Share News

Best Car Color: ఏ రంగు కార్ కొంటే మంచిది.. మెయింటనెన్స్ కూడా తక్కువ

ABN , Publish Date - Oct 10 , 2024 | 12:02 PM

పండుగల సమయాల్లో అనేక మంది వాహనాలు కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అయితే ఏ రంగు వాహనం కొనుగోలు చేస్తే మంచిది. దేనికి ధర ఎక్కువగా ఉంటుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ఇవి తెలుసుకోకుంటే మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది.

Best Car Color: ఏ రంగు కార్ కొంటే మంచిది.. మెయింటనెన్స్ కూడా తక్కువ
Which color car better to buy

దేశవ్యాప్తంగా దసరా, దీపావళి పండుగల సీజన్ వచ్చేసింది. ఈ సమయంలో అనేక మంది కొత్త వాహనాలు కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. అయితే వాహనాల రంగు ఎంపికలో మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కొన్ని కలర్ల వాహనాలను ఎంపిక చేసుకుంటే వాటికి మెయింటనెన్స్ ఖర్చు ఎక్కువ అవుతుందని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఎలాంటి రంగు వాహనాలను(car) ఎంపిక చేసుకోవాలి. ఏది తీసుకుంటే తక్కువ ఖర్చు అవుతుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.


ఎండాకాలంలో

ఇక కార్ల(cars) కొనుగోలు విషయానికి వస్తే మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. కానీ కొన్ని రంగుల కార్లు తీసుకుంటే మాత్రం ఎండాకాలంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. నలుపు లేదా ముదురు రంగు కార్లు సూర్యరశ్మిని త్వరగా గ్రహిస్తాయి. దీంతో ఎండాకాలంలో కార్ లోపల ఏసీ లేకుండా ప్రయాణించడం కష్టమవుతుంది. వేసవిలో కారు లోపల చల్లగా ఉండాలంటే మీరు ACని తప్పక వినియోగించాల్సి ఉంటుంది. ఇది కారు మైలేజ్, పనితీరుపై ప్రభావం చూపుతుంది. చల్లని వాతావరణంలో కార్లు ఎక్కువ మైలేజీని ఇవ్వడానికి ఇది కూడా ఓ కారణం. అదే తెలుపు, సిల్వర్ లేదా ఏదైనా లేత రంగు కార్లు తక్కువ సూర్యకాంతిని గ్రహించి ఎక్కువ ప్రతిబింబిస్తాయి.

ఇవి కూడా చదవండి:

Tata Shares: రతన్ టాటా మృతి.. ఈ కంపెనీల షేర్లు తగ్గాయా, పెరిగాయా..


ఈ రంగులకు

తెలుపు, బూడిద, సిల్వర్ కలర్ కార్లకు ఏదైనా గీతలు, దుమ్ము పడినా ఎక్కువగా కనిపించదు. కానీ నలుపు, ఎరుపు వంటి ఇతర రంగుల వాహనాల్లో గీతలు, ధూళి వంటి వాటిని గుర్తించడం చాలా సులభం. లేత రంగులకు తక్కువ శ్రమ అవసరం. ముదురు రంగులకు బాడీ ప్యానెల్‌లను పాలిష్ చేయడానికి ఎక్కువ సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఎరుపు వంటి ప్రకాశవంతమైన రంగులు బీమా ప్రీమియంలను పెంచుతాయని ఒక సాధారణ అపోహ ఉంది. కానీ కారు రంగు దాని బీమాపై ఎలాంటి ప్రభావం చూపదు. బీమా కంపెనీలు శ్రద్ధ వహించే ఏకైక విషయం ఏమిటంటే, మీ వాహనం తయారీ, మోడల్, ఇతర విషయాలతోపాటు దాన్ని రిపేర్ చేయడానికి ఎంత ఖర్చవుతుందనే పలు విషయాలను మాత్రమే చూస్తారు.


రీ సేల్

మరోవైపు కారు రంగు దాని పునఃవిక్రయం విలువపై కూడా ప్రభావం చూపిస్తుంది. చాలా మంది కొనుగోలుదారులు తెలుపు, బూడిద లేదా సిల్వర్ రంగు కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఓ అధ్యయనం ప్రకారం నలుపు రంగు కార్లతో పోలిస్తే తెలుపు రంగు కార్లలో ప్రమాదాలు జరిగే అవకాశం 12 శాతం తక్కువ. తెలుపు తర్వాత క్రీమ్ లేదా పసుపు రంగు కార్లు సురక్షితమైనవిగా పరిగణించబడతాయి. అదే సమయంలో నలుపు రంగు కారులో ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటి తర్వాత బూడిద, సిల్వర్, నీలం రంగులు వస్తాయి.


ఇవి కూడా చదవండి:


Ratan Tata: టాటా గ్రూపు ఓనరైన రతన్ టాటా ఆస్తులు ఎంత.. కంపెనీ ప్రాపర్టీ ఎంత..


Ratan Tata: ఈ ఒక్క కారణంతో.. రతన్ టాటా విదేశాల నుంచి భారత్ వచ్చేశారు..


SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి



Read More Business News and Latest Telugu News

Updated Date - Oct 10 , 2024 | 12:04 PM