Hyderabad: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో రూ.15లక్షల విలువైన ఆభరణాలు చోరీ
ABN , Publish Date - Nov 09 , 2024 | 06:46 AM
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(Private Travels Bus)లో గుర్తుతెలియని వ్యక్తులు రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలున్న బ్యాగును అపహరించుకుపోయారు. బ్యాగు కనిపించకపోవడంతో బాధితురాలు అబ్దుల్లాపూర్‌మెట్(Abdullahpurmet) పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(Private Travels Bus)లో గుర్తుతెలియని వ్యక్తులు రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలున్న బ్యాగును అపహరించుకుపోయారు. బ్యాగు కనిపించకపోవడంతో బాధితురాలు అబ్దుల్లాపూర్‌మెట్(Abdullahpurmet) పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట(Mandapeta)కు చెందిన గీతారత్నం గురువారం రాత్రి శ్రీకృష్ణా ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్‌కు బయలుదేరారు.
విజయవాడలో ఓసారి ఆపిన బస్సు డ్రైవర్, టీ బ్రేక్ కోసం నార్కెట్‌పల్లి సమీపంలో మరోసారి బస్సును ఆపాడు. టీ తాగిన అనంతరం ప్రయాణికులు బస్సు ఎక్కారు. ఆ తర్వాత గీతారత్నం నగల బ్యాగు కనిపించలేదు. ఈ విషయాన్ని బాధితురాలు వెంటనే డ్రైవర్‌కు తెలిపారు. నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్ రామోజీ ఫిల్మ్‌సిటీ(Abdullapurmet Ramoji Filmcity) వద్దకు బస్సు చేరుకోగానే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నగల విలువ రూ.15లక్షలు ఉంటుందని తెలిపారు. వెంటనే పోలీసులు బస్సులో ఉన్న ప్రయాణికులను తనిఖీ చేశారు. వారి వద్ద ఎలాంటి నగలు లభించకపోవడంతో బస్సును అక్కడి నుంచి పంపించి వేశారు. విచారణ కోసం కానిస్టేబుల్‌ను బాధితురాలితో కలిసి బస్సు ఆపిన ప్రాంతానికి పంపించారు. అనంతరం గీతారత్నం నార్కెట్‌పల్లి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: మెడికల్ రీయింబర్స్‌మెంట్.. ఆన్‌లైన్‌లోనే!
ఈవార్తను కూడా చదవండి: AV Ranganath: బెంగళూరులో ముగిసిన ‘హైడ్రా’ పర్యటన
ఈవార్తను కూడా చదవండి: jeevan Reddy:మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాల్‌కు మరోసారి నోటీసులు
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకుంటే కుక్కచావే
Read Latest Telangana News and National News