్, మైనింగ్ రంగంలో ప్రముఖ కంపెనీ వేదాంత లిమిటెడ్ తన పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్ తెలిపింది. సోమవారం జరిగిన సమావేశంలో ఈ ఆర్థిక సంవత్సరానికి నాలుగో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించారు. అయితే ఎంత ప్రకటించారు. మొత్తం ఎంత అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలోని మెటల్స్, మైనింగ్ పరిశ్రమ దిగ్గజ సంస్థ వేదాంత (Vedanta) లిమిటెడ్ సోమవారం నాల్గో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఒక్కో షేరుకు రూ. 8.5 డివిడెండ్ అనౌన్స్ చేసింది. ఈ మొత్తం డివిడెండ్ రూ. 3,324 కోట్లు కాగా, డిసెంబర్ 24, 2024 న రికార్డ్ డేట్ ఆధారంగా డివిడెండ్ చెల్లించబడుతుందని కంపెనీ తెలిపింది. సోమవారం మార్కెట్ ముగిసిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది.
ఈ క్రమంలో వేదాంత షేర్లు BSEలో 1.21% తగ్గి రూ. 513.40 వద్ద ముగిశాయి. ఇది మునుపటి ముగింపు రూ. 519.70 కంటే తక్కువ. ఈ రోజు ప్రారంభ ట్రేడింగ్‌లో షేర్లు గరిష్టంగా రూ. 527కి చేరుకున్నాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ. 2 లక్షల కోట్లకు చేరుకుంది. BSEలో 7.99 లక్షల షేర్ల విక్రయం ద్వారా రూ. 41.21 కోట్ల లావాదేవీ జరిగింది.
రేటింగ్ మార్పులు
ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాణిజ్య పత్రాల రేటింగ్‌ను ఉపసంహరించుకుంది. దీంతోపాటు నాన్-కన్వర్టింగ్ డిబెంచర్స్ (NCDలు) రేటింగ్‌ను 'IND AA-/రేటింగ్ వాచ్ విత్ డెవలపింగ్ ఇంప్లికేషన్స్'కి పెంచిందని వేదాంత తెలిపింది.
ఫలితాలు కూడా..
సెప్టెంబరు 2024తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 5,603 కోట్లుగా ఉంది. ఇది గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ. 915 కోట్ల నష్టం కంటే మెరుగ్గా ఉంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం రూ. 2,378.2 కోట్ల కంటే ఎక్కువ. ఈ త్రైమాసికంలో వాయిదా వేసిన పన్ను కింద రూ. 1,868 కోట్ల లాభం వచ్చింది. అయినప్పటికీ చమురు, గ్యాస్ ఆదాయాలలో 60% క్షీణత నమోదైంది. దీంతో ఇనుము ధాతువు విక్రయాలలో 30% క్షీణత కంపెనీ మొత్తం ఆదాయాలపై ప్రభావం చూపింది. అదనంగా ముడిసరుకు ఖర్చులలో సంవత్సరానికి 16% పెరుగుదల కంపెనీ మొత్తం లాభాలపై ఒత్తిడి తెచ్చింది. ఇదిలావుండగా కంపెనీ తన లాభాల్లో బలాన్ని ప్రదర్శించింది.
ఈ ఏడాదిలోనే..
వేదాంత లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు డిసెంబర్ 16, 2024 న జరిగిన సమావేశంలో ఈక్విటీకి రూ. 1 ముఖ విలువతో ఈక్విటీ షేరుకు రూ. 8.5 నాల్గవ మధ్యంతర డివిడెండ్‌ను ఆమోదించినట్లు వేదాంత తన ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వాటా ఆమోదించబడింది. డివిడెండ్ నిర్ణీత తేదీలోపు పంపిణీ చేయబడుతుంది. ఈ క్రమంలో గత 12 నెలల్లో వేదాంత ఒక్కో షేరుకు రూ. 46 డివిడెండ్ ప్రకటించించడం విశేషం. ఫలితంగా డివిడెండ్ నుంచి 8.96% రాబడి వచ్చింది.
ఇవి కూడా చదవండి:
Top Mutual Funds: గత ఐదేళ్లలో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే..
Narayana Murthy: 70 గంటల పని విధానాన్ని మళ్లీ ప్రస్తావించిన నారాయణమూర్తి.. ఈసారి ఏం చెప్పారంటే..
Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు
Advance Tax Deadline: ఈరోజే ఐటీఆర్ అడ్వాన్స్ ట్యాక్స్ డెడ్‌లైన్.. రేపు కూడా చెల్లించవచ్చా..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Bima Sakhi Yojana 2024: మహిళలకు మంచి ఛాన్స్.. బీమా సఖీ యోజనతో రూ. 48 వేలు సంపాదించే అవకాశం..
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Read More Business News and Latest Telugu News