AP: రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఘనుడు.. మైనర్ బాలికపై అత్యాచారం చేసి..
ABN , Publish Date - Nov 13 , 2024 | 11:06 AM
కృష్ణా జిల్లా ముస్తాబాద గ్రామంలో మైనర్ బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్ళారు. బాలికను పరిక్షించిన వైద్యులు బాధిత తల్లిదండ్రులకు షాకింగ్ విషయం చెప్పారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
కృష్ణా జిల్లా: బాలికలకు ఏ మాత్రం భద్రత లేకుండా పోయింది. అభం శుభం తెలియని చిన్నారులపై రోజురోజుకూ అఘాయిత్యాలు పెరుగుతునే ఉన్నాయి. కఠిన శిక్షలు ఎన్ని అమలవుతున్నా కామాందులు మాత్రం తమ తీరు తమదే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. పసి మనసులకు పెనుగాయాలు చేస్తున్న సంఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే..
ముస్తాబాద గ్రామానికి చెందిన మైనర్ బాలిక కడుపు నొప్పితో బాధపడుతుంటే తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్ళారు. బాలికను పరిక్షించిన వైద్యులు బాలికను గర్భవతిగా నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు బాలికను మందలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఘనుడు..
అదే గ్రామానికి చెందిన రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఘనుడు.. పులివర్తి ప్రశాంత్ అలియాస్ (బన్ను) మైనర్ బాలికపై అఘాయిత్యాం చేశాడు. ఘటనపై బాలిక తల్లిదండ్రులు గన్నవరం పోలీసులను ఆశ్రయించి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఫోక్సు కేసు నమోదు చేసి అతడిని కోర్టుకు హాజరుపరచునున్నారు. బాలికను వైద్య పరీక్షలు నిమిత్తం విజయవాడ జిజిహెచ్‌కు తరలించారు.