Share News

Multibagger Stock: రూ.1,113 నుంచి రూ.10,310కి చేరిన షేర్ ప్రైస్.. ఐదేళ్లలోనే మల్టీబ్యాగర్‌ లిస్ట్‌లోకి..

ABN , Publish Date - Aug 09 , 2024 | 05:16 PM

దేశీయ స్టాక్ మార్కెట్లో(stock market) మరో కంపెనీ మల్టీబ్యాగర్‌ జాబితాలోకి చేరింది. అదే మైనింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల కోసం పారిశ్రామిక పేలుడు పదార్థాలు, రక్షణ ఉత్పత్తులను తయారు చేస్తున్న సోలార్ ఇండస్ట్రీస్(Solar Industries). ఈ కంపెనీ షేర్లు గత కొన్నేళ్లుగా మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇస్తుంది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Multibagger Stock: రూ.1,113 నుంచి రూ.10,310కి చేరిన షేర్ ప్రైస్.. ఐదేళ్లలోనే మల్టీబ్యాగర్‌ లిస్ట్‌లోకి..
multibagger stocks

దేశీయ స్టాక్ మార్కెట్లో(stock market) మరో కంపెనీ మల్టీబ్యాగర్‌ జాబితాలోకి చేరింది. అదే మైనింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల కోసం పారిశ్రామిక పేలుడు పదార్థాలు, రక్షణ ఉత్పత్తులను తయారు చేస్తున్న సోలార్ ఇండస్ట్రీస్(Solar Industries). ఈ కంపెనీ షేర్లు గత కొన్నేళ్లుగా మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇస్తుంది. అయితే ఐదేళ్ల క్రితం రూ.1113గా ఉన్న ఈ షేర్ ధర ఈ ఏడాది రూ.13,298కి చేరుకుంది. రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఈ స్టాక్ మళ్లీ క్షీణించింది. గత నెల రోజుల్లోనే సోలార్ ఇండస్ట్రీస్ షేర్లు 14 శాతం పడిపోయాయి. కానీ విశేషమేమిటంటే చాలా బ్రోకరేజీ సంస్థలు ఈ స్టాక్‌కు ఇంకా బలం ఉందని పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే నేడు(ఆగస్టు 9న) ఎన్‌ఎస్‌ఈలో సోలార్ ఇండస్ట్రీస్ షేర్లు స్వల్ప పెరుగుదలతో రూ.10,301.95కు చేరుకున్నాయి.


838 శాతం రాబడి

అయితే సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ షేర్లు గత ఐదేళ్లలో మల్టీబ్యాగర్‌గా(Multibagger stock) మారాయి. ఈ సమయంలో ఈ స్టాక్ ఇన్వెస్టర్లకు 838 శాతం రాబడిని ఇవ్వడం విశేషం. అంటే ఐదేళ్ల క్రితం ఈ కంపెనీలో లక్ష రూపాయలు పెట్టుబడి చేసిన వారికి ఇప్పుడు 8 లక్షల 38 వేల రూపాయలు వచ్చాయని చెప్పవచ్చు. ఈ డిఫెన్స్ స్టాక్ గత ఏడాదిలో 162 శాతం రాబడిని, గత రెండేళ్లలో 230 శాతం రాబడిని అందించింది.

గత ఆరు నెలల్లోనే సోలార్ ఇండస్ట్రీస్ షేర్ ధర దాదాపు 50 శాతం పెరిగింది. కాబట్టి ఇప్పటి వరకు 2024 సంవత్సరంలో ఈ షేర్ పెట్టుబడిదారులకు దాదాపు 53 శాతం రాబడిని ఇచ్చింది. ఈ ఏడాది జూలై 11న ఈ షేరు తన ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి రూ.13,298కి చేరుకుంది. సోలార్ ఇండస్ట్రీస్ షేర్ 52 వారాల కనిష్ట ధర రూ.3,877.65గా ఉంది.


బ్రోకరేజ్ సంస్థలు

ప్రస్తుతం సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా షేర్లు(Solar Industries shares) 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు, 50 రోజుల మూవింగ్ యావరేజ్ కంటే దిగువన ట్రేడవుతున్నాయి. అయితే 100 రోజులు, 150 రోజులు, 200 రోజుల సగటు కంటే ఎక్కువగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. బ్రోకరేజ్ సంస్థ ఐసీఐసీఐ సోలార్ ఇండస్ట్రీస్ షేర్‌కు 'బై' రేటింగ్ ఇచ్చింది. ఈ బ్రోకరేజ్ ఇప్పుడు ఈ షేర్ టార్గెట్ ధరను రూ.13,250కి పెంచింది.

నువామా ఈ స్టాక్‌పై తన 'హోల్డ్' రేటింగ్‌ను కొనసాగించింది. అయితే టార్గెట్ ధరను రూ.9247 నుంచి రూ.11,140కి పెంచింది. సెంట్రమ్ బ్రోకింగ్ కూడా తన 'బై' రేటింగ్‌ను కొనసాగించింది. ఈ స్టాక్‌లో రూ. 11665 ధర లక్ష్యంతో పెట్టుబడి పెట్టాలని పెట్టుబడిదారులకు సూచించింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ విలువ ప్రస్తుతం రూ.93,559 కోట్లుగా ఉంది.

గమనిక: మాకు లభించిన సమాచారం ఆధారంగా ఈ స్టాక్ గురించి తెలుపడం జరుగుతుంది. కానీ పెట్టుబడి చేయాలని కాదు. మీరు ఇన్వెస్ట్ చేయదలిస్తే నిపుణుల సలహాలు తీసుకుని చేయాలని సూచన.


ఇవి కూడా చదవండి:

Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం.. ఏటా 50 లక్షలకుపైగా సంపాదించే ఛాన్స్!


Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్

Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 09 , 2024 | 05:21 PM