Share News

Bank Manager Cheated: NRI మహిళను రూ.13.5 కోట్లకు చీట్ చేసిన బ్యాంక్ మేనేజర్.. ఏమైందంటే

ABN , Publish Date - Feb 28 , 2024 | 07:16 AM

ఓ NRI మహిళ తనను ఐసీఐసీఐ బ్రాంచ్ మేనేజర్ దాదాపు రూ.13.5 కోట్ల మేర మోసం చేశారని తెలిపింది. అయితే అసలు ఏం జరిగింది, ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Bank Manager Cheated: NRI మహిళను రూ.13.5 కోట్లకు చీట్ చేసిన బ్యాంక్ మేనేజర్.. ఏమైందంటే

ఓ NRI మహిళ తనను ఐసీఐసీఐ(ICICI) బ్రాంచ్ మేనేజర్(bank manager) దాదాపు రూ.13.5 కోట్ల మేర మోసం చేశారని తెలిపింది. బీబీసీ కథనం ప్రకారం ఈ మహిళ పేరు శ్వేతా శర్మ కాగా అమెరికన్ అకౌంట్ నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు పంపించానని తెలిపింది. అది ఎఫ్‌డీగా మారుస్తామని అతను ఆశాభావం వ్యక్తం చేశారని శర్మ ఆరోపించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

వాస్తవానికి శ్వేతాశర్మ, ఆమె భర్త చాలా దశాబ్దాలుగా అమెరికా(USA), హాంకాంగ్‌(hong kong)లో నివసించారు. ఆ తర్వాత 2016లో భారత్‌కు తిరిగొచ్చారు. ఇక్కడ అతని స్నేహితులలో ఒకరైన అమెరికన్ బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయడానికి వడ్డీ చాలా తక్కువ అని చెప్పారు. అందువల్ల వారు తమ డబ్బును భారతదేశంలో డిపాజిట్ చేయాలని వారు భావించారు. మన దేశంలో FDపై 5.5 నుంచి 6 శాతం వరకు పొందవచ్చు. ఆ నేపథ్యంలోనే గురుగ్రామ్‌లో ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్‌ బ్రాంచ్‌కి వారు వెళ్లారు. అక్కడ వీరు ఎన్నారై ఖాతా తెరిచారు. ఆ క్రమంలో 2019లో వారు US బ్యాంక్ ఖాతా నుంచి ICICI బ్యాంక్ ఖాతాకు డబ్బును పంపించారు. డిసెంబర్ 2023 నాటికి వారు దాదాపు రూ. 13.5 కోట్లు డిపాజిట్ చేశాడు. దీనిపై వడ్డీ కలిపితే ఆ మొత్తం రూ.16 కోట్లకు చేరింది.


కానీ ఇటివల అన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లు కనిపించకుండా పోయాయని, ఆ డిపాజిట్లపై రూ.2.5 కోట్ల ఓవర్‌డ్రాఫ్ట్ కూడా తీసుకున్నట్లు గుర్తించామని శ్వేతావర్మ వెల్లడించారు. తన ఖాతాల నుంచి డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు బ్యాంకు అధికారి నకిలీ ఖాతాలు తెరిచి ఫోర్జరీ సంతకాలు చేశారని శ్వేతా శర్మ తెలిపారు. దీని తరువాత తన పేరు మీద డెబిట్ కార్డు, చెక్ బుక్ కూడా జారీ చేసి ఆ అధికారి తనకు ఫేక్ స్టేట్‌మెంట్లు చూపించారని తెలిపింది. దీంతోపాటు తన పేరు మీద నకిలీ ఈమెయిల్ ఐడీ సృష్టించి, బ్యాంకు రికార్డుల్లో నా మొబైల్ నంబర్‌ను మార్చారని ఆ క్రమంలోనే డబ్బు ఉపసంహరణకు సంబంధించిన సమాచారం తనకు అందలేదని శ్వేతా శర్మ వెల్లడించారు.

ఈ మోసం గురించి జనవరి 2024లో తమకు సమాచారం వచ్చిందని ఆమె తెలిపారు. దీనిపై బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశామని అన్నారు. దీంతో జనవరి 16న అధికారులతో తొలి సమావేశం నిర్వహించగా అందులో బ్యాంక్ ప్రాంతీయ, జోనల్ హెడ్‌లతో పాటు ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ హెడ్‌తో సమావేశం జరిగిందని చెప్పారు. అప్పుడు బ్రాంచ్ మేనేజర్ మోసం చేసినట్లు అంగీకరించాడు. BBC నివేదిక ప్రకారం ICICI బ్యాంక్ ప్రతినిధి మాట్లాడుతూ ఈ మోసం వాదన నిజమేనని చెప్పారు. ఆ క్రమంలో ఈ కేసులో ప్రమేయమున్న వారికి కూడా శిక్ష పడుతుందని చెప్పినట్లు వెల్లడించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Hyderabad: లైక్‌, సబ్ స్క్రైబ్.. రూ.49.45 లక్షలు గాయబ్‌...

Updated Date - Feb 28 , 2024 | 07:36 AM