Share News

Drugs Seizure: రూ.480 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఆరుగురు అరెస్ట్

ABN , Publish Date - Mar 12 , 2024 | 05:18 PM

మరోసారి దేశంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడింది. గుజరాత్ తీరంలో పోలీసులు నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో ఆరుగురు పాకిస్థానీలు అడ్డంగా దొరికిపోయారు.

Drugs Seizure: రూ.480 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఆరుగురు అరెస్ట్

మరోసారి దేశంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడింది. గుజరాత్(gujarat) తీరంలో పోలీసులు నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో ఆరుగురు పాకిస్థానీలు అడ్డంగా దొరికిపోయారు. అంతేకాదు ఆ క్రమంలో వారి నుంచి ఏకంగా రూ.480 కోట్ల విలువైన 80 కిలోల డ్రగ్స్‌(drugs)ను స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ ATS, ఇండియన్ కోస్ట్ గార్డ్, NCB నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో ఈ అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పటివరకు కోస్ట్ గార్డ్, ఏటీఎస్, ఎన్‌సీబీ కలిసి రూ.3,135 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Gangster: ఆరు గంటల పెరోల్ తీసుకుని పెళ్లి చేసుకున్న గ్యాంగ్‌స్టర్


పట్టుబడిన ఈ పాకిస్థానీలను తదుపరి విచారణ కోసం పోర్‌బందర్‌కు తీసుకొచ్చారు. మార్చి 11, 12న రాత్రి ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా అధికారుల ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్ బోట్‌(Pakistani Boat)ను ఇండియన్ కోస్ట్ గార్డ్ పట్టుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోర్‌బందర్‌(Porbandar)కు 350 కి.మీ దూరంలోని అరేబియా సముద్రంలో ఆ పడవను అడ్డుకున్నారు. ఈ ఆపరేషన్‌లో ICG, NCB, ATS గుజరాత్‌ అధికారుల మధ్య మంచి సమన్వయం కారణంగా ఈ పడవను పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గత మూడేళ్లలో ఏటీఎస్‌ గుజరాత్‌, ఎన్‌సీబీ సంయుక్తంగా ఐసీజీ చేసిన అరెస్ట్‌ ఇది 10వది కావడం విశేషం. ఇందులో రూ.3135 కోట్ల విలువైన 517 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Mar 12 , 2024 | 05:28 PM